హైదరాబాద్: రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు ఐదుగురు సభ్యులతో కూడిన మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. బిజెపి శాసనసభ పక్ష ఉప నాయకులు పాయల్ శంకర్, పార్లమెంట్ సభ్యులు ఎం రఘునందన్ రావు, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు గరికపాటి మోహన్ రావు, మాజీ శాసనసభ్యులు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, బిజెపి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ గౌతమ్ రావు తదితరులతో కమిటీని ఏర్పాటు చేశారు.