విశాఖపట్నం: నగరానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా రానున్నారు.
జెపి నడ్డా పాల్గొనే కార్యక్రమల ఏర్పాటు పై ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ నేతృత్వంలో సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. అనంతరం ఎక్కడ సమావేశం నిర్వహించాలి అనే అంశంపై పలు ప్రాంతాల ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాధవ్‌తోపాటు బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, రాష్ట్ర కార్యదర్శి కెతినేని సురేంద్ర మోహన్, జిల్లా అధ్యక్షుడు మురళీ పరసురామరాజు, సీనియర్ నాయకులతో వేదిక పరిశీలన చేశారు. అయితే, తేదీలు ఖరారు కావాల్సి ఉంది.