-ఉండవల్లి నుంచి యాత్ర
-ప్రారంభించనున్న సోము, కన్నా
-75 కిలో మీటర్ల మేర సాగనున్న యాత్ర
ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలనే డిమాండ్‌తో ఇప్పటికే రాజధాని రైతులు దీక్షలు కొనసాగిస్తుండగా… తాజాగా అమరావతి కోసం బీజేపీ సైతం పాదయాత్ర చేపట్టనుంది. ఈ నెల 29న తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఈ యాత్ర ప్రారంభం కానుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ యాత్రను ప్రారంభించనున్నారు. రాజధాని గ్రామాల మీదుగా ఈ యాత్ర 75 కిలో మీటర్ల మేర సాగనుందని బీజేపీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.