– కేసీఆర్ ప్రజలపై ప్రేముంటే… మోకాళ్లపై పాదయాత్ర చెయ్
– కేసీఆర్ కు మందులో సోడా కలిపే వాళ్లంతా నేడు మంత్రులయ్యారు
– కేసీఆర్ కుటుంబంలో ఏ ఒక్కరు ప్రాణత్యాగం చేయలే
ఎల్కూరు గ్రామంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
ప్రజల కష్టాలు, బాధలు తెలుసుకుని మీకు బిజెపి భరోసాగా, అండగా ఉంటుందని తెలిపేందుకే ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల ముందుకు వచ్చా. దేశ ప్రధాని నరేంద్ర మోదీ రోజు 18 గంటలు పనిచేసి.. 4 గంటలు నిద్రపోతే……. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం 4 గంటలు కూడా పనిచేయడు.
కేసీఆర్ కు ప్రజలపై ప్రేముంటే… మోకాళ్లపై పాదయాత్ర చెయ్….. ఆయనను ఎవ్వరూ వద్దనరు. కానీ మేం పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుంటుంటే మాపై దాడులకు తెగబడుతున్నారు టీఆర్ఎస్ నాయకులు.రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు స్థాపించారో… ఎన్ని ఉద్యోగాలిచ్చారో కేసీఆర్ స్పష్టం చేస్తే……. కేసీఆర్ కు తోమాల సేవ చేస్తా. తప్పులు చెబితే బడితె పూజ చేస్తాం.
ఎల్కూరు గ్రామంలో కాలేజీ లేదు… ఆసుపత్రి లేదు… కనీస సదుపాయాలు లేవు… కానీ,… ఏ గ్రామానికెళ్లినా కేసీఆర్ షాపులు (వైన్ షాపులు, బెల్ట్ షాపులు) మాత్రం ఖచ్చితంగా ఉంటున్నాయ్. కేసీఆర్ కు మందులో సోడా కలిపే వాళ్లంతా నేడు మంత్రులయ్యారు.
కేసీఆర్ నియంతృత్వ పాలనపై బిజెపి యుద్ధం చేస్తోంది. ప్రగతిభవన్, ఫాంహౌస్ లో పడుకున్న కేసీఆర్ ను ధర్నా చౌక్ కు లాక్కొచ్చినం. కేసీఆర్ కు గట్టిగా సెగ పెడితే దేశం మొత్తం తిరుగుతుండు.
తుంగభద్ర, కృష్ణా నది నడుమ నడిగడ్డ ఉంది.రూ. వెయ్యి కోట్లు ఖర్చుపెడితే నెట్టెంపాడు, ఆర్డీఎస్
పనులు పూర్తవుతయి.. పాలమూరు ప్రజలకు సాగునీరు అందుతది. కాని, కేసీఆర్ కు సారుకు కనికరం లేదు. పాలమూరును ఎడారిగా, కరువు ప్రాంతంగానే మార్చాలనుకుంటుండు.ఈ పాలమూరు, నడిగడ్డ ప్రజల బాధలు తెలంగాణ రాష్ట్రానికి మొత్తం చూపెట్టాలి. ఇప్పుడు మనకు ఆ అవకాశం వచ్చింది. పోరాటం చేసే సమయం ఆసన్నమైంది.
పాలమూరు ప్రజల కష్టాలు, బాధలు, సమస్యలు తీర్చాలని కేసీఆర్ ను ప్రశ్నించేలా తెలంగాణ ప్రజానీకం మొత్తం మద్దతిస్తున్నరు. ప్రజా మద్దతుతోనే ఈ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాం.కాళేశ్వరం, ఫాంహౌజ్ కు మధ్య 200 కి.మీ దూరం ఉంది. ఫాంహౌస్ దారుల కోసం లక్ష కోట్ల ప్రజాసొమ్మును ఖర్చుపెట్టిండు కేసీఆర్.
కానీ నడిగడ్డ ప్రజలకు నీళ్లిచ్చేందుకు నీకు ఎందుకు మనసు రావడం లేదు..?ఇక్కడి ప్రజలకు కనీసం ఆసుపత్రి లేదు.. కాలేజీలు లేవు…. కాని, కేసీఆర్ మాత్రం ఎన్నికలొచ్చినప్పుడు వచ్చి ప్రజలకు మాయమాటలు చెబుతూ మోసం చేస్తూ ఓట్లు కొల్లగొడ్తున్నడు.పేదోడికి ఉచితంగా వైద్యం-విద్య అందిస్తమని ప్రజా సంగ్రామ యాత్ర తొలి విడతలో ప్రకటించినం.
పేదలు ఉన్నత విద్య అందకుండా చేసి విద్యను వ్యాపారంగా మలిచిన దుర్మార్గపు ప్రభుత్వం టీఆర్ఎస్.ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణలో అమలు కానివ్వకుండా పేదోడికి వైద్యం అందకుండా అడ్డుకుంటున్నడు కేసీఆర్.నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణకు లక్షా 40 వేల ఇండ్లు మంజూరు చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు ఇండ్లు కట్టియ్యడం లేదు.
నడిగడ్డ ప్రాంతానికి ఎన్ని ఇండ్లు ఇచ్చినవో లబ్ధిదారుల జాబితా ఇవ్వమని కేసీఆర్ ను అడిగితే… చప్పుడు లేదు. కేంద్రమిచ్చే పైసలు సంపుకున్నడు.పేదలకు ఇండ్లు కట్టిస్తే బిజెపికి మంచి పేరొస్తదనే అక్కసుతో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇండ్లను పేదలకు దక్కకుండా చేస్తున్నడు.
మహిళలకు వడ్డీలేని రుణాలిస్తోంది కేంద్ర ప్రభుత్వం….. గ్రామ పంచాయతీలకు, రోడ్లకు, డ్రైనేజీలకు, కమ్యూనిటీ హాళ్లకు, మరుగుదొడ్లకు, స్ట్రీట్ లైట్లకు పైసలిచ్చేది కేంద్ర ప్రభుత్వమే.. కాని, ఆ పైసలను జేబుల్లో నింపుకుంటూ పేదలకు అందకుండా చేస్తున్నడు ఈ దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి కేసీఆర్.
తెలంగాణలో పేదోడు పేదోడుగానే మిగిలిపోతుండు… పెద్దోడు పెద్దోడుగానే రాజ్యమేలుతుండు.రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నరు. ఇంటికి వెయ్యి రూపాయలు మించేలా కరెంట్ ఛార్జీలు బాదుతూ సామాన్యుడిని ఆగం చేస్తున్నడు.
కేసీఆర్ ఫాంహౌస్ లో ఫ్రీగా కరెంట్ వాడుతున్నడు. ఆయన ఫాంహౌస్ లో వాడే ఉచిత కరెంటును …… 30 గ్రామాలకు అందించవచ్చు. కేసీఆర్ ఫాంహౌస్ కు ఫ్రీగా కరెంట్ వాడుకుంటూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ రాక్షసానందం పొందుతున్నడు.
వరి వేస్తే ఉరి అన్నడు ముఖ్యమంత్రి కేసీఆర్.. కేసీఆర్ మాటలకు భయపడి పత్తి వేసుకున్నరు రైతులు. కాని, నకిలీ విత్తనాలతో కుదేలయ్యిండు. నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నరని శాస్త్రవేత్తలు చెబితే.. అవి నకిలీ రిపోర్టులుగా ఏమార్చిండు ముఖ్యమంత్రి కేసీఆర్.
ఏడేళ్లలో ఏ ఒక్క రైతును ఆదుకున్న ఆనవాళ్లు లేవు ఈ రాష్ట్రంలో. రైతుల పాలిట శాపంగా మారింది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం.పేదోళ్లు ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. కాని కేసీఆర్ కుటుంబంలో ఏ ఒక్కరు ప్రాణత్యాగం చేయలే.
రాష్ట్రంలో ప్రజల బతుకులు దుర్భరమయ్యాయి. కాని, కేసీఆర్ కుటుంబంలో మాత్రంలో ఐదుగురికి ఉద్యోగాలిచ్చినయ్.పేద ప్రజల భూములకు పట్టాలియ్యమని అడిగితే పట్టించుకోవడం లేదు కేసీఆర్.
దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని మాట తప్పిండు. 120 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని తోక ముడిచిండు.నిరుద్యోగుల కోసం, పేద ప్రజల కోసం, దళితుల కోసం, రైతుల రుణమాఫీ కోసం, ఉద్యోగుల కోసం, బడుగు, బలహీన వర్గాల కోసం ఉద్యమం చేస్తే బిజెపి కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు బనాయించారు. లాఠీచార్జ్ చేశారు.
రాష్ట్రంలో వాల్మీకి, బోయల సమస్యలు పరిష్కరించాలి. వారి సమస్యలు పరిష్కరించకుండా కేసీఆర్ నీచమైన చరిత్రను ఇప్పుడున్న బోయ, వాల్మీకులు లిఖితపూర్వకంగా రాసి తెలంగాణ ప్రజలకు, రాబోయే తరాలకు తెలియజేస్తరు. తస్మాత్ జాగ్రత్త… కేసీఆర్.అందుకే రాష్ట్రంలో కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలంటే.,.. పేదోళ్ల రాజ్యం రావాలంటే బిజెపి అధికారంలోకి రావాలి.