Suryaa.co.in

Telangana

తెలంగాణలో బీజేపీ గెలవాలి

తెలంగాణ వికాసం కోసం కేంద్రం 9 ఏళ్లలో 9 లక్షల కోట్లు
తెలంగాణలో 2 కోట్లమందికి కేంద్రం రేషన్
తెలంగాణలో 31 లక్షల టాయిలెట్లు
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా

తెలంగాణలో కేసీఆర్‌ పాలన రజాకార్లను తలపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ కుటుంబపాలన అంతం కావడం ఖాయం. తెలంగాణ వికాసం కోసం కేంద్రం 9 ఏళ్లలో 9 లక్షల కోట్లు కేటాయించింది. తెలంగాణలో 2 కోట్లమందికి కేంద్రం రేషన్ ఇస్తోంది. ఇటీవల తెలంగాణకు గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డును ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ గతంలో ప్రాంతీయ ఆకాంక్షలను విస్మరించింది. తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పటి బీఆర్ఎస్) ఆ విధంగా ఆవిర్భవించిందే.

కేవలం తమ ఆకాంక్షల కోసమే ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించాయి. క్రమక్రమంగా ఈ ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారిపోయాయి. బీఆర్ఎస్ కుటుంబ పార్టీ. కేసీఆర్‌కు ఒక సందేశం ఇస్తున్నా.. వచ్చే ఎన్నికల్లో అన్నీ ముగిసిపోతాయి. ప్రధాని మోదీ తెచ్చిన ఎన్నో పథకాలు తెలంగాణలో అమలు కాకుండా బీఆర్ఎస్ అడ్డుకుంటోంది. తెలంగాణకు ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదు. సింగిల్ బెడ్రూం గతి లేదు కానీ బీఆర్ఎస్ నేతలు డబుల్ బెడ్రూం అంటున్నారు.

నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అగ్రగామిగా నిలిచింది. దేశవ్యాప్తంగా గరీబ్ కళ్యాణ్ యోజన కింద 80కోట్ల మందికి ఉచితంగా రేషన్ సప్లై చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుంది. ఇందులో తెలంగాణకి చెందిన రెండు కోట్ల మంది లబ్దిదారులు ఉన్నారు. ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం భారత్‌లో 13కోట్ల మంది పేదరికాన్ని జయించారు. ఎన్నో ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ తెలంగాణ ను ఎందుకు అబివృద్ధి చేయలేదు? ప్రధాని అవాస్ యోజన కింద దేశ వ్యాప్తంగా 4కోట్ల ఇళ్లను నిర్మించింది. మరీ తెలంగాణలో కేసిఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎన్ని నిర్మించారో చెప్పాలి.

తెలంగాణలో 31 లక్షల టాయిలెట్లు నిర్మించిన ఘనత మోదీ ప్రభుత్వానిదే. ఉజ్వల పథకం కింద సిలిండర్ కి 300 సబ్సిడీ ప్రకటించాం. దీంతో 9కోట్ల 50లక్షల మందికి లబ్ది చేకూరనుంది. ఏడాదికి 6వేల కోట్లతో రైతుల ఖాతాలో కిసాన్ సమ్మాన్ నిధి జమ అవుతోంది. దేశ వ్యాప్తంగా 12కోట్ల మంది రైతుల అకౌంట్ లో డబ్బులు జమ అవుతున్నాయి. దీంట్లో 38లక్షల 50వేల తెలంగాణ రైతులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హైవేస్ సంఖ్య పెరిగింది.

తెలంగాణలో బీజేపీ గెలవాలి .. దాంతో పాటు మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి తేవాలి. తెలంగాణకు నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని, అభివృద్ధిని, పథకాలను ప్రజలకు వివరించాల్సిన అవశ్యకత కార్యకర్తలపై ఉంది. ఇచ్చిన హామీలనే కాదు.. చెప్పని హామీలను సైతం అమలు చేస్తోంది. ప్రాంతీయ పార్టీలు ఫ్యామిలీస్ పార్టీలు మారుతున్నాయి. బీఆర్ఎస్ అంటేనే కేసిఆర్ కుటుంబం.

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజి తో 30 లక్షల మంది యువత జీవితాలతో చెలగాటం అడుతున్నారు.. tspsc పేపర్ లీకేజి లకు కారణమైన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరం ఉంది. దేశాభివృద్ధికి పాటుపడేది ఒక్క బిజెపి మాత్రమే. ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి గుండె ధైర్యంతో చెప్పాలి. సమాజంలో ప్రతి వర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం.

LEAVE A RESPONSE