Suryaa.co.in

Telangana

హిందీ పేపర్ లీకేజీ పేరు చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు

-వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న
-లిక్కర్ స్కాం, పేపర్ లీక్ నుండి మీరు తప్పించుకోలేరు
-మా లాంటి వారి మీద నిఘా పెట్టడం కాదు. పేపర్ లీక్ కాకుండా చూడండి
-ఇదంతా ప్రజల అటెన్షన్ డైవర్ట్ చెయ్యడానికే
బీజేపీ ప్రజల పక్షాన ఉంది
-కేసీఆర్ నీ రాజ్యం, ప్రభుత్వం శాశ్వతం కాదు. కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం
-TSPSC ని రద్దు చేయాలి
-సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరపండి
-దేశం అంతా డబ్బులు ఖర్చు పెడతా అని కేసీఆర్ మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఎంతగా తెలంగాణ ప్రజలను కొల్లగొట్టారు అర్థం చేసుకోండి
-లిక్కర్ స్కాంలో నిర్దోషిత్వాన్ని మీరే నిరూపించుకోవాలి
– ఈటల రాజేందర్

Tspsc అభాసుపాలు అయ్యింది.30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడింది. దీనికి పూర్తి భాధ్యత కెసిఆర్ వహించాలని డిమాండ్ చేస్తున్నాను.ఒకపక్క పేపర్ లీకేజీ, మరోపక్క మహిళలు చేయకూడని లిక్కర్ బిజినెస్ లో కూతురు అడ్డంగా దొరికిపోయి విచారణ ఎదుర్కుంటుంది.దీనినుండి ప్రజలను డైవర్ట్ చేయడమే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారు.ఇంకో పక్క.. చంద్రశేఖర్ అనే వ్యక్తి 75 కోట్ల రూపాయలు BRS కీ ఇచ్చిన అని చెప్పారు. రాజ్ దీప్ సర్దేశాయ్ చెప్పినట్టు.. అటుకులు బుక్కిన కెసిఆర్ వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు.ఇక్కడ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ప్రతిపక్ష పార్టీల్లో నాయకులు లేకుండా చేస్తున్నారు.ఉప ఎన్నికలు జరిగితే వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు.ఇది చాలదు అన్నట్టు దేశవ్యాప్తంగా పార్టీలకు డబ్బులు పంపిస్తా అని చెప్తున్నారు.తెలంగాణలో వైద్యం చేయించడానికి డబ్బులు లేవు, వడ్డీలేని రుణాలకు, రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవు, డబుల్ బెడ్ రూంలు లేవు. కానీ దేశ వ్యాప్తంగా డబ్బులు ఇవ్వడానికి అడ్డంగా దోచుకున్న పైసలు ఇస్తారట. అయన వ్యవసాయం చేసి సంపాదించింది కాదు. అది మన సొమ్ము.

లిక్కర్ స్కాం, పేపర్ లీక్ నుండి మీరు తప్పించుకోలేరు. హిందీ పేపర్ లీకేజీ విషయంలో సీపీ రంగనాథ్ గారు చాలా క్లియర్ గా సమాచారం ఇచ్చిన తరువాత దానిని బండి సంజయ్ కి ఆపాదిస్తున్నారు. నిజాయితీ ఉంటే విచారణ జరపండి. CP ప్రెస్స్ మీట్, బండి సంజయ్ అరెస్ట్ తీరు ప్రజలు గమనిస్తున్నారు.ఒక క్రిమినల్ లాగా రోడ్లమీద వెంబడించి నన్ను అరెస్ట్ చేశారు. ఇంత నీచం ఎప్పుడు చూడలేదు. ఈ ప్రభుత్వం పోయే కాలం వచ్చింది. దుర్మార్గాల గురించి డైవర్ట్ చెయ్యడానికే ఈ కుతంత్రాలు. ఈ కుట్రలు కుతంత్రాలు అర్థం చేసుకోలేనంత దద్దమ్మలు కాదు తెలంగాణ ప్రజలు. బీజేపీలో చదువుకున్న వారు లేరు అని కొంతమంది మాట్లాడుతున్నారు.మోడీ అనేక సంవత్సర నుండి విద్యార్థుల్లో స్వయంగా మనోధైర్యం నింపడానికి వారితో నేరుగా మాట్లాడుతున్నారు. రేపటి దేశ భవిష్యత్తు పిల్లలు కాబట్టి మోడీ గారు బ్రాడ్ గా ఆలోచించి ఆ పని చేస్తున్నారు. పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్న ఏకైక ప్రధాని మన మోడీ .మంత్రులు, ఎమ్మెల్యేలు మీకు నిజాయితీ ఉంటే పేపర్ లీకుల మీద సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించండి. మా లాంటి వారి మీద నిఘా పెట్టడం కాదు. పేపర్ లీక్ కాకుండా చూడండి.

మీ యావ సంపాదన, కుర్చీ మీద తప్ప ప్రజల మీద లేదు. ప్రజలారా.. కెసిఆర్ చేస్తున్న పనుల.మీద చర్చ పెట్టండి. నిగ్గు తేల్చండి.ఈ దుర్మార్గాలకు అంతం BRS ఓటమితోనే. ఇది దోపిడీకి ప్రజలకు మధ్య జరుగుతున్న పోరు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికలు వస్తున్నాయి అని ఆత్మీయ సమ్మేళనాలు పెడుతున్నారు. ఎమ్మెల్యేలు వచ్చి మందు దావత్ లు ఇస్తున్నారు. మటన్ భోజనం పెడుతున్నారు. దావత్ ఇచ్చినంత మాత్రాన డబుల్ బెడ్ రూం ఇల్లు, పెన్షన్, రుణమాఫీ రావు. కెసిఆర్ ఎందుకు తాగిపిస్తున్నారు మటన్ భోజనం ఎందుకు పెడుతున్నారు ఆలోచన చేయండి. 30 లక్షల మంది చెందిన పేపర్ లీకేజీ మీద విచారణ,మళ్లీ పరీక్ష రాసేవారికి ఆర్థిక సాయం చెయ్యాలి. నిరుద్యోగుల తరపున మేము పోరాటం చేస్తాం.నిన్న హిందీ పరీక్ష రాసినవారు, ఫోటో కొట్టిన వారు, బయటికి తీసుకువచ్చిన వారు ఎవరో పోలీస్ కమీషనర్ ప్రెస్స్ మీట్ లో చెప్పారు వారికి బీజేపీ కి ఎం సంబంధం.

లిక్కర్ స్కాం :
తెల్చల్సింది పార్టీలు కాదు. సీబీఐ, ఈడి తేల్చాలి.తప్పు జరిగింది అని నిర్ధారణకు వచ్చాక ఎవరూ తప్పించుకోలేరు.ప్రతిపక్ష మాటలు నమ్మద్దు అని మాట్లాడుతున్నారు ఓకే.. మీరు మాట్లా ఇచ్చిన లక్ష రుణమాఫీ, డబుల్ బెడ్ రూం, నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం నింపని మీ మాటలు నమ్మాలా ?మాటలు ఇచ్చి ఓట్లు దండుకుని ప్రజలను పట్టించుకోని మీ మాటలు నమ్మాలా ? ప్రజల తరపున కొట్లడుతున్న మా మాటలు నమ్మాలా? ఎవరి మాటలు నమ్మాలో? ఎవరు దోషులో పజలకు అర్థం అయ్యింది. 33 శాతం రిజర్వేషన్ అని మాట్లాడుతున్నారు. మహిళా మంత్రి లేకుండా కేబినెట్ నడిపిన మీరా మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడేది?

LEAVE A RESPONSE