– పోటీ ధర్నాలపై భట్టి ఫైర్
ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో పాలించే బీజేపీ, రాష్ట్రాన్ని పాలించే టీఆర్ఎస్‌లు.. రోడ్డెక్కి ధర్నాలు చేస్తే.. కొనాల్సింది అమెరికానా, పాకిస్థానా? అని ప్రశ్నించారు. ‘‘ధాన్యం కొనాల్సిన మీరే ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? ధాన్యం కొనుగోలు చేయడం మీకు చేతకావడం లేదా? అధికారంలో ఉండి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. వీళ్ల పాలనతో రాష్ట్రాన్ని, దేశాన్ని 20ఏళ్లు వెనక్కి నెట్టారు. వ్యవసాయాన్ని కార్పొరేట్‌కు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీ, టీఆర్ఎస్ ధర్నాలతో డ్రామాలు’’ ఆడుతున్నారని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.