– అసెంభ్లీనియోజకవర్గ స్ధాయిలో అభియోగాలు నమోదుకు నిర్ణయం
రాష్ట్రప్రభుత్వాన్ని పూర్తి స్ధాయిలో ఇరుకన పెట్టేవిధంగా ఛార్జిషీట్ల రూపకల్పన చేయాలని బిజెపి పూర్తి స్ధాయి కసరత్తు ప్రారంభించింది. పదమూడు మంది సభ్యులతో ఛార్జిషీట్ల రూపకల్పన… అమలకు సంబందించిన ప్రణాళిక కమిటీ వెబక్స్ ద్వారా వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఛార్జిషీట్ రూపకల్పనకు సంబందించి 18 అంశాలను నిర్దారించారు.
వీడియో కాన్ఫెరెన్స్ ప్రారంభంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మాట్లాడుతూ అసెంభ్లీ స్ధాయి నుండి జిల్లా వరకు వివిధ దశల్లో ఛార్జిషీట్లు రూపకల్పనకు సంబందించి అనేక విషయాలను ప్రస్ధావించారు. అభియోగాలు నమోదులో ఎవరైతే బాదితులు ఉంటారో ఆయా సమస్యలు ఆధారంగా వారినుండి ఫిర్యాదులు స్వీకరణకు అవలంభించాల్సిన అంశాలను కూడా సమావేశంలో అందరి అభిప్రాయాలు తీసుకోవలసిన విషయాలను సమావేశం ముందు ఉంచారు. 7,8,9 తేదీల్లో జిల్లా అధ్యక్షుళ్ళు ఆయా జిల్లాల్లో పర్యటనలు నిర్వహించాలని అభియోగాల నమోదు తో పాటు బాదితుల వద్ద నుండి కూడా ఫిర్యాదులు స్వీకరించాలని సమావేశం నిర్ణయం తీసుకుంది.
ఈ కమిటీకి మార్గదర్శక్ గా భాద్యతలు నిర్వర్తిస్తున్న మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి ఈ సందర్భంగా అనేక అంశాలు ప్రస్తావించారు. అవసరమైతే బిగ్ స్క్రీన్ లు ఏర్పాటు చేసి అభియోగాలు వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా నిర్వహించాలన్నారు అందుకు అవసరమైన మౌలిక అవసరాలను కూడా అందుబాటులోకి తీసుకువద్దామని వివరించారు అదేవిధంగా జోన్ ల వారీగా సమస్యలతొ పాటు రాష్ట్ర స్ధాయిలో సమస్యలను క్రోడీకరించి ఛార్జిషీట్ బుక్ లెట్ కూడా ప్రచరించాలన్న అంశాల పై కూడా కమిటీ సభ్యుల అభిప్రాయాలను సుజనా చౌదరి కోరారు. అసెంభ్లీనియోజకవర్గాల స్ధాయిలో పర్యటనలు ముమ్మరం చేయాల్సిన అంశాన్ని ప్రస్తావించారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గారపాటి చౌదరి, బిజెవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి పలు అంశాలపై వారి అభిప్రాయాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ ఛార్జిషీట్ దాఖలు అనే అంశాన్ని మండల స్ధాయిలోకి తీసుకుని వెళ్లాలన్నారు అందుకు అవసరమైన పర్యటనలు పై జిల్లా అధ్యక్షుళ్లు ద్రుష్టికేంద్రీకరించాలన్నారు. అదేవిధంగా జిల్లాల వారీగా సమస్యలు పై సమావేశాలు నిర్వహించాలన్నారు.
సమావేశాలు నిర్వహిస్తున్న సందర్భంలో అక్కడ ఉన్న బాదితుల నుండి విషయాలు సేకరించాలి అదేవిధంగా వివిధ స్ధాయిలో ఛార్జిషీట్ ఆధారంగా ఎమ్మెల్యేల పై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉందన్నారు వెబక్స్ సమావేశాన్ని కమిటీ కన్వీనర్ హొదాలో కోఆర్డినేట్ చేశారు. సమావేశంలో వచ్చిన అంశాలు ఆధారంగా విషయ సేకరణ త్వరితగతిన చేయాల్సిన అవసరం ఉందని కోలా ఆనంద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు