గతంలో అనేకసార్లు చెప్పాను, ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్నది చూసి మరొకసారి చెబుతున్న..
ఎవరైనా నుదుటన బొట్టు పెట్టుకుంటే వాళ్ళను బత్తాయిలు అన్నారు. ఎవరైనా గుడికి వెళ్ళి పూజలు చేసి, దర్శనం బాగా జరిగింది అని పోస్టులు పెడితే వాళ్లను బత్తాయిలు అన్నారు. కాశ్మీర్ లో దారుణ ఊచకోతకు గురై లోయను వదిలి ఢిల్లీ వీధులలో దుర్భర జీవితాన్ని గడిపిన కాశ్మీర్ పండిత్ ల జీవితాలను చూపించిన కాశ్మీర్ ఫైల్స్ సినిమాను బత్తాయిల ప్రాపగాండా సినిమా అన్నారు. ఒక వర్గం వాళ్ళు హిందువులను దారుణంగా గొంతు కోసి హత్యలు చేస్తుంటే ఆ దారుణాలను ఖండించిన వాళ్లను బత్తాయిలు అన్నారు. ఇలా ఒకటేమిటి ఎన్నో అంశాలలో సెక్యులరిజం పేరుతో హిందువులను హేళన చేస్తూ న్యూట్రల్ హిందువులను బీజేపీ వైపు వెళ్లేలా చేశారు.
సర్జికల్ స్ట్రైక్ చేసినపుడు సాక్ష్యాలు అడిగారు. కాశ్మీర్ లోయలో సైనికుల మీద ఉగ్రవాదులు దాడిచేసి 50 మందిని పొట్టన పెట్టుకుంటే ఎన్నికల ముందు సైనికులు చనిపోవడం కామన్ అని సైనికుల మరణాలను కూడా ఎగతాళి చేశారు. లదాక్ లో చైనా కుట్రపూరిత చొరబాటును అడ్డుకుని ప్రాణాలు పోతే చైనాకు వంతపాడారు. దేశం గురించి ఒక్క మంచిమాట మాట్లాడినా, చివరకు భారత్ మాతకు జై అంటే బత్తాయి అన్నారు. ఇలా అని అని జాతీయవాదం గురించి మాట్లాడే పార్టీ ఒక్క బీజేపీ మాత్రమే అనే స్థితికి తెచ్చారు.
ఇప్పుడు దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు కావొస్తున్న సందర్భంలో రెండు వారాల పాటు సోషియల్ మీడియాలో తమ డీపీ (display picture) లలో త్రివర్ణ పతాకం పెట్టుకోమని చెబితే.. చప్పట్లు కొడితే కరోనా పోయిందా? త్రివర్ణ పతాకం పెట్టుకుంటే దేశంలో పేదరికం పోతుందా? DP మారిస్తే GDP పెరుగుతుందా? అని పోస్టులు పెడుతూ చివరకు జాతీయ పతకాన్ని పెట్టుకోడాన్ని కూడా హేళన చేసే స్థితికి వచ్చారు.
కేవలం మోదీ చెప్పాడు కాబట్టి వ్యతిరేకిస్తామని హిందుత్వాన్ని, జాతీయవాదాన్ని, జాతీయ పతాకాన్ని సమర్థవంతంగా బీజేపీ పరం చేసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ అధికారంలోకి రావడానికి శాయశక్తులా కృషి చేస్తున్న బట్టకాయలకు (వాళ్లు బత్తాయిలు అయితే మీరు కూడా ఏదో ఒకటి అవ్వాలి కదా) అభినందనలు.
PS1: ఒక ఫక్తు రాజకీయ పార్టీగా బీజేపీ కూడా అనేక తప్పులు చేస్తున్నది. విమర్శించడానికి కూడా అనేక అంశాలు ఉన్నాయి. బీజేపీ అన్నా, మోదీ అన్నా సహించని వాళ్ళు ఏ అంశాన్ని విమర్శించాలి దేనిని వదిలి వేయాలి తెలుసుకొనంత కాలం బీజేపీ అధికారానికి ముప్పెమి లేదు.
PS2: ఈ బట్టకాయలు బీజేపీ యెజెంట్లు ఏమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది.
– నాగరాజు మున్నూరు