ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు జిల్లా కేంద్రాల్లో బీజేపీ ధర్నా

– ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని నిర్ణయం
-బీజీపీ జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీలు, వివిధ మోర్చాల నేతలతో బండి సంజయ్ కుమార్ భేటీ
వానా కాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద వేలాది మందితో ధర్నా చేయాలని బీజేపీ రాష్ట్ర శాఖ నిర్ణయించింది. ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం దిగొచ్చేదాకా రైతుల పక్షాన నిలిచేందుకు సిద్ధమైంది. తెలంగాణలోని పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనేందుకు సిద్ధమైనా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనడం లేదనే అంశంపై అడుగడుగునా నిలదీస్తామని ప్రకటించింది.
పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అధ్యక్షతన జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీలతోపాటు వివిధ మోర్చాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మంత్రి శ్రీనివాసులు, ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, శోభారాణి హాజరైన ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత పటిష్టత, ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై చర్చించారు.
వానాకాలంలో పండించిన 60 లక్షల మెట్రిక్ ధాన్యాన్ని కొనేందుకు సిద్దమని కేంద్రం గత ఆగస్టులోనే లేఖ ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతూ ఆ తప్పును కేంద్రంపై నెట్టే యత్నం చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. దొంగే దొంగ అన్నట్లుగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ధర్నాల పేరుతో రైతులను మరింత ఆందోళనకు గురిచేయడాన్ని వారు తప్పుపట్టారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయడంతోపాటు వరి ధాన్యం తక్షణమే కొనుగోలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జిల్లా కలెక్టర్ల వద్ద గురువా

Leave a Reply