Suryaa.co.in

Andhra Pradesh

దొంగ ఓట్లు సూత్రధారులు, పాత్రధారులను బీజేపీ వదలదు

– బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి

విజయవాడ : ఇండియన్ అడ్మినిస్ట్రేషన్, ఇండియన్ పోలీస్ సర్వీస్ విధులు సక్రమంగా నిర్వహించాలి. లేదంటే తిరుపతి ఉప ఎన్నికల్లో వక్రమార్గం పట్టిన అధికారులు సస్పెండ్ అయిన విషయం ప్రస్తావిస్తూ, ఎన్నికల లో దొంగ ఓట్లు సూత్రధారులు, పాత్ర దారులను బీజేపీ మాత్రం వదలదు.

ఆధారాలు తో సహా ఎన్నికల సంఘానికి దొంగ ఓట్లు వ్యవహారం పై ఫిర్యాదు చేశాం. నకిలీ ఎపిక్ కార్డు లు పై సమాచారం బిజెపి దృష్టి కి రావాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ దొంగ ఓట్లు తో గట్టెక్కాలని చూస్తోంది.తక్కవ మార్జిన్ తో సీట్లను కోల్పోతామని భావించే నియోజకవర్గాల్లో ఈ తరహా కుట్ర కు నాంది పలుకుతుందని అనుమానం వారి మాటలు బట్టి తెలుస్తోంది.

రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయని ప్రజలకి తెలియచేశాం. పల్లెకి పోదాం పేరుతో బీజేపీ నాయకులు గ్రామాలలో నివసించి, వారితో మమేకమై రాష్ట్రానికి మోదీ సేవల గురించి వివరించాం. అయోధ్య రామ మందిరం నిర్మాణం అనేది ఒక గొప్ప కార్యక్రమం కి శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ. అలాగే ఈ నిర్మాణం జరిగితే హిందూ – ముస్లిమ్స్ మధ్య గొడవలు తలెత్తుతాయన్న విమర్శలని తిప్పి కొట్టగలిగాం.

వివాదాలకు తావు లేకుండా ఈ అయోధ్య రామ మందిరం నిర్మాణం అనేది జరిగింది. ప్రజా పూరి యాత్ర అనేది కూడా బీజేపీ శ్రీకారం చుట్టింది.ప్రతి జిల్లాలో అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి కూడా తీర్చలేకపోయింది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజలు బీజేపీ కి పట్టం కట్టాలని పిలుపు నిచ్చాము.

అలాగే రాష్ట్రంలో ఉన్న నకిలీ ఓటు కార్డు లు జారీ చేసారో ఆధారాలతో ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. ఐఏఎస్, IPS అధికారులను చీఫ్ ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేయటం జరిగింది. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్స్ గా వినియోగుంచుకుంటాం అని ధర్మాన వ్యాఖ్యానించారు. ఎలక్షన్ కమిషనే వాలంటీర్లను ఎలక్షన్స్ కి దూరంగా ఉంచాలని నిర్ణయించింది. ఇలాంటివి కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం.

తిరుపతి బై ఎలక్షన్ లో తప్పుడు దారిలో గెలిచిన వ్యక్తి పై , అనర్హత గెలుపు గా గుర్తించి రద్దు చేయాలనీ ఎన్నికల దృష్టికి గతంలోనే తీసుకెళ్ళాం. పొత్తులపై అగ్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. పొత్తు ఉన్నా లేకపోయినా బీజేపీ పార్టీ రాష్ట్రంలో బలోపేతానికి కృషి చేస్తున్నాం.

LEAVE A RESPONSE