-అన్నదాతలకు,అర్చకులకు కేసీఆర్ పాలనలోనే ఆదరణ
-విద్యుత్ సరఫరా లో తెలంగాణా నెంబర్ వన్
-ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికితకు చక్కటి నిదర్శనం
-రాష్ట్రాభివృద్ధిని జనబాహుళ్యంలో తీసుక పోవడంలో అర్చకులు అగ్రభాగాన ఉండాలి
-సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా దీప,దూప నైవేద్య ఆర్చక సంఘం ఆత్మీయ సమ్మేళనం
-ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి
పాలనలో మేటిగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు బ్రహ్హ్మణో త్తంల ఆశీర్వాదాలు ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆకాంక్షించారు.కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే అన్నం పెట్టే రైతులకు…ఆశీర్వదించే అర్చకులకు ఆదరణ పెరిగిందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం సూర్యపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఉమ్మడి నల్లగొండ జిల్లా దీప దూప నైవేద్యం అర్చక సమాఖ్య ఆత్మీయ సమ్మేలానానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.సమ్మేళనానికి హాజరైన మంత్రి జగదీష్ రెడ్డికి బ్రహ్మణోత్తములు వేద మంత్రాల మధ్యన శాస్త్ర యుక్తంగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం జ్యోతి ప్రజ్వలనతో ఆత్మీయ సమ్మేలానాన్ని ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి సభలో ప్రసంగిస్తూ అటు రైతాంగానికి ఇటు అర్చకులకు గతంలో ప్రస్తుతం ఉన్న ఆదరణలో మార్పులను గమనించాలని కోరారు.2014 కు పూర్వం 70 సంవత్సరాలుగా అన్నం పెట్టే రైతు తాను రైతు అని చెప్పుకోవడానికి,అర్చకత్వం చేస్తున్న అని చెప్పుకోవడానికి అర్చకుడు బిడియా పడే రోజుల నుండి తలెత్తుకుని తాము రైతుల మని ….అర్చకత్వం చేస్తున్న అర్చకులు తాము అర్చకులమని తలెత్తుకుని చెప్పుకునే స్థాయికి తెలంగాణా సమాజం చేరుకుందన్నారు.
అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన ప్రణాళికలే కారణమన్నారు.అటువంటి మార్పులను పండితోత్తము లైన అర్చకులు జనబాహుళ్యంలోకీ తీసుకెళ్లాలని ఆయన సూచించారు. జరుగుతున్న అభివృద్ధి కి మీరే సాక్షులని అందులో కర్త,కర్మ, క్రియ పాత్రలు పోషిస్తున్న ఘనా పాటిలు మీరు అని అటువంటి మీ ఆశీర్వాదాలు నిండు మనసుతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎల్ల వేళలా ఉండాలని ఆయన కోరారు.
ఎన్నో అవాంతరాలను అధిగమించి బ్రాహ్మణ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ దీప దూప నైవేద్యం పేరుతో గౌరవ వేతనాన్ని అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కుందని ఆయన కొనియాడారు. అభివృద్ధి,సంక్షేమాన్ని రంగరించి పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోనే 24 గంటల నిరంతర విద్యుత్ నందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణా రికార్డ్ సృష్టించిందన్నారు.వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ నందించడంతో పాటు గృహ,వర్తక,వాణిజ్య, వ్యాపార రంగాలలో పాటు పరిశ్రమలకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణా నిలబడింది అంటే అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతనే కారణమన్నారు.
ఈ ఆత్మీయ సమ్మేలానానికి అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ అధ్యక్షత వహించగా పోతులపాటి రామలింగేశ్వర శర్మ,శ్రీరంగం గోపికృష్ణ మాచార్యులు,హరికిషన్ శర్మ,లక్జ్మీ నరసయ్య,అన్నం బొట్ల ఫణి కుమార్ శర్మ ,ప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు.