-టీడీపీకి పెరుగుతున్న ప్రజాధరణ చూసి జగన్ కి ఓటమి భయం పట్టుకుంది
– మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్
టీడీపీకి వస్తున్న ప్రజాధరణ చూసి జగన్ కి ఓటమి భయం పట్టుకుంది, అందుకే టీడీపీ సభల్ని అడ్డుకుంటున్నారు. తూ.గో జిల్లా అనపర్తిలో చంద్రబాబు నాయుడు సభను అడ్డుకోవటం దుర్మార్గం. సభకు ఉదయం అనుమతి ఇచ్చి సాయంత్రం రద్దు చేయటం ఏంటి? జగన్ చెప్పినట్టు విని పోలీసులు వ్యవస్దకు చెడ్డపేరు తెస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రతి పోలీసు అధికారి పేరును డైరీలో నోట్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఎవర్ని వదిలపెట్టేది లేదు. జగన్ ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. వైసీపీ పాలనలో జనం విసుగు చెందారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం.