Suryaa.co.in

Andhra Pradesh

సుప్రీంకోర్టు వ్యాఖ్యలను వక్రీకరిస్తున్న నీలి మీడియా

– ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

చంద్రబాబును రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలన్న సీఐడి వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. బెయిల్‌ రద్దుపై వెంటనే విచారణ చేపట్టాలన్న సీఐడి వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయినా నీలి మీడియా పై అంశాలను వక్రీకరించి స్క్రోలింగ్‌ ఇచ్చింది. చంద్రబాబు రాజకీయ కార్యకలాపాలు, ప్రజా కార్యక్రమాలపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించలేదు.

మంచి చేసి వుంటే జగన్‌రెడ్డి ఎందుకు చంద్రబాబును ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు? అబద్ధపు ప్రచారాలు నీలి మీడియాలో ఎందుకు చేస్తున్నారు?

చంద్రబాబు పబ్లిక్‌ మీటింగ్స్‌లో పాల్గొనరాదని సుప్రీంకోర్టు చెప్పినట్టు నీలి మీడియా సాక్షిలో అబద్ధపు స్క్రోలింగ్స్‌ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆ విధంగా ఆంక్షలు పెట్టలేదనేది నిజం. కేవలం స్కిల్‌ కేసుకు సంబంధించి మాత్రమే ఇరుపక్షాలు మాట్లాడవద్దని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పింది.

చంద్రబాబును రాజకీయ కార్యకలాపాలకు, ప్రజా సమస్యలపై ఆయన పర్యటనలను అడ్డుకునేందుకు సీఐడి ద్వారా అడ్డుకునే కుట్ర జగన్‌రెడ్డి చేస్తున్నారు. చంద్రబాబును రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలన్న ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. చంద్రబాబు బెయిల్‌ రద్దుపై వెంటనే విచారణ చేపట్టాలన్న సీఐడీ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. విచారణను డిసెంబర్‌ 8కి వాయిదా వేసింది.

జగన్‌రెడ్డి 99% మేనిఫెస్టో హామీలు అమలుచేసి వుంటే, లక్షల కోట్ల కుంభకోణాలు చేయకుండా వుండి వుంటే చంద్రబాబు ప్రజా పర్యటనలను అడ్డుకోవాల్సిన అవసరం లేదు కదా? తన ప్రజా వ్యతిరేక విధానాలు, లక్షల కోట్ల లూటీని కప్పిపెట్టుకోవడానికే వ్యవస్థల్ని మేనేజ్‌ చేసి అక్రమ కేసులు సీఐడీతో పెట్టించారు. దొంగే దొంగ దొంగ అని అబద్ధపు ప్రచారాలు నీలి మీడియా ద్వారా చేస్తున్నారు. తన అవలక్షణాల్ని ఎదుటి వారికి అంటకట్టి చెప్పిన అబద్ధమే వందసార్లు చెప్పడం జగన్‌ నైజం.

LEAVE A RESPONSE