– డాక్‌యార్డ్‌లో ఘనంగా భారతీయ మజ్దూర్ సంఘ్ 70వ వ్యవస్థాపక వేడుక
విశాఖపట్నం: కార్మికుల పక్షాల నిలబడి, సమస్యల పరిష్కారానికి నిజాయితీగా పోరాడేది బీఎంఎస్ మాత్రమేనని ‘ఇండియన్ నేవీ సివిలియన్ మజ్దూర్ సంఘ్’ (ఐఎన్సీఎంఎస్) గౌరవాధ్యక్షుడు పైలా దేముడు నాయుడు అన్నారు. కార్మిక రంగంలో, జాతీయ వాదం విలువలతో కూడిన పోరాట పటిమను పెంపొందించే దిశగా భారతీయ మూజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) కృషి చేస్తోందని కొనియాడారు.
నేవల్ డాక్ యార్డ్‌లోని విజయనగర్ గేట్ ఎదుట బుధవారం బీఎంఎస్ 70వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఐఎన్సీఎంఎస్ నేతలు ఘనంగా నిర్వహించారు. యూనియన్ అధ్యక్ష, కార్యదర్శలు పుట్టా విద్యాసాగర్, ఎస్ రాజేష్ తదితరులు బీఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు చింతాడ రమణతో కలిసి బీఎంఎస్ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్మికుల సంక్షేమంతో పాటు వారి న్యాయమైన హక్కుల సాధన, కార్మికుల్లో దేశభక్తిని నింపేందుకు, తాము పని చేసే పరిశ్రమల పురోభివృద్ధే పరమావధిగా బీఎంఎస్ పని చేస్తుందన్నారు.
చీటికీమాటికీ యాజమాన్యాల్ని బెదిరించి పరిశ్రమల్ని ఖాయిలా పడేలా అనైతిక సమ్మెకు దిగే విధానానికి బీఎంఎస్ వ్యతిరేకిస్తుందన్నారు. కార్యక్రమంలో బీఎంఎస్ సీనియర్ నాయకులు సత్యానందం, యూనియన్ నాయకులు బి.సత్య శ్రీనివాస్, కె.వెంకట్ నాయుడు, పంపా రవికుమార్, పి.సురేష్, పెదపాటి రాజు, అల్లిపల్లి నరసింహారాజు, ఆడారి రమేష్, రావత్, గొన్నా మహేష్, అశోక్ కుమార్, మళ్ల మోహనరావు, కె. వెంకటేశ్వరావు, సాహు, మెటీరియల్ ఆర్గనైజేషన్ నాయకులు శ్రీనుబాబు, సంపత్, శేషు రామకృష్ణ, వర్క్స్ కమిటీ సభ్యులు ముత్తిరెడ్డి శ్రీనివాస్, జగదీశ్, యోగిత, జేసీఎం ఫోర్త్ లెవల్ సభ్యులు బి.లక్ష్మణ రావు, బండారు శివ, కాసు బాబుతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.