Suryaa.co.in

Telangana

మొక్కలు నాటిన బోయినపల్లి వినోద్ కుమార్ దంపతులు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా శ్రీశైలంలో మొక్కలు నాటిన బోయినపల్లి వినోద్ కుమార్ దంపతులు

తన జన్మదినోత్సవం సందర్భంగా సతీమణి డాక్టర్ మాధవి తో కలిసి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ మొక్కలు నాటారు. తెలంగాణ రాష్ట్రం గ్రీనరీతో సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని ఈ సందర్భంగా వినోద్ కుమార్ ఆకాంక్షను వెలిబుచ్చారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా శ్రీశైలంలో మొక్కలు నాటినట్లు వినోద్ కుమార్ వెల్లడించారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామిని అయ్యేందుకు అవకాశం కల్పించిన సంతోష్ కుమార్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A RESPONSE