Suryaa.co.in

Andhra Pradesh

రోజాది నోరా మోరీనా?

చంద్రబాబు జైలుకెళ్లారని మంత్రి రోజా సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు
అధికారంలోకి రాగానే ఇంతకు పదింతలు మీ సంగతి చూస్తాం.
టీడీపీ యువనేత బొజ్జల సుధీర్ రెడ్డి

నిజాయితీకి నిలువెత్తు రూపం , స్పూర్తిప్రదాత చంద్రబాబు ని జైలు పాల్జేసిన ఘనత దొంగ జగన్ రెడ్డికే దక్కింది. చంద్రబాబు జైలుకెళ్లారని మంత్రి రోజా సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు. రోజా వ్యవహిస్తున్న తీరు అసహ్యకరంగా ఉంది. స్కిల్ అంటే ఏంటో తెలియని మంత్రి రోజా నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది. లక్ష కోట్ల అవినీతి చేసి 16 నెలలు జైల్లో ఉన్న జగన్ రెడ్డి రోజాకు నీతిమంతుడిలా కనిపిస్తున్నాడా? రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా చంద్రబాబు గారు 72 వేల ఉద్యోగాలు ఇస్తే జగన్ రెడ్డి రాజకీయ కక్షతో ఆయన్ను ఇరికించారు.

రాజారెడ్డి, వైఎస్, జగన్ రెడ్డి అందరిదీ ఫ్యాక్షన్ చరిత్రే. సిమెన్స్ కంపెనీ పనిచేసిన 8 రాష్ట్రాల్లోనూ ఇలాగే అరెస్ట్ చేశారా? ప్రపంచంలో పేరొందిన కంపెనీలు తెచ్చి యువతకు ఉద్యోగాలు ఇవ్వడమేనా చంద్రబాబు చేసిన తప్పు? రోజాది నోరా మోరీనా? స్వీట్లు పంచుతావా? శాంతియుతంగా 13 జిల్లాల్లో బంద్ చేస్తున్న టీడీపీ క్యాడర్ పై 307 పెట్టి జైలుకు తోస్తారా?

కొందరు పోలీసులు వైసీపీ తొత్తులుగా పనిచేస్తున్నారు. ఈడీ, సీబీఐ కేరాఫ్ అడ్రస్ జగన్ రెడ్డి. 16 నెలలు జైలు శిక్ష అనుభవించిన జగన్ రెడ్డి గురించి రోజా మాట్లాడుతోంది. రోజా మంత్రి అయ్యాక ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది? ఎంతమంది ప్రజలకు మేలు చేసింది? సమాధానం చెప్పాలి. చిత్తూరు జిల్లాలో మంత్రులు పెద్దిరెడ్డి, రోజా దందాలు అన్నీ ఇన్నీ కావు. క్వారీలు, ల్యాండ్, శాండ్, నిర్మాణ రంగాల్లో వీరిద్దరూ భారీ అవినీతికి పాల్పడుతున్నారు.

ఇంకో ఏడునెలలే రోజాకి సమయం. నీ జబర్దస్త్ డ్రామాలకు చెక్ పడబోతోంది. మా సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దు. చంద్రబాబు గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే. మేము అధికారంలోకి రాగానే ఇంతకు పదింతలు మీ సంగతి చూస్తాం.

LEAVE A RESPONSE