తిరువనంతపురంలో అత్యవసర ల్యాండింగ్
ముంబై నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానానికి గురువారం బాంబు బెదిరింపు రావటం తీవ్ర ఉద్రిక్తతను సృష్టించింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా తిరువనంతపురం విమానాశ్రయంలో ల్యాండింగ్ చేయించారు.
విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 8 గంటలకు విమానం తిరువనంతపురంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. వెంటనే విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించి, అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
విమానంలో 135 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిని సురక్షితంగా విమానం నుంచి ఖాళీ చేయిస్తున్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం సాంకేతిక నిపుణుల బృందం విమానాన్ని పర్యవేక్షిస్తుండగా, భద్రతా దళాలు పూర్తి స్థాయి తనిఖీలు నిర్వహిస్తున్నాయి.