-
ప్రైవేటు సెక్యూరిటీకీ జనం సొమ్మేనా?
-
నెలకు ఐదున్నర లక్షలు ప్రైవేటు సెక్యూరిటీ పాలు
-
త్రినేత్ర సెక్యూరిటీకి 26 లక్షల సమర్పయామి
-
ఎల్ఎస్ఈ-డీ, టీవీలకు 5 లక్షల 20 వేలరూపాయలట
-
ఇంట్లో ఎలుకలు పట్టేందుకు 1.36 కోట్లా?
-
ఎగ్ పప్లకు 3.6 కోట్లు మాత్రమేనట
-
సజ్జల ఇంట్లో ఫర్నీచర్, టీ కప్పులకు నాలుగున్నర లక్షలు
-
దాడిశెట్టి రాజా, పిన్నెల్లి, బూడి ముత్యాలనాయుడు, జగన్ దోస్తు శ్రీకాంత్ రెడ్డి ఇంటి అద్దెలూ ఖజానాకే ఆముదం
-
సర్కారు సొమ్ముతో తాడేపల్లి, లోటస్ పాండ్ ప్యాలెస్లకు కోట్ల సున్నం
-
‘సూర్య’ ఎగ్ పఫ్ ఫలహారం వార్తతో వైసీపీలో కలవరం
-
ఎగ్ పఫ్ కోసం ముచ్చటగా మూడున్నర కోట్లు మింగేసిన జగన్ క్యాంపు ఆఫీసు
-
ఆ కథనంపై వైసీపీ సోషల్మీడియాలో అసహనం
-
‘సూర్య’ పై వైకాపీయుల విమర్శల దాడి
-
ఇప్పుడు జగన్ జమానా నాటి ‘దయ్యపుతిండి’ నిజమేనంటున్న జీఓలు
-
మరి ఇప్పుడు జగనేయుల జవాబేమిటో?
(మార్తి సుబ్రహ్మణ్యం)
ఒక సద్దాం హుస్సేన్.. ఇంకో కిమ్.. మరో అమెరికా ప్రెసిడెంట్ల రక్షణకు వందల కోట్ల రూపాయలు ఖర్చవుందని వినేవాళ్లం. అప్పట్లో మారువేషాల్లో.. తన డూపులను పెట్టి తిరిగే సద్దాం హుస్సేన్ రక్షణకు వందల కోట్లు ఖర్చయ్యేదట. ఇక కిమ్, అమెరికా, రష్యా, ఇజ్రాయిల్ చీఫ్ రక్షణ ఖర్చు ఆ పైమాటే. ఎందుకంటే వారిది అంతర్జాతీయ స్థాయి. వివిధ దేశాల శత్రువులు, స్వదేశ-విదేశాల్లోని టెర్రరిస్టులతో ప్రాణహాని ఉంటుంది కాబట్టి, ఆ పాటి రక్షణ ఉండటంలో పెద్ద విశేషమేమీ లేదు.
కానీ మన దేశంలో ఒక రాష్ట్రానికి సీఎం చేసిన వ్యక్తికి, అందునా బయట కూడా కాలుబెట్టని సీఎంకు సైతం వారి లెవల్లో సెక్యూరిటీ ఉంటుందని.. అందుకోసం కోట్లాదిరూపాయల జనం సొమ్మును, స్ట్రాలతో జగనన్న జలగల మాదిరిగా పీల్చేశారంటే నమ్ముతారా? యస్. నమ్మి తీరాలి. ఎందుకంటే అవి నిఖార్సయిన నిజమేనని సర్కారు ఉత్తర్వులే ఘోషిస్తున్నాయి కాబట్టి!
జగనన్న ఐదేళ్ల జమానాలో క్యాంపు ఆఫీసు.. కేవలం మూడున్నర కోట్ల ఎగ్ పఫ్లు ఆరగించిందన్న ‘సూర్య’ కథనం వైకాపాను కుదిపివేసింది. ‘కక్కుర్తి విలాస్ కాఫీ క్లబ్‘ శీర్షికతో, ‘సూర్య‘లో వెలువడ్డ ఆ కథనంలో.. జగనేయులు రోజుకు, వారానికి, నెలకు, ఏడాదికి ఎగ్ పఫ్లు ఏ స్థాయిలో లాగించేశరన్న వివరాలు వెల్లడించింది. నిజానికి అవన్నీ సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్న కథనాలే.
అయితే వైసీపీ సోషల్మీడియా సైన్యం, ‘సూర్య’ కథనంపై బురదచల్లడం ప్రారంభించింది. గతంలో బాబు హయాంలో ఎవరూ తినలేదా? అన్న ప్రచారానికి తెరలేపింది. జర్నలిజంలో నైతిక విలువలు లేకుండా పోతున్నాయని గుండెలు బాదుకుంది. ఫర్వాలేదు.. మేము జర్నలిజంలో నైతిక విలువల గురించి నేర్చుకునేందుకు సిద్ధంగానే ఉన్నాం.
మరి జగన్, భారతీరెడ్డి, సజ్జల, కొమ్మినేని, దేవులపల్లి అమర్.. ఇంకా జగన్ సర్కారులో పదవులు వెలగబెట్టిన వెలగబెడుతున్న తాజా-మాజీ ‘జనరలిస్టు’లు వచ్చి.. ‘జనరలిజం-నైతికవిలువల’ అంశంపై, జాతినుద్దేశించి ప్రసంగిస్తారా అన్నదే ప్రశ్న. సర్కారు సొమ్మును, సొంత మీడియాలో పనిచేసే వారికి ఎన్ని కోట్లు ఫలహారంగా పెట్టారో సెలవిచ్చే ధైర్యం ఉందా? తాడేపల్లి ప్యాలెసులో పనిచేసే వారికి ఎన్ని కార్పొరషన్ల నుంచి జీతాలు ఇప్పించారో చెప్పే దమ్ముందా?
ఇప్పటికే జగనన్న ఇంటికి తగలబెట్టిన జనం సొమ్మెంతో, సర్కారు ఉత్తర్వులే బయట పెట్టాయి. ఇప్పటిదాకా సర్కారు ఫర్నీచరును సర్కారుకు స్వాధీనం చేయని సిగ్గుమాలిన-కక్కుర్తితనానికి జవాబు ఇవ్వడం బదులు, వాటిపై జనాభిప్రాయాన్ని బయటపెడుతున్న ‘సూర్య’పై ఎదురుదాడి చేయడం.. పిరికితనమే కాదు. సిగ్గుమాలిన వ్యవహారమే. ‘విడిచేసింది వీధికి పెద్ద’ అన్నది చింతామణిలో సుబ్బిశెట్టి చెప్పిన డైలాగు. వైకాపా సోషల్మీడియా విడిచేసినతనం కూడా అంతే!
తన ముడ్డి కాకపోతే కాశీ దాకా దేకమన్నది మనం చిన్నప్పుడు విన్న ఓ సామెత. ఈ మధ్య కాలంలో పొట్టపగిలిలేలా తినిపో”..తిన్నోళ్లకు తిన్నంత పందెం కోడి.. తిన్నంత భోజనం.. వచ్చి తినిపో.. నాపొట్ట నా ఇష్టం… బకాసుర రెస్టారెంట్ పేర్లతో హోటళ్లు తెరవడం చూస్తున్నాం. బహుశా వీటికి జగన్ క్యాంపు ఆఫీసు మింగేసిన మూడున్నర కోట్ల ఎగ్ పఫ్ బిల్లు స్ఫూర్తి కావచ్చు. లేదా ఆ పేర్లే ఎగఫ్లు భోజనం చేయడానికి స్ఫూర్తిదాయకం కావచ్చు. ఇప్పుడు జగనన్న క్యాంపు ఆఫీసు తిన్న తిండి.. సెక్యూరిటీ.. ప్యాలెస్ సోకుల కోసం చేసిన ఖర్చులు చూస్తే బకాసురులు, అమెరికా అధ్యక్షులు కూడా కుళ్లుకోక తప్పదు మరి.
పోనీ అప్పటికే ఉన్న 900 మంది పోలీసులతోపాటు.. ప్రైవేటు సెక్యూరిటీ కోసం తగలెట్టిన కోట్ల రూపాయలవల్ల, ఏమైనా ఫాయిదా ఉందా అంటే అదీ లేదు. రోజూ జనం మధ్య తిరిగే సీఎంలకయితే సెక్యూరిటీ గట్రాలు కావాలి.
కానీ కాలుబయటపెడితే ఆకాశంలో , రోడ్డుమీదకొస్తే పరదాలు కట్టుకునే భాగ్యానికి అన్నేసి వందలమందితో సెక్యూరిటీ ఎందుకు? పోనీ జగనన్న ఏమైనా తీవ్రవాదుల హిట్ లిస్టులో ఉన్నాడా అంటే అదీ లేదు. ఆయన అజాతశత్రువు. ఆయనకు ఉన్నదంతా అక్కాచెల్లెమ్మలు, అవ్వాతాతలు, నా ఎస్సీలె, నా బీసీల కదా? చివరాఖరకు దేవుడి గుడి సెట్టింగులు కూడా ఇంట్లోనే వేసుకునే బాపతుకు.. ఇద్దరు ఎస్ఐలు, ఇద్దరు హోంగార్లు కూడా ఎక్కువే.
ఇక జగనన్న జమానాలో వివిధ సేవల కోసం నాకేసిన ప్రజాధనం జాబితా చూస్తే కళ్లుతిరిగిపడిపోక తప్పదు. ఇంటలిజన్స్ వింగ్ జగనన్నకు ప్రేమతో ఇచ్చిన ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలకు లక్షలు నాకేశారు. నాటి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, జగన్ దోస్తు శ్రీకాంత్రెడ్డి ఇంటి అద్దెలు కూడా ఖజానా నుంచే చెల్లించారంటే.. జగన్ జమానాలో మంది సొమ్మును ఎంత సమ్మగా జుర్రుకున్నారో అర్ధమవుతుంది. ఆ లెక్కలు ఇప్పుడు బయటకొచ్చాయి. అవేమిటో చూద్దాం.
జీఓ నెంబర్ : 160
లోటస్ పాండ్ లో ఉన్న జగన్ ఇంటికి సిసి కెమెరాల ఖర్చు : రూ.12.50 లక్షలు
లోటస్ పాండ్ లో బాత్ రూమ్ కోసం : రూ.12 లక్షలు
జీఓ నెంబర్ : 279
తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ “వ్యూ కట్టర్” కోసం రూ:3.25 కోట్లు .
జీవో నెంబర్ : 139
తాడేపల్లి ప్యాలెస్ లో 24 గంటలు ఒక ఎలక్ట్రీషియన్ అందుబాటులో ఉండటానికి : రూ.8.50 లక్షలు
మన ఇంట్లో పనికి అయితే, మహా అయితే, రోజుకి వెయ్యి తీసుకుంటున్నారు. ఇక్కడ లక్షలు ఇచ్చారు
జీవో నెంబర్ : 146
తాడేపల్లి ప్యాలెస్ లో ట్రాన్స్ ఫార్మర్ కోసం : రూ.97 లక్షలు
తాడేపల్లి ప్యాలెస్ లో సిసిటీవీ, సోలార్ ఫెన్సింగ్ కోసం రూ.1.25 కోట్లు
తాడేపల్లి ప్యాలెస్ లో ఏసి పెట్టటానికి రూ.80 లక్షలు
320 KVA DG సెట్ కోసం : రూ.39 లక్షలు
తాడేపల్లి ప్యాలెస్ లో లైట్ లు పెట్టటానికి : రూ.11.50 లక్షలు
ఏపీ సెక్రటేరియట్ లో ఉన్న ఇన్వర్టర్ పీక్కుని వచ్చి, తాడేపల్లి ప్యాలెస్ లో బిగించటానికి : రూ.11 లక్షలు
జీవో నెంబర్ : 132
జగన్ ఇంటికి వెళ్ళే రోడ్డు వేయటానికి, 1 కిమీ రోడ్డుకి, : రూ.5 కోట్లు
జీవో నెంబర్ : 308
జగన్ ఇంట్లో కుర్చీలు, టేబుల్స్ కొనటానికి రూ.39 లక్షలు
జీవో నెంబర్ : 133
జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి హెలిప్యాడ్ దాకా వెళ్ళటానికి, రోడ్డుకి ఫెన్సింగ్ వేయటానికి రూ.40 లక్షలు
తాడేపల్లి ప్యాలెస్ లో శాశ్వత ఐరన్ ఫ్రేమ్స్ తో గ్రిల్స్ పెట్టటానికి : రూ.75 లక్షలు
తాడేపల్లి ప్యాలెస్ లో దొడ్లు కట్టటానికి : రూ.43.50 లక్షలు
జగన్ ఇంటి చుట్టూ సెక్యూరిటీ పోస్ట్స్ , గేట్స్ శాస్వతంగా పెట్టటానికి రూ.31 లక్షలు
జీవో నెంబర్ : 329
తాడేపల్లి ప్యాలెస్ లో కూలర్ లు పెట్టటానికి రూ.22.50 లక్షలు
జీవో నెంబర్ : 330
తాడేపల్లి ప్యాలెస్ లో కిటికీలు పెట్టటానికి రూ.73 లక్షలు
జీవో నెంబర్ : 329
జగన్ ప్రమాణస్వీకారానికి ఎలెక్ట్రికల్ లైటింగ్ పెట్టటం కోసం : రూ.22 లక్షలు
జీవో నెంబర్ : 1737
జగన్ రెడ్డి వ్యక్తిగత పర్యటన కోసం, ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయటానికి, జెరెసులాం వెళ్ళినందుకు : రూ.22.52 లక్షలు
జీవో నెంబర్ : 254
జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో తాత్కాలిక పనులు కోసం ఖర్చు : రూ.22.50 లక్షలు
జీవో నెంబర్ : 1609
జగన్ ఫ్రెండ్ శ్రీకాంత్ రెడ్డి ఉండటానికి, బెజవాడలో ఒక అపార్ట్ మెంట్ ఫ్లాట్ అద్దె కోసం, లక్ష రూపాయలు. మళ్ళీ 5 వేలు ఖర్చుల కోసం కూడా
జీవో నెంబర్ : 1742
బూడి ముత్యాల నాయుడు ఉండటానికి, బెజవాడలో ఒక అపార్ట్ మెంట్ ఫ్లాట్ అద్దె కోసం, లక్ష రూపాయలు. మళ్ళీ 5 వేలు ఖర్చుల కోసం కూడా
జీవో నెంబర్ : 1741
దాడిశెట్టి రాజా ఉండటానికి, బెజవాడలో ఒక అపార్ట్ మెంట్ ఫ్లాట్ అద్దె కోసం, లక్ష రూపాయలు. మళ్ళీ 5 వేలు ఖర్చుల కోసం కూడా
జీవో నెంబర్ : 1743
పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఉండటానికి, బెజవాడలో ఒక అపార్ట్ మెంట్ ఫ్లాట్ అద్దె కోసం, లక్ష రూపాయలు. మళ్ళీ 5 వేలు ఖర్చుల కోసం కూడా
సాక్షిలో పని చేసే ఉద్యోగులకు, ప్రభుత్వం నుంచి జీతాలు
సజ్జలకు ఇంట్లో టీ కప్పులు కొనుక్కోవటానికి రూ.1.50 లక్షలు
సజ్జలకు ఇంట్లో ఫర్నిచర్ కొనుక్కోవటానికి రూ.3 లక్షలు.