Suryaa.co.in

Andhra Pradesh

అచ్యుతాపురం సెజ్‌లో ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది

-మంత్రి లోకేష్‌

అమరావతి: అనకాపల్లి జిల్లా, అచ్యుతాపురం సెజ్ లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలి పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్‌ అన్నారు. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి, వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ప్రాణాలు కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి ఇప్పటికే యంత్రాంగాన్ని ఆదేశించారని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

LEAVE A RESPONSE