రచయిత శ్రీపాద శ్రీనివాసు రచించిన “మనసున ఉన్నది” జూలై 9 వ తేది, ఆదివారం నాడు రాజమండ్రి నగరంలోని ధర్మంచర హాలులో ఆవిష్కరణ కానున్నది. విన్నూత తరహాలో తన బాల్య స్నేహితుల సమక్షంలో తాను విద్యను అభ్యసించిన మున్సిపల్ టౌన్ హైస్కూల్ చెందిన నాటి ఉపాధ్యాయిలచే రచయిత శ్రీపాద శ్రీనివాసు ఈ ఆవిష్కరింపచేయనున్నాడు.
గతంలో కూడ శ్రీనివాసు “గుండె చప్పుళ్లు” మరియు “చట్టసభల్లో గోదావరి గళం” పేరుతో రెండు పుస్తక సంపుటిలను రచించారు. విమర్శకుల నుండి సైతం ఆ రెండు పుస్తకాలు ప్రశంసలను అందుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఆకాశవాణి హైద్రాబాద్ కేంద్రం నుండి తన స్వీయ రచన మరియు వాయిస్ తో ప్రసారం అయిన పలు కధలు, కథానికలను మరియు పలు పత్రికలు, వైబ్ సైట్స్ లో వచ్చిన తన రచనలను కూర్చి “మనసున ఉన్నది” పేరున ఓ పుస్తక రూపంలో తీసుకురానున్నారు.
తెలుగుబాషా ప్రియుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుధ్దప్రసాద్ , ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి, సీనియర్ శాసనసభ్యుడు డి.శ్రీధర్ బాబు రాసిన ముందుమాట ఈ పుస్తకానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి పార్లమెంట్ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే, తిరుమల-తిరుపతి దేవస్ధానం పాలక మండలి మాజీ సభ్యుడు రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, ప్రముఖ న్యాయవాది చింతపెంట ప్రభాకర్ తో పాటు రాజమండ్రి నగరంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, వర్తక సంఘ ప్రముఖులు, సంఘసేవకులు పాల్గొనున్నారు.