Suryaa.co.in

Features

కొందరు చదివితే పుస్తకం.. వెలిగిపోవు మస్తకం.

కొందరు చదివితే
పుస్తకం వెలిగిపోవు మస్తకం..
మరికొందరికి పుస్తకం
ఓ మైకం..

ఇంకొందరికి పుస్తకమే లోకం…
మొత్తానికి పుస్తకం ఏదైనా
అది వాగ్దేవి అష్టకం…!

నప్పని వారికి పుస్తకం
ఓ తూకం..
వచ్చేది కాస్తయినా పైకం..
ఆమ్మేస్తే ఆ ఆనందం పైశాచికం!
అదో మాలోకం..!!

పుస్తక దినోత్సవం సందర్భంగా..

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286
* * *

ఒకమ్మాయి నాన్నతో వరండా లో కూర్చుని వుండగా ఆమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఇంటికొచ్చాడు
అమ్మాయి : ” ఓహ్ ! యండమూరి వ్రాసిన ‘ ఇంట్లో నాన్నున్నాడు ‘ పుస్తకం తీసుకోడానికి వచ్చావా?
బాయ్ ఫ్రెండ్ : ” లేదు …. యుద్దనపూడి వ్రాసిన ‘ నీ కోసం …. నా నిరీక్షణ ఎక్కడ? ‘ అనే బుక్ కోసం వచ్చాను ?
అమ్మాయి: ” అలాగా ! ఆ బుక్ నాదగ్గరలేదు. గొల్లపూడివ్రాసిన ” మామిడి చెట్టుక్రింద” వుంది. తీసుకెళ్లు ”
బాయ్ ఫ్రెండ్: ” సరే మధుబాబు వ్రాసిన ‘అయిదు నిముషాల్లో ‘ బుక్ కాలేజ్ కి తేవటం మర్చిపోయాను”
అమ్మాయి: “పరవాలేదు నేను కాలేజ్ కి ముల్లపూడి రాసిన ‘ నీకోసం తప్పకుండా” బుక్ తీసుకొస్తాను”

బాయ్ ఫ్రెండ్ వెళ్లిపోయాక…

డాడ్ :”అన్ని పుస్తకాలు చదవగలడా?”
అమ్మాయి :”చదవగలడు డాడీ అతను చాలా ఇంటెలిజెంట్ ”
డాడీ :”అలాగా మంచిది గంగాధర్ వ్రాసిన “పెద్దోళ్లు . వెధవలు కాదు” అనే పుస్తకాన్ని మాత్రం ఇవ్వటం మర్చిపోకు ”

ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలతో…

 

LEAVE A RESPONSE