పనైపోయింది..
జగన్ దగ్గర అంత సీన్ లేదు..
ఇక కెరీర్ ముగిసిపోయినట్టే..
సత్తిబాబుకు సిఎం చెక్ పెట్టేసిండు..!
ఇలాంటి చవకబారు
కామెంట్స్ కు చెక్ పెడుతూ
బొత్స సత్యనారాయణ ఉరఫ్ సత్తిబాబు మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు.అయితే అందుకోసం పెద్ద అట్టహాసం..
హంగామా… బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్..ప్రచార పటాటోపం..
ఇలాంటివి ఏవీ లేకుండా జరగాల్సింది కామ్ గా కానిచ్చేసారు.మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ అనే మాట మొదలుకాగానే అందరిలోనూ ఒకటే సందడి.
అప్పటికింకా మంత్రులుగా ఉన్నోళ్ళలో ఒక రకం టెన్షన్..మిగిలిన ఎమ్మెల్యేలలో ఇంకో రకం అటెన్షన్..ఇదంతా సింగిల్ హాండ్ తో చక్కబెట్టే ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డిలో సైతం అదోలాంటి ఫీలింగ్..నిజానికి ఆయన మొహంలో ఎప్పుడూ ఏ ఫీలింగూ కనిపించదు.
ఇంత గందరగోళంలోనూ ప్రశాంతంగా కనిపించిన ఒకే ఒక్కడు..బొత్స సత్యనారాయణ.
నిన్నమొన్నటి వరకు ఆయన విజయనగరం కోరాడ వీధిలోని స్వగృహంలో రెండో అంతస్తులో ప్రశాంతంగా పేపర్ చదువుతూ…ఫోన్ చూసుకుంటూ..వచ్చిపోయేవారితో మాట్లాడుకుంటూ కూర్చున్నారు.మొన్న శ్రీరామనవమి నాడు కూడా..అంటే తెల్లారితే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం..ఆ సాయంత్రానికే జాబితా వస్తుందన్న ఊహాగానాలు సాగుతున్న తరుణంలో అలవాటు ప్రకారం సతీసమేతంగా రామతీర్థం వెళ్లి సీతారాములకు నూతన వస్త్రాలు సమర్పించి వచ్చారు.అంతా దేవుడే చూసుకుంటాడనే ఎక్స్ప్రెషన్ ఆ సమయంలో ఆయన మొహంలో కనిపించినా ఎప్పుడు చేసాసారో మానవ ప్రయత్నం.. సాయంకాలనికే అనుకున్నది సాధించేశారు.
గుడిలో గంట కొట్టిన గంట గడిచేపాటికే అమరావతిలో.. తాడేపల్లిలో గంట కొట్టేశారు.మంట లేకుండా వంట కానిచ్చేసారు.నిజానికి ఇది చాలా పెద్ద విజయం..మొత్తం మంత్రివర్గాన్ని రెండున్నరేళ్లలో మారుస్తానని చెప్పిన జగన్మోహన రెడ్డి తన మనసు మార్చుకుని ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం పది మందిని తిరిగి తీసుకునేట్టు చేసిన అతి చిత్రమైన మోళీ.
నిజానికి ఒక్క సత్తిబాబును..మరీ అయితే పెదిరెడ్డిని తిరిగి తీసుకోవడానికే ఇంకో ఎనిమిది మందిని మళ్లీ చేర్చుకోవాల్సి వచ్చిన పరిస్థితి..ఇది ఆషామాషీ కాదు..సత్తిబాబు..జగన్ మధ్య ఇంత దూరం..అంత వైరం ఉందని కొందరు చాలాకాలంగా చేస్తున్న దుష్ప్రచారానికి ఇక సెలవు చెబితే మంచిది…
వాస్తవానికి ఈ మంత్రివర్గం మార్పు..కూర్పు వెనక అందరూ గొప్పగా చెప్పుకునే ప్రశాంత్ కిశోర్ ప్రమేయం సైతం పెద్దగా ఉన్నట్టు కనిపించలేదు.
అలాగే జగన్ కోటరీలో అత్యంత కీలకం అని చెప్పే విజయసాయి రెడ్డి ప్రభావం కూడా ఉన్నట్టు లేదు..జగన్ మార్కు..సత్తిబాబు స్పార్కు..అంతే!
ఉత్తరాంధ్ర రాజకీయాలపై సత్తిబాబు అజమాయిషీకి చెక్ పెట్టేందుకే విజయసాయి రెడ్డిని విశాఖలో ప్రతిష్టించారన్న ప్రచారానికి కూడా తెర పడినట్టే..విజయసాయి రియల్ ఎస్టేట్ బాస్ మాత్రమేనని..
సత్తిబాబు రియల్ హీరో అని తేలిపోయింది.అదీ నిజమే కదా..సుమారు 43 సంవత్సరాల రాజకీయ అనుభవం..సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ పదవీ కాలాన్ని మినహాయించినా పద్దెనిమిది సంవత్సరాల పదవీ నిర్వహణ పరిణితి..తన ఒక్కడి గెలుపు మాత్రమే గాక మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి..2019లో వైసిపికి అసాధారణ విజయాలను కట్టబెట్టిన సింగిల్ హ్యాండ్..
ఎటువంటి ప్రత్యర్థి రాజకీయాలనైనా..సొంత పార్టీ చాప కింద వ్యవహారాలనైనా అవలీలగా తిప్పి కొట్టగలిగే చాణక్య నీతి..తాను..సతీమణి ఎంపిగా చేసినందువల్ల హస్తినలో కూడా పెద్ద పరిచయాలు..ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా ఆరు మంత్రిత్వ శాఖలను నిర్వహించిన చతురత..ఇవన్నీ సత్తిబాబు ప్లస్ పాయింట్లు..అంతేకాదు..వైసిపి ఎమ్మెల్యేలలో..మంత్రుల్లో పెడిరెడ్డి తర్వాత వయసులో కూడా పెద్ద వాడు..రాష్ట్రవ్యాప్తంగా పలుకుబడి కలిగిన వ్యక్తి..
అంతటి కాంగ్రెస్ లోనే పిసిసి అధ్యక్షుడిగా..ప్రధాన కార్యదర్శిగా పని చేసిన నాయకుడు..ఇదే జగన్ తండ్రి వైఎస్సార్ కి అత్యంత సన్నిహితుడిగా మసలిన వాడు..రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మతో కూడా కుటుంబ సభ్యడికి ఉన్నంత చనువు కలిగిన మనిషి..ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులతో మంచి పరిచయాలు కలిగిన నేత…అటు నుంచి ఇటు ఎందరినైనా తీసుకురాగలిగే కెపాసిటీ కలిగిన దురంధరుడు..అదే సమయంలో ఇటు నుంచి అటైనా..ఎటైనా జనాల్ని మళ్ళించగలిగే…!!??
ఇన్ని అర్హతలు కలిగిన బొత్సకు పదవీ బొనాంజా రావడం ఆశ్చర్యం ఏమీ కాదు!
ఇక పోర్టు పోలియో అంటారా..మొదటసారి రాజశేఖర రెడ్డి భారీ పరిశ్రమల శాఖను అప్పగించినప్పుడు
ఇలాగే పెదవి విరిచిన వారు లేకపోలేదు..ఆ తర్వాత మరీ ప్రాధాన్యత ఉండని మార్కెటింగ్..శాఖ ఏదైనా సత్తిబాబు కేకే..
నిన్నటి వరకు విజయనగరం జిల్లాలో పాముల పుష్ప శ్రీవాణి..పొరుగున శ్రీకాకుళం లో ధర్మాన కృష్ణదాస్ ఉపముఖ్యమంత్రులుగా ఉన్నారు..సత్తిబాబు హవా ఏం తగ్గిందని..
నాన్నా..పులి ఎక్కడున్నా పులే..
సత్తిబాబు సినిమా ఏస్తే
అది షోలే..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
జర్నలిస్ట్
9948546286