Suryaa.co.in

Andhra Pradesh

పదో తరగతి పరీక్ష పత్రాలు లీకైతే దానికి బాధ్యుడు బొత్స సత్యనారాయణ….

-మాజీ మంత్రి నారాయణ కాదు !
-అమరావతి గురించి జగన్మోహన్ రెడ్డి, రామకృష్ణారెడ్డికి ఏమైనా తెలుసా… రాజధాని నిర్మాణంపై ముఖ్యమంత్రి ఏనాడైనా అధికారులతో సమీక్షచేశాడా?
• 16నెలలు జైల్లో ఉండి, దేశంలో ఎవరూచేయనంత అవినీతిచేసిన జగన్మోహన్ రెడ్డి సిగ్గులేకుండా అందరూ అవినీతిపరులేనంటున్నాడు.
• చంద్రబాబు జనంలోకి వెళ్తుండటంతో జగన్మోహన్ రెడ్డికి వణుకుమొదలైంది… దాన్ని కప్పిపుచ్చి, కవర్ చేసుకోవడానికే నారాయణను అరెస్ట్ చేయించాడు.
• గడపగడపకు అని జనంలోకివెళ్తున్న అధికారపార్టీవారు..ఏంచేశామని చెబుతారు? ఇసుక, మద్యం, మట్టి, నీళ్లు, భూములు, ఖనిజసంపద దోచేశామనా…లేక అప్పుల్లో, అత్యాచారాల్లో రాష్ట్రాన్ని టాప్ లోఉంచామని చెబుతారా?
– మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్

విద్యార్థులకు నాణ్యమైన, ఉన్నతవిద్యాభ్యాసం అందించలేనని, నిరుద్యోగులు, యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించలేని జగన్మోహన్ రెడ్డికి అర్థమైనట్టుఉందని, తన అసమర్థత, చేతగానితనం యువత, విద్యార్థులుపసిగట్టకూడదన్న ఒకేఒక్కలక్ష్యంతోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన నారాయణవిద్యాసంస్థలను ముఖ్యమంత్రి టార్గెట్ చేశాడని, ఆక్రమంలోనే జర గని పేపర్ లీకేజ్ ఘటనకు నిందితుడినిచేస్తూ, మాజీమంత్రి నారాయణను అరెస్ట్ చేశారని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ స్పష్టంచేశారు.బుధవారం ఆయన మంగళగిరిలోని టీడీపీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడ రు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే…

నిన్నమొన్నటివరకు మంత్రిబొత్ససహా, వైసీపీలోని పనికిమాలిన వాళ్లంతా పదోతరగతి పరీక్షపత్రాలు లీక్ కాలేదని దబాయించారు. ఇప్పుడేమో నారాయణే చేశాడు…ఆయనకు చెందిన నారాయణ విద్యాసంస్థల్లోని విద్యార్థులకోసం చేయించాడని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. పేపర్ లీక్ ఘటనలకు సంబంధించి, తిరుపతి పబ్లిక్ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో, దాన్నే యథావిధిగా చిత్తూరుఎస్సీ వల్లెవేశాడు.

నారాయణ విద్యాసంస్థల్లో పేపర్ లీకేజ్ అనేదిఎప్పట్నుంచో జరుగుతుందని కూడా ఎస్సీ మాట్లాడాడు. రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా జరిగితే అప్పుడు ఆయనేం చేశాడు? నారాయణ, చైతన్య విద్యాసంస్థల్ని వాటి విద్యావిలువల్ని చూసి జగన్మోహన్ రెడ్డి ఓర్వలేకపోతున్నాడు. ఎవరైనా బాగుపడితే జగన్ రెడ్డికి నిద్రపట్టదు. అందుకే ఇప్పుడు నారాయణ విద్యాసంస్థలకు తాళాలేసి, లక్షలాది మంది విద్యార్థుల్ని రోడ్డునపడేయాలనిచూశాడు. నారాయణ, చైతన్యలాంటి విద్యాసంస్థలు ఆవిర్భవించాకే తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఉన్నత చదువుల్లో అగ్రస్థానంలో నిలిచారు.

నారాయణను అరెస్ట్ చేశామని చంకలుగుద్దుకున్న ముఖ్యమంత్రి, మంత్రిబొత్స, ప్రభుత్వం చివరకు ఏంసాధించింది? నారాయణను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాక, ఎలాంటిఆధారా లుచూపించలేక ఈప్రభుత్వంలోని అధికారులు ముఖాలువేలాడేశారు.

మంత్రి బొత్ససత్యనారాయణకు విద్యాశాఖ తీసుకోవడం సుతరాము ఇష్టంలేదు. విద్యాశాఖ మంత్రిగా ప్రమాణంచేసేనాడే ఆయన ముఖంమాడ్చుకున్నాడు. ఎలాంటి ఆదాయంలేని శాఖ తనకెందుకన్న అసంతృప్తితో బొత్సఉన్నాడు. వాస్తవంగా ఏప్రభుత్వంలో పరీక్షపత్రాలు లీక్ అయితే, ఆప్రభుత్వమే బాధ్యతతీసుకోవాలి.. లేదా సంబంధితశాఖామంత్రి రాజీనామా చేయాలి.

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లరామకృష్ణారెడ్డికి గానీ, జగన్మోహన్ రెడ్డికిగానీ అసలు అమరావతి నిర్మాణం, దాని రూపురేఖలు గురించి తెలుసునా? అమరావతినిర్మాణమంటేనే తొలినుంచీ తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఆఖరికి భూములిచ్చిన రైతులు సహా, దళితులు, మైనారిటీలను నడిరోడ్డుపైనిలబెట్టాడు. ఏనాడైనాజగన్మోహన్ రెడ్డిగానీ, ఆళ్ల గానీ అమరావతిప్రాంతంలో పర్యటించి, ఎక్కడెక్కడ ఏమేం పనులు జరుగుతున్నాయి…మనం అధి కారంలోకి వచ్చాకే నిర్మాణం ఎందుకు నిలిచిపోయిందని సమీక్షచేశారా? దేశంలో ఏ ముఖ్య మంత్రికి, ఏ ప్రభుత్వానికి తగలనివిధంగా జగన్మోహన్ రెడ్డికే ఎందుకు న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి?

తప్పులమీదతప్పులుచేస్తూ, కోర్టులతో చీవాట్లు తింటూ, సిగ్గు లేకుండా బతికేస్తున్న ఏకైకముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిచరిత్రలో నిలిచిపోతారు. ముఖ్య మంత్రి అయ్యాక జగన్మోహన్ రెడ్డి ఏవర్గానికి ఏంన్యాయంచేశాడో చెప్పగలడా? కౌలురైతులు, రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ ఏడుస్తూనేఉన్నారు. ప్రజలంతా ఏడుస్తుంటే, జగన్మోహన్ రెడ్డి, ఆయనతాబేదార్లు… చెంచాలుమాత్రం నవ్వుతూ గడిపేస్తున్నారు. 16నెలలుజైల్లోఉండి, దేశంలోఎవరూచేయనంత అవినీతిచేసి సిగ్గులేకుండా వాళ్లు తప్పుచేశారు.. వీళ్లు తప్పుచేశారని నువ్వెలా చెబుతావు జగన్మోహన్ రెడ్డి?

బాదుడే బాదుడు పేరుతో చంద్రబాబు జనంలోకివెళ్తుండటంతో జగన్మోహన్ రెడ్డికి వణుకు మొదలైంది… దాన్ని కప్పిపుచ్చి, కవర్ చేసుకోవడానికే నారాయణను అరెస్ట్ చేయించాడు. పొత్తులపై మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి, ఆయన చెంచాలంతా సింగిల్ గా రావాలని చంద్ర బాబుని అంటున్నారు. మీరు చేతగానివారు కాబట్టే పీకే (ప్రశాంత్ కిషోర్ ) ని తోడుచేసుకొని ఆయనరాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం,కులాలుమతాలమధ్యన చిచ్చుపెట్టి అధికారంలోకివచ్చారు.

అధికారంలోకి రాకముందు వైసీపీవారు, ఇప్పుడున్న మంత్రులంతా గెడ్డాలు పెంచుకొని రోడ్లపై తిరిగేవారు.ఇప్పుడేమో ఒక్కొక్కడు ఒక్కో మినీఅంబానీలా కాలర్ ఎగరేస్తూ తిరుగు తున్నారు. చంద్రబాబుగారి పాలనకు, జగన్మోహన్ రెడ్డి పాలనకు ఆకాశానికి, భూమికి ఉన్నంతతేడాఉంది. రాష్ట్రంబాగుపడాలని, ప్రజలంతా సంతోషంగాఉండాలని, తెలుగుజాతి ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా ఎగబాకాలన్నదే చంద్రబాబుగారి తపన. పొద్దున్నలేస్తే చంద్రబాబు గారి పేరుచెప్పకుండా ఈ ముఖ్యమంత్రి బతకలేకపోతున్నాడు. రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలుజరుగుతుంటే తెలుగుదేశం వారే చేయిస్తున్నారంటారా? అన్నీ తెలుగుదేశంవారు, చంద్రబాబుగారే చేస్తుంటే , అధికారంలో ఉండి మీరు గాడిదలు కాస్తున్నారా? సొంతబాబాయ్ ని చంపినవారిని పట్టుకోలేని ముఖ్యమంత్రి, పోలీస్ వ్యవస్థను తనరాజకీయస్వార్థానికి వాడుకొని సర్వనాశనంచేసి, రాష్ట్రాన్ని ప్రజల్ని వారిఖర్మకు వారిని వదిలేశాడు.

జగన్మోహన్ రెడ్డి తనచర్యలతో, అతితెలివితేటలు చూపిస్తూ తనగొయ్యి తానే తీసుకుంటున్నా డు. అధికారమనే గొడ్డలి చేతికి అందిందని దానితో తనను తానే నరుక్కుంటున్నాడు. జగ న్మోహన్ రెడ్డికి దమ్ము,ధైర్యముంటే చంద్రబాబుగారిని అరెస్ట్ చేయించాలి. గడపగడపకు అంటూ జనంలోకి వెళ్లి, వైసీపీవారు ఏంచెబుతారు? పిచ్చిమద్యంతోప్రజల ప్రాణాలు తీస్తున్నా మని, ఇసుకధరలుపెంచామని, మట్టి, నీళ్లు, సిమెంట్ అన్నీ అమ్ముకున్నామని చెబుతారా? అవినీతిపరుడి పాలనలో పారదర్శకపాలన జరుగుతుందంటే ప్రజలు నమ్ముతారా?

LEAVE A RESPONSE