రేలంగికి ముందే తెలుగు సినిమాలో హాస్యనటులు ఉన్నా రేలంగితో తెలుగులో హాస్యనటులకు ఒక ప్రతిష్ఠ వచ్చింది. ఎందరో గొప్ప హాస్యనటులు వచ్చారు తెలుగు సినిమాలో. ఆ అందరిలోనూ బ్రహ్మానందం గొప్ప! ఈ మాట అన్నందుకు తెలుగు మధ్యతరగతి మాంద్యం నన్ను నిందిస్తుంది నాకు తెలుసు. ‘నింద కన్నా నిజం శ్రేష్ఠం!’
తెలుగులో సర్వ శ్రేష్ఠమైన హాస్యనటుడు బ్రహ్మానందం! బ్రహ్మానందం అంత ప్రజ్ఞ, ప్రతిభ ఉన్న హాస్యనటుడు తెలుగులో ఇంత వరకూ రాలేదు. Most able and efficacious performanceతో బ్రహ్మానందం తెలుగు సినిమాలో మరో బ్రహ్మానందం లేడు అన్న స్థితిలోనూ, స్థాయిలోనూ ఉన్నారు.
కోట శ్రీనివాసరావు ఎలా అయితే conceptulized performanceతో తన ముద్రను బలంగా వేశారో, బ్రహ్మానందం కూడా conceptulized performanceతో ఒక హాస్యనటుడిగా తెలుగు సినిమా ముద్రగా నిలిచారు.
దక్షిణాది సినిమాకు సంబంధించి కన్నడంలో నరసింహరాజు, తమిళ్ష్లో చంద్రబాబు, నాగేష్ (నగేష్ కాదు) వంటి వారు ప్రముఖ ప్రతిభావంతమైన హాస్యనటులు. కానీ తమిళ్ష్ వడివేలు, తెలుగు బ్రహ్మానందం conceptulized performance ఇచ్చిన హాస్యనటులు.
వడివేలు, బ్రహ్మానందం దేశ సినిమాలో వచ్చిన అత్యంత ప్రతిభావంతమైన హాస్యనటులు. Predominant and piercing హాస్యనటులు వడివేలు, బ్రహ్మానందం. ఈ సందర్భంలో నాగేష్ ప్రతిభను విస్మరించడం లేదు.
వడివేలు, బ్రహ్మానందం హాస్యస్ఫోరకత సహజమైంది. అందులో బ్రహ్మానందం విశేషం. కొన్ని సందర్భాల్లో బ్రహ్మానందం స్థాయిని వడివేలు అందుకోలేదు. బ్రహ్మానందం తమిళ్ష్లోనూ స్థానం, పరిగణన పొందారు. వడివేలుకు తెలుగులో స్థానం రాలేదు.
బ్రహ్మానందం వల్ల తెలుగు సినిమా హాస్యం ఎంతో మెరుగును, మేలును పొందింది. బ్రహ్మానందంకు ముందు తెలుగు హాస్యనటులు ఇతర భాషీయుల చేత శ్లాఘించబడలేదు. బ్రహ్మానందం శ్లాఘించబడ్డారు. ఇవాళ్టి రోజున తమిళ్ష్ కళాకారుల చేత బ్రహ్మానందం శ్లాఘించబడుతున్నారు.
బ్రహ్మానందం తెలుగు సినిమాకు boon and boost. తెలుగు సినిమా గర్వించతగ్గ ప్రశస్తమైన నటుడు బ్రహ్మానందం.
ఆయనకు జన్మదినాభినందనలు.
రోచిష్మాన్
9444012279