Suryaa.co.in

Andhra Pradesh

పండుగ రోజున కూడా అర్చకులను పస్తులుంచిన బ్రాహ్మణద్వేషి జగన్‌రెడ్డి

-బ్రాహ్మణ ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది
-తిరుపతిలోని నాలుగైదు బ్రాహ్మణ హాస్టళ్లను దురాక్రమణ చేశారు
-బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులను దారి మళ్ళించా
-టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి బుచ్చిరాంప్రసాద్

రాష్ట్రంలో అందరూ సంక్రాంతి పండుగ చేసుకుంటుంటే ఈ ప్రభుత్వం బ్రాహ్మణులకు ఒకపూటకు మాత్రమే పరిమితం చేసింది. పౌరుల హితం కోరేవాడే పురోహితుడు. వారిని కూడా ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేస్తోంది. పూర్వం రాజులు పురోహితులను ఎంతగానో గౌరవించేవారు. వారి కి కావాల్సిన అవసరాలు తీర్చేవారు. జమీందారులు కూడా ఇదే తోవలో నడిచారు. అయితే ఈ ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబునాయుడు వంద కోట్లతో బ్రాహ్మణ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి బ్రాహ్మణులను ఆదుకున్నారు. వైసీపీ నాయకులు టీటీడీని ఒక వ్యాపార సంస్థగా మార్చారు.

టీటీడీని ఒక ఆదాయ వనరుగా ఉపయోగించుకుంటున్నారు. ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే తెరిచే వైకుంఠ ద్వారాన్ని ఎప్పుడు బడితే అప్పుడు తెరిచి పవిత్రతను దిగజార్చుతున్నారు. దాన్ని కూడా వ్యాపార ధోరణిలోకి లాగారు. చంద్రబాబు నాయుడు 500 కోట్ల రూపాయలతో రెండున్నర లక్షల మంది బ్రాహ్మణులకు వివిధ పథకాల ద్వారా సహాయం చేశారు. వైసీపీ ప్రభుత్వం విదేశీ విద్యను రద్దు చేసింది.

మూడున్నరేళ్లుగా విదేశీ విద్య లేదు. టీడీపీ హయాంలో వితంతువులు, అనాధలకు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాటిని రద్దు చేసింది. టిడిపి హయాంలో బ్రాహ్మణుల అభివృద్ధికై 13 పథకాలను ప్రవేశపెట్టారు. వైసీపీ ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కింది. టిడిపి హయాంలో వేదాలు చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్ లు ఇచ్చేది. దీంతో వేద విద్యార్థులు లబ్ధి పొందేవారు. పురోహితులకు, వేద పండితుల పిల్లలను ఆదుకునేది. టీడీపీ హయాంలో రూ. 75 వేల రూపాయలు కళ్యాణమస్తు పథకం ద్వారా ఇచ్చేవారు.

కానీ ఈ ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులను దారి మళ్ళించారు. ఆ నిధులను అమ్మ ఒడికి మార్చారు. బ్రాహ్మణ సోదరులకు వైసీపీ ప్రభుత్వం చేసింది శూన్యం. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికి ఒక రూపాయి రుణం ఇవ్వలేదు. బ్రాహ్మణ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారు. ప్రతి కార్పొరేషన్ ను నవరత్నాల్లో భాగం చేశారు. 56 వేల మందికి రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగ విద్యా అవకాశాలు లభించేవి. అటువంటిదాన్ని నిర్వీర్యం చేశారు.

బ్రాహ్మణ ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. బ్రాహ్మణుల మాన, ప్రాణాలకు కూడా రక్షణ లేదు. బ్రాహ్మణుల ఆస్తులు అక్రమంగా స్వాధీనం చేసుకుంటున్నారు. తిరుపతిలోని నాలుగైదు బ్రాహ్మణ హాస్టళ్లను దురాక్రమణ చేశారు. వైసీపీలోని బ్రాహ్మణ పెద్దలు ఎవరైనా ముందుకు వస్తే చర్చకు సిద్ధం. బ్రాహ్మణులకు ఈ ప్రభుత్వం ఏమీ చేయటం లేదని బల్ల గుద్ది చెప్పగలం. బ్రాహ్మణులకు సహాయం చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణ కార్పొరేషన్ ను బలోపేతం చేస్తాం. హిందూ దేవాలయాలకు రక్షణ కల్పిస్తాం. జరిగిన అక్రమాల పై దర్యాప్తు జరుపుతాం. ఆక్రమణదారులను శిక్షించి బ్రాహ్మణ సోదరులకు న్యాయం చేస్తాం. ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు బ్రాహ్మణ కార్పొరేషన్ కు మంజూరు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది.

బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం దూరంగా ఉంది. ప్రతి ఒక పథకాన్ని నవరత్నాలకు తప్పితే వేరే వారికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. టీడీపీ హయాంలో అర్చక మిత్ర పథకం ద్వారా సహకార సంఘాలను ఏర్పాటు చేసి బ్రాహ్మణ క్రెడిట్ ఫెడరేషన్ ద్వారా లోన్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. 13 పథకాలు ద్వారా చంద్రబాబు నాయుడు బ్రాహ్మణ ల శ్రేయస్సు కోరి పనిచేశారు. విదేశీ విద్య పథకం ద్వారా పది లక్షల రూపాయలు 400 నుంచి 500 మంది విద్యార్థులకు ఇచ్చారని టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి బుచ్చిరాం ప్రసాద్ గుర్తు చేశారు.

LEAVE A RESPONSE