Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు రాక్షసుడు, ప్రజాకంఠకుడు

– చిత్తూరు జిల్లాలో చంద్రబాబు కారుకూతలు కూస్తున్నాడు
– కుప్పంలో చంద్రబాబు ఓటమి తథ్యం
– పుంగనూరులో నాపై పోటీ చేసి గెలిసే సత్తా ఉందా బాబూ?
– కార్యకర్తలను గూండాలుగా మార్చి రెచ్చగొట్టాడు
– చివరికి న్యాయమూర్తులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు
– చంద్రబాబు మానసిక స్థితి జరిగా లేదు
– తన జెండాను మోయలేక పవన్ కళ్యాణ్ చేతికి ఇచ్చాడు
– ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రజాకంఠకుడుగా, రాక్షసుడుగా మారాడని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన పార్టీ కార్యకర్తలన గుండాలుగా మార్చి రెచ్చగొట్టే నీచానికి చంద్రబాబు దిగజారాడని విమర్శించారు. చివరికి న్యాయమూర్తులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబు తన కుటిల రాజకీయ నైజంను చాటుకున్నాడని ఆరోపించారు. తన జెండాను మోయలేక, పవన్ కళ్యాణ్ కు జెండాను అప్పగించిన చంద్రబాబుకు కుప్పంలో తన ఓటమి అర్థమవుతోందని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే…
మేం ప్రజల కోసమే పనిచేస్తున్నాం. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు మాట్లాడుతూ… “నీ అంతుచూస్తా, నీ పని అయిపోయింది, కాస్కో..” లాంటిపదాలు ప్రయోగించాడు. చంద్రబాబు మానసిక పరిస్థితి బాగోలేదని ఈ మాటలను బట్టి అర్థమవుతోంది. మా నేత జగన్, పార్టీలోని మంత్రులు, ఇతర నేతలు అంతా ప్రజల కోసమే పనిచేస్తున్నారు. చంద్రబాబులా, తమ పార్టీ కార్యకర్తలు, తమ కుటుంబసభ్యులు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు, దుష్ట చతుష్టయంల కోసం పనిచేయడం లేదు. కేవలం ప్రజల కోసమే పనిచేస్తున్నాం.

జిల్లాలో అడుగు పెట్టిన నాటి నుంచి మాపైన ఏడుపే
ఏ కార్యక్రమం చేపట్టినా జగన్ ప్రజల సంక్షేమం కోసం, వారి కుటుంబాలు బాగుపడాలనే మంచి ఉద్దేశంతోనే పనిచేస్తున్నారు. మరి ఇవ్వన్నీ కూడా చంద్రబాబుకు తెలియనివి కావు. కానీ ఆయన ఎజెండా ఏమిటీ? ఈ జిల్లాకు వచ్చిన నాటి నుంచి ప్రతిరోజూ ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు. పండుగ రోజు కుటుంబసభ్యులు, పిల్లా పాపలతో సంతోషంగా గడుపుకుంటున్న మాపై తెల్లవారుతూనే నా మీద, మా నాయకుడు వైయస్ జగన్ పైనా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ రోజు మళ్ళీ అదే ఏడపు.
ఈ రోజు కడప నుంచి వస్తూ దారిలో చూస్తే ఆయన కోసం తెలుగుదేశం పార్టీకి చెందని వందిమాగధులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఎప్పుడూ రాని వ్యక్తికి పదిమంది వస్తే గొప్పనాయకుడిని అని అనుకుంటాడు. రోజు మాకు వేల మంది వస్తారు. మేం దానిని గొప్పగా అనుకోము. తనకోసం ఎదురుచూస్తున్న వారిని చూసి ఒళ్ళు మరిచిపోయి చంద్రబాబు కారుకూతలు కూస్తున్నాడు. దీనిని చిత్తూరు జిల్లా ప్రజలు సహించరు. ఎప్పుడో నీకు రాజకీయ భవిష్యత్తును చించేశారు. ఈ సారి ఉండేది కూడా పోతుంది. నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాను అని అనుకుంటే ప్రజలు ఊరుకోరు. ఈ జిల్లాలో తిరిగి నువ్వు మళ్ళీ పోటీ చేసే పరిస్థితి ఉండదు.

చంద్రబాబూ.. నీ పని అయిపోయింది
నిన్ననే చెప్పాను. చంద్రబాబు నీ పని అయిపోయింది. కుప్పంలో కూడా నీ జెండా పీకేసి, వైయస్ఆర్సిపి జెండా పాతుతాం. అక్కడ కూడా మా అభ్యర్ధే గెలుస్తారు. రాజకీయాల కోసం చంద్రబాబు ఇంతగా ఆరాటపడాల్సిన పనిలేదు. ఇప్పటికే చంద్రబాబు గాడితప్పాడు. ప్రజాసేవ నుంచి స్వప్రయోజనాలను కాపాడుకునేందుకు రాజకీయాలను వాడుకున్నాడు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా తాను తన కుటుంబం కోసమే పనిచేశాడు తప్ప ప్రజల కోసం ఎప్పుడూ పనిచేయలేదు. చివరికి తన మామను కూడా అడ్డం పెట్టుకున్నాడు. అటువంటి వ్యక్తి మా గురించి మాట్లడటం ఒక రాక్షసుడు, ప్రజాకంఠకుడు ప్రజల గురించి మాట్లాడినట్లు ఉంది. ఇది ఇది చాలా విడ్డూరంగా ఉంది.

బషీర్ బాగ్ లో రైతులపై కాల్పులు, అంగన్ వాడీ మహిళలను గుర్రాలతో తొక్కించారు
చంద్రబాబు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని మాట్లాడుతున్నాడు. ఇటువంటిది నువ్వు చేశావు. బషీర్ బాగ్ లో కరెంట్ కోసం పోరాడిన రైతులను కాల్చేశావు. తమ కుటుంబ భవిష్యత్తు కోసం ఉద్యమించిన అంగన్ వాడీ మహిళలను గుర్రాలతో తోక్కించావు. అలాంటివి నియంతలు చేస్తారు. అలాంటి నువ్వు ప్రజాస్వామ్యం గురించి, మంచి పాలన గురించి మాట్లాడుతున్నావు అంటే చంద్రబాబుకు తల తిరిగి, వయస్సు మళ్ళీ, అల్జీమర్స్ పెరిగిపోయి మాట్లాడుతున్నావని అర్థమవుతోంది. చంద్రబాబు నోరు తెరిస్తే మమ్మల్ని తిట్టడం తప్ప వేరే పనిలేదని రాష్ట్రప్రజలకు తెలుసు. దాని గురించి పట్టించుకోవాల్సి అవసరం లేదు.

పండుగ కూడా ప్రశాంతంగా జరుపుకోనివ్వడం లేదు
చంద్రబాబు తన విమర్శలతో మమ్మల్ని ప్రశాంతంగా పండుగ జరుపుకోనివ్వకుండా, ఎదురు మాపైనే దాడి చేస్తున్నాడు. మా మీద నిత్యం ఏడుస్తూ, తనను పండుగ జరుపుకోనివ్వలేదని ఎలా అంటాడు? అన్ని మాటలు మాట్లాడేది చంద్రబాబే, తిరిగి పండుగ చేసుకోనివ్వలేదని మాపై ఎందుకు ఏడుస్తున్నాడు?

నువ్వు సీఎంగా ఉన్నప్పుడు ఎంతో మందిపై అక్రమ కేసులు పెట్టించావు
రఘురామకృష్ణంరాజును కొట్టినట్లు కొట్టారు అని చంద్రబాబు వ్యాఖ్యానించాడు. రఘురామకృష్ణంరాజును ఎవరు కొట్టారు… ఎక్కడ కొట్టారు…. చట్ట ప్రకారం అరెస్ట్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఒక పద్దతిగా రాజకీయాలు చేసే వారిని ఎవరూ అరెస్ట్ చేయరు. మితిమీరి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే పోలీసులు చర్యలు తీసుకోకూడదు, అలా చేస్తే రాజకీయంగా చేశామని ఆరోపిస్తున్నాడు. నువ్వు సీఎంగా ఉన్నప్పుడు ఎంత మందిని అకారణంగా అరెస్ట్ చేశావు, ఎంత మందిని ఇబ్బంది పెట్టావు. ఇప్పుడ చిలుక పలుకులు మాట్లడుతున్నాడు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలా, ఉండకూడదా అనేది చంద్రబాబే తేల్చుకోవాలి. నీ అంతుచూస్తా, నీ పని అయిపోయిందని నా గురించి చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ఈ జిల్లా ప్రజలు ఉన్నన్ని రోజులు ప్రజలు మా పక్షాన, మేం ప్రజల పక్షాన ఉంటాం. నువ్వు ప్రజాకంఠకుడువి. గతంలో నువ్వు ఏ విధంగా ప్రజాకంఠన పరిపాలన చేశావో, ఏ విధంగా ప్రజలు నిన్ను ఛీ కొట్టారో అందరికీ తెలుసు.

చిత్తూరు జిల్లాలో వైయస్ఆర్ సిపి గెలుపును అడ్డుకోవడం నీ తరం కాదు
చిత్తూరు జిల్లాలో మెజారిటీ సాధించాలంటే నీ నుంచి కాదు, నీ బాబు నుంచి కూడా కాదు. నిన్ను పుట్టించిన తాతల నుంచి కాదు. ఇక్కడ వైయస్ఆర్ సిపి మాత్రమే అధికారంలోకి వస్తుంది, వైసిపి ఎమ్మెల్యేలే గెలుస్తారు. జగన్ గారు ప్రజలకు ఎంత మంచి చేశారనే దానికి ఇది ఒక కొలబద్ద. నీకు ప్రజాకంఠకుడు అనే పేరు ఎప్పుడో ఉంది. ఇప్పుడు కొత్తగా మేం చెప్పాల్సిన పనిలేదు. నా అంతు నువ్వు చేడాల్సిన పనిలేదు. నీ అంతు చిత్తూరు జిల్లా ప్రజలే చూస్తారు.

తన అసమర్థుడైన కొడుకును తలుచుకుని బాబు బాధపడుతున్నాడు
“జగన్ తెలివైన వ్యక్తి, అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. నా కొడుకు అసమర్థుడు, సుద్ద మొద్దు, లోకేష్ కు అన్ని తెలివితేటలు లేవు, జగన్ లాంటి కొడుకు నాకు పుట్టలేదని” చంద్రబాబు బాధపడుతున్నాడు. జగన్ తో తన కొడుకును పోల్చుకుని మరింత బాధపడుతున్నాడు. ఇలా ప్రతి దానిని ఆలోచించుకుని ఉన్న అల్జీమర్స్ ను మరింత పెంచుకుంటున్నాడు. విశ్రాంతి తీసుకుని ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలని చంద్రబాబును కోరుతున్నాను. రాష్ట్రప్రతితో, ప్రధానితో మాట్లాడుతానని అంటున్నాడు. రామోజీరావు, రాధాకృష్ణలతో మాట్లాడుతూ రాష్ట్రప్రతి, ప్రధానిలతో మాట్లాడానని అనుకుంటున్నాడేమో.

న్యాయస్థానాలపై చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే.. ఆయన మానసిక స్థితిపై అనుమానం కలుగుతోంది
కోర్టు రిమాండ్ విధిస్తే దానిని కూడా తప్పుపడుతున్నాడు. కోర్టులను మేం ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటాం. కానీ చంద్రబాబుకు మాత్రం ఆయనకు అనుకూలంగా పని జరిగితే కోర్టు ల పట్ల తనకు చాలా గౌరవం ఉందని అంటాడు. పనిజరగక పోతే న్యాయమూర్తులు కూడా ఇలా చేస్తారా అంటూ కోర్ట్ లనే తప్పుపడతాడు. ఈ రోజు అలాగే మాట్లాడాడు. న్యాయమూర్తులను, రాజకీయ నాయకులను, వ్యవస్థలను కూడా తిట్టే చంద్రబాబు మానసిక పరిస్థితిపై అనుమానం కలుగుతోంది. ఆయన వైద్యులను సంప్రదించి, చికిత్స తీసుకోవాలి. న్యాయ వ్యవస్థల గురించి అవహేళనగా ఎలా మాట్లాడుతున్నాడు?

కార్యకర్తలను గూండాలుగా ఉసికొల్పాడు
మేం జైలులో పెట్టామని అంటున్నాడు. ఒళ్ళు బలిసి, ఇష్టం వచ్చినట్లు వ్యవహరించేలా మీ కార్యకర్తలను ప్రేరేపిస్తున్నావు. వారు గుండాలుగా వ్యవహరిస్తూ, శాంతిభద్రతలను తమ చేతుల్లోకి తీసుకుంటూ ఉంటే, పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? పోలీసులు తప్పకుండా వారి పని వారు చేస్తారు. చట్ట విరుద్దంగా వ్యవహరించిన వారిని అరెస్ట్ చేస్తారు. నువ్వు గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఎంత మంది అమాయకులపై అక్రమ కేసులు పెట్టించావు, ఎంత మందిని హింసించావు. అలా కాకుండా మేం చట్టప్రకారమే వ్యవహరించాలని పోలీసులను కోరితే, దానిని పైన కూడా చంద్రబాబు మాట్లాడుతున్నాడు.

చంద్రబాబును పర్మినెంట్ గా కుప్పం ప్రజలు ఇంటికి పంపించబోతున్నారు
‘పెద్దిరెడ్డి పని అయిపోయింది. పుంగనూరులో నేను చూస్తాను’ అని చంద్రబాబు అంటున్నాడు. పుంగనూరులో నువ్వు నన్ను చూసేది ఏమిటీ? కుప్పంలోనే నీ పరిస్థితిని నేను చూస్తున్నాను. త్వరలోనే కుప్పంలో నీ జెండాను పీకేస్తావు. వైయస్ జగన్ గారి ఆధ్వర్యంలో అక్కడ వైయస్ఆర్ సిపి గెలుస్తుందనే విషయం నీకు తెలుసు. నీ జెండాను మోసే శక్తే నీకు లేదు. పవన్ కళ్యాణ్ ను పట్టుకుని మా జెండా మోయమని ఆయన చేతికిఇచ్చావు. మీలాగ కాదు జగన్ స్వయంగా పార్టీని నడిపిస్తూ, కుప్పంలో ఎన్నికలు సజావుగా జరిగేలా చూస్తూనే, ప్రజల ద్వారా నీ అంతం పలికేందుకు సిద్దంగా ఉన్నారు. దాని ప్రకారం కుప్పం ప్రజలు కూడా వైయస్ఆర్ సిపికి మద్దతు ఇవ్వడమే కాకుండా నిన్ను పర్మినెంట్ గా రాజకీయాల నుంచి ఇంటికి పంపించబోతున్నారు. దానికి చంద్రబాబు సిద్దంగా ఉండాలి.

మైనార్టీలపై చంద్రబాబుకు ఇప్పుడు ప్రేమ పుట్టుకువచ్చిందా?
చంద్రబాబుకు ఉన్నట్టుండి మైనార్టీలు గుర్తుకు వచ్చారు. పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో మైనార్టీలకు అన్యాయం జరిగిపోయిందని గగ్గోలు పెడుతున్నాడు. ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఒక మైనార్టీలను మండల అధ్యక్షులను చేశాము. మైనార్టీ వ్యక్తిని జెడ్పీటిసిగా, సింగిల్ విండో అధ్యక్షుడిని చేశాము . జనరల్ సీట్లలో కూడా మైనార్టీలకే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాం. ఇందులో భాగంగానే పుంగనూరు మున్సిపాలిటీని మైనార్టీలకు ఇచ్చాం. జగన్ గారు మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. చంద్రబాబు మైనార్టీలకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వలేదు, తన ప్రభుత్వంలో ఒక మంత్రి పదవి ఇవ్వలేదు. ఎమ్మెల్యేలను గెలిపించుకోలేదు. కానీ వైయస్ఆర్ సిపిలో మైనార్టీలకు పెద్దపీట వేయడమే కాకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులుగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో మైనార్టీలకు పెద్ద పీట వేయడం జగన్ వల్లే జరిగింది. నువ్వు ఎప్పుడూ మైనార్టీలకు, ఎస్టీలకు అన్యాయం చేశావు. ఆరు నెలలకు ఒక సారి ఎస్సీలకు ఇచ్చిన మంత్రిపదవులను పీకేశావు. మా పార్టీలో అయిదుగురికి డిప్యూటీ సీఎంలను ఇచ్చారు. అందులో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలు ఉన్నారు. ప్రతి కులాన్ని కూడా జగన్ గౌరవిస్తున్నారు. దానిని కూడా నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు.

కుప్పం అభివృద్దిని కుట్రపూరితంగానే అడ్డుకున్నాడు
ఈ జిల్లాకు వచ్చినప్పుడే చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నావు. రోజూ ఇక్కడే ఉండి ఇలాగే మాట్లాడితే ఈ జిల్లా ప్రజలు చంద్రబాబు మాటల్లోని సత్యాలు, అబద్దాలను గురించి తెలుసుకుంటారు. చంద్రబాబు ఎంత అబద్దాల కోరు, ఎన్ని అసత్యాలు మాట్లాడతాడో అందరికీ మరింత బాగా తెలుస్తుంది. నువ్వు జిల్లాను వదిలివేశావు. మారుమూల ప్రాంతమైన కుప్పంకు ఎవరూ రాకూడదని, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా, అక్కడి ప్రజలు అభివృద్ధి చెందితే వారు అన్ని విషయాలను గ్రహిస్తారు, వారిలో తెలివితేటలు పెరుగుతాయనే దురుద్దేశంతోనే కుట్రపూరితంగానే కుప్పంను నిర్లక్ష్యం చేశాడు.
తన గురించి తెలిస్తే ఓడిస్తారనే భయంతోనే ఈ ప్రాంతాన్ని వెనుకబాటుతనంతో ఉంచి అక్కడ గెలుస్తూ వచ్చావు. జగన్ గారు వచ్చిన తరువాత అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి. నువ్వు కోరిన మీదటే కుప్పంను రెవెన్యూ డివిజన్ గా సీఎం జగన్ గారు పెద్ద మనస్సుతో ప్రకటించారు. పద్నాలుగు ఏళ్ళు సీఎంగా ఉండి కూడా నువ్వు చేయలేని హంద్రీనీవా కాలువ పనులను జగన్ గారు వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుసుకున్నారు.

కుప్పంలో నీకు డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు
కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతన్నాయి కాబట్టే నీ కుటిలత్వం, కుట్ర రాజకీయాలు కుప్పం ప్రజలు గుర్తిస్తున్నారు. అందుకే కుప్పం లోని ప్రజలు నిన్ను నమ్మడం లేదు. నువ్వు చేసే రాజకీయాలన ప్రజలు నమ్మరు. గతంలో కుప్పం ప్రజలను ఎలా మోసం చేశావో తెలుసుకుంటున్నారు. కుప్పంలో నీకు డిపాజిట్ వచ్చే పరిస్థితే ఉండదు.

చిత్తూరులో పార్టీని బలోపేతం చేస్తున్నందుకే మమ్మల్ని చంద్రబాబు టార్గెట్ చేస్తున్నాడు
చంద్రబాబు సర్వసాధారణంగా తన ఆలోచనకు దగ్గరగా ఉండే వారిని టార్గెట్ చేస్తారు. అందులో సీఎం మా జిల్లాలోని నాయకులకు ఎక్కువ గౌరవం ఇస్తున్నారని, స్వేచ్చ ఇచ్చారని పార్టీ అభివృద్ధి కోసం పాటుపడుతున్నామని చంద్రబాబు సహించలేకపోతున్నాడు. అందుకే మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. కుప్పంలో ఆయన పరిస్థితి దారుణంగా ఉంది. అది తెలిసి కూడా అక్కడ గెలస్తాం, ఇక్కడ గెలుస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాడు. కుప్పంలో నా పరిస్తితి ఏమిటనే వెనక్కి చూసుకోవడ లేదు. ఆయన మానసికంగా చాలా క్రుంగిపోయాడు.

కుప్పంలో బాబు గెలిస్తే అంతామంచివారు.. ఓడితే ప్రజలు దొంగలా?
కుప్పంలో ఆయన గెలిస్తే ఈ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చినట్లు, ఆయన గెలవకపోతే ఈ రాష్ట్రంలో ప్రజలు దొంగలు, దుర్మార్గులు, అమ్ముడు పోయారని మాట్లాడతాడు. కుప్పంలో ఆయన ఓటమి వాస్తవం, ఇలా మాట్లాడబోతున్నాడనేది కూడా వాస్తవమే. చంద్రబాబు నీ జోలికి మేం రావడం లేదు. ఈ జిల్లాకు వచ్చినప్పటి నుంచి పండుగపూట కుటుంబసభ్యులతో సంతోషంగా జరుపుకోకుండా ప్రతిరోజూ మామీద మాట్లాడుతున్నావు. ఎందుకు ఇంత కక్షతో మాట్లాడుతున్నావని అడుగుతున్నాను. ఇవ్వన్ని మరిచిపోయి కుటుంబసభ్యులతో కాలం గడుపు. విజయవాడ, హైదరాబాద్ కు వెళ్ళిన తరువాత మా గురించి మాట్లాడు. ఈ జిల్లాలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నీకు, నీ ఆరోగ్యానికి మంచిది కాదు.

నా మీద పోటీ చేయమని చంద్రబాబును ఆహ్వానిస్తున్నాను
పుంగనూరులో నాపైన చంద్రబదాబు పోటీ చేయాలి. ఆయనను ఆహ్వానిస్తాను. ఆయన పిలిస్తే, మా సీఎం ఆదేశిస్తే ఆయన మీద కుప్పంలో పోటీ చేస్తా. మా పోరాటం అంతా చంద్రబాబు మీదనే. ఆయన కూడా అలా పోరాడవచ్చు. చంద్రబాబు మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తున్న రాజకీయ నాయకుడు, ఆయనకు ధైర్యం లేదు. అటువంటి సాహసం చేయడు. జగన్ గారు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తాం.
టీడీపీ గుండాలే జైల్లో ఉన్నారు.. మా కార్యకర్తలను అకారణంగా ఆయన హయాంలో జైలులో పెట్టించాడు. ఇప్పుడు జైలులో ఉన్న వారు టిడిపి పార్టీలోని గుండాలు. వారిని చంద్రబాబు రెచ్చగొట్టి అసాంఘిక చర్యలకు ప్రోత్సహించాడు. ఆనాడు అకారణంగా మిధున్ రెడ్డిని జైలులో పెట్టించలేదా? తనకు అనుకూలంగా ఉండే మాటలే మాట్లాడతాడు. చేసిన తప్పుడు ఒప్పుకోడు. ప్రజాస్వామిక విలువలు లేవు. ఉన్నట్లు నటిస్తాడు. ఇలాంటి ప్రత్యేకతలు చంద్రబాబు సొంతం.

చంద్రబాబు కార్యక్రమాలు పేలవం
చంద్రబాబు మూడు రోజుల కార్యక్రమంలో ఒకటో రోజు ఫరవాలేదు. కర్ణాటక నుంచి జనాలను తెప్పించుకున్నాడు. రెండో రోజు జిల్లాలోని కార్యకర్తలే రాలేదు దీనితో పేలవంగా జరిగింది. మూడో రోజు అసలు జనాలే లేరు. కుప్పంలో ఆయన పరిస్థితి ఏమిటనేది ఆయనకే తెలుసు. రేపు ఎన్నికల్లో ఎంత దారుణంగా ఓడిపోతాడో చంద్రబాబుకు తెలుసు.

జీఓ నెం.1 లో ప్రజల భద్రతకే ప్రాధాన్యం ఇచ్చారు
జీఓ నెంబర్ ఒకటి తీసుకురాకముందే, ఇరుకు రోడ్లలో పార్టీ కార్యక్రమాలను చేయడం వల్ల ప్రాణాలు పోతున్నాయి, ప్రభుత్వం ఇక మీదట అయినా దీనిపై చర్యలు తీసుకోవాలి, ఇలాంటి వాటికి అనుమతులు ఇవ్వకూడదని చెప్పాo. తరువాత జీఓ నెంబర్ వన్ వచ్చింది. దానిలో ఏం ఉంది. ప్రజల ప్రాణాలకు ప్రమాదం లేకుండా కార్యక్రమాలు చేసుకోవాలని ఉంది. ఈ జీఓ ముందే వచ్చి ఉంటే ఈ పదకొండు మంది చనిపోయి ఉండేవారు కాదు.

LEAVE A RESPONSE