విదేశీ వేదికలపై ప్రధాని మోడీపై విమర్శలు చేయడం కేటీఆర్ దిగజారుడుటనానికి నిదర్శనం

Spread the love

– స్విట్జర్లాండ్ ఎన్నారై మీటింగ్ లో కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప
– హంగర్ ఇండెక్స్ లో పాకిస్తాన్ దేశం భారత్ కంటే చాలా మెరుగైన స్థానం లో ఉందన్న కేసీఆర్ ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటాడని ప్రశ్నించిన సంగప్ప

స్విట్జర్లాండ్ జ్యూరిక్ నగరంలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ పై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. విదేశీ వేదికలపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కేటీఆర్ చేసిన వ్యాక్యలు ఆయన దిగజారుడు తనానికి అద్దం పడుతాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప హైదరాబాద్ లో అన్నారు.

వేరే దేశాలకు వెళ్లినప్పుడు దేశం ఔనత్యాన్ని, దేశ ప్రధాని చేస్తున్న గొప్ప కార్యక్రమాలను చెప్పాల్సింది పోయి అవాకులు, చవాకులు మాట్లాడి దేశం పరువు తీస్తారా అని ఆయన మండి పడ్డారు. భారత ప్రధాని నరేంద్రమోడిగారి గురించి ప్రపంచం నలుమూలలా ఉన్నా ప్రవాసభారతీయులకు బాగా తెలుసు అని ఆయన అన్నారు. భారత్ ను ప్రపంచంలోనే విశ్వగురుగా నిలబెట్టేందుకు ప్రదాని మోడీగారు చేస్తున్న కృషికి ప్రతి ప్రవాస భారతీయుడు గర్వ పడుతున్నాడని సంగప్ప అన్నారు. మళ్లోసారి మోడి గురించి విదేశీ వేదికలపై విమర్శలు చేస్తే జనమే తగిన బుద్ధి చెబుతారని సంగప్ప హెచ్చరించారు.

దావోస్ పర్యటన కేటీఆర్ కు విహార యాత్రలా మారిందని సంగప్ప విమర్శించారు. గత ఏడాది మేలో దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకానామిక్ ఫోరం సదస్సు నుంచి రాష్ట్రానికి కేవలం రూ.4,200 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దానికే కేటీఆర్ చేసిన హంగామా అంతా ఇంతా కాదని ఆయన అన్నారు. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రానికి ఆనాడు రూ.64 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దాని ముందు తెలంగాణకు వచ్చిందెంత అని ఆయన ప్రశ్నించారు.

తాము కూడా రాష్ట్రాని పెట్టుబడులు రావాలనే కోరుకుంటున్నామని సంగప్ప అన్నారు. ప్రధాని మోడిగారి తీసుకువచ్చిన పాలసీల వల్ల, దేశంలో నెలకొన్న సుస్థిర ఆర్థిక, రాజకీయ పరిస్థితుల వల్ల మాత్రమే మనకు విదేశీ పెట్టుబడులు వస్తున్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సంగప్ప హితవు చెప్పారు.

ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతుంటే భారత్ పరిస్థితి సుస్థిరంగా ఉండటమే కాకుండా రోజు రోజుకు పైపైకి వెళ్తుందని, ఇప్పుడు ప్రపంచంలోనే 5 స్థానంలో ఉందని సంగప్ప చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రం చైనా, పాకిస్తాన్ దేశాలే బాగున్నట్లు కనిపిస్తోందని సంగప్ప ఎద్దేవ చేశారు.

ప్రపంచ హంగర్ ఇండెక్స్ లో పాకిస్తాన్ 92 స్థానంలో ఉంటే ఇండియా 101 స్థానంలో ఉందని, పాకిస్థానే మెరుగైన స్థానంలో ఉందని కేసీఆర్ పలుమార్లు చెప్పిన విషయాన్ని సంగప్ప గుర్తు చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ లో తినేందుకు తిండిలేక, వండుకునేందుకు పిండి, గ్యాస్ లేక ఎంత ఇబ్బందులు పడుతున్నారో వార్తల్లో కేసీఆర్ చూడటం లేదా అని ఆయన ప్రశ్నించారు. చైనా కూడా అల్లకల్లోలంగా ఉందని చెప్పారు. తండ్రి కొడుకులకు భారత్ గొప్పతనం తెలియడం లేదని సంగప్ప అన్నారు. రాష్ట్రంలో దోచుకున్నది చాలదన్నట్లు ఇక దేశాన్ని దోచుకునేందుకు బీఆర్ఎస్ పేరిట పోతున్నారని సంగప్ప ఆరోపించారు. దోచుకోవడానికే ప్రాజెక్టులను కట్టే మీరు ప్రధాని మోడీని విమర్శిస్తారా అంటూ సంగప్ప మండిపడ్డారు.

పట్టణాల మాస్టర్ ప్లాన్ కోసం రైతుల పంట భూమూల్ని సేకరించడానికి బిజేపీ వ్యతిరేకం అని సంగప్ప ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. మాస్టర్ ప్లాన్ వ్యతిరేకిస్తూ జగిత్యాల జిల్లాల తిమ్మాపూర్ గ్రామ ఉప సర్పంచి, వార్డు మెంబర్ల రాజీమాపై స్పందిస్తూ రైతులు చేసే పోరాటానికి బీజేపీ పూర్తి మద్దతిస్తుందని చెప్పారు. కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో రైతు పయ్యావుల రాములు ఆత్మహత్య విషయంలో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇదే విషయాన్ని చెప్పారని గుర్తు చేశారు. మాస్టర్ ప్లాన్ అవసరమే కాని, రాళ్లు రప్పలతో ఉన్న భూమి, ప్రభుత్వ భూమిని ముందుగా సేకరించాల్సింది పోయి రైతుల పొట్టకొట్టి చేసే అభివృద్ధి ఎవరి కోసం అని సంగప్ప ప్రశ్సించారు. ప్రెస్ మీట్ లో సంగప్పతో పాటు మాజీ ఎంపీ రవింద్రనాయక్, అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఉన్నారు.

Leave a Reply