Suryaa.co.in

Andhra Pradesh

ఉచిత ఇసుక పాలసీ తీసుకురావడం అభినందనీయం

-నెరవేరనున్న పేదల సొంతింటి కల
– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

2019లో అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసి, కొత్త ఇసుక విధానాన్ని తెచ్చే వరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందనీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పష్టం చేశారు.  అప్పటి వరకు వినియోగదారుడికి ఉచితంగా ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఈ మేరకు జీవో నంబర్ 43ను జారీ చేసిందని తెలిపారు.

సోమవారం సాయంత్రం కంచికచర్ల మండలం కీసర డంప్ యార్డ్ వద్ద ఉచిత ఇసుకను ప్రారంభించారు. ఈ మేరకు మాట్లాడుతూ వినియోగదారుడు ఎత్తుడు, దించుడు కూలీతో ఇతర చట్టబద్ధమైన పన్నులు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొందన్నారు.  ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం వల్ల సామాన్యుల భారీ ఊరట లభించిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు అధికారంలోకి వచ్చి నెల రోజుల లోపే అమల్లోకి తెచ్చారన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తుందన్నారు. నాణ్యమైన ఇసుక ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నదే తెలుగుదేశం విధానమన్నారు. పారదర్శకత, ముందుచూపుతో శాండ్ పాలసీని రూపొందించడం జరిగిందన్నారు.

ఇసుక మాఫియాతో జగన్ రెడ్డి కోట్లు కొల్లగొట్టినాడన్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుక మాఫియాను నడిపిందని,  ఒక్క ఇసుక కుంభకోణం ద్వారానే రూ.50 వేల కోట్లకు పైగా కొల్లగొట్టారని,  వైసీపీ నేతలే స్వయంగా ఇసుకాసురుల అవతారం ఎత్తి దోచుకున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు మింగేసిన ఇసుకతో దాదాపు పది లక్షలకు పైగా ఇళ్లు కట్టొచ్చంటే వారి అవినీతి ఏ స్థాయిలో అవినీతి చేశారో అర్థం చేసుకోవచ్చు అన్నారు.

ఇసుక పాలసీ అమల్లో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని అక్రమ ఇసుక తవ్వకాలను నిరోధిస్తూ రాష్ట్ర ప్రజల ప్రగతే ధ్యేయంగా ఈ పాలసీ రూపొందించారు. దీనిపై నిరంతరం విజిలెన్స్ పర్యవేక్షణ ఉంటుందన్నారు. జిల్లాల స్థాయిలో శాండ్ కమిటీలు ఏర్పాటు చేసి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలు, మైనింగ్ అధికారులు పర్యవేక్షిస్తారన్నారు. నియోజకవర్గంలో కీసర మొగులూరు, కంచల, కొడవటికల్లు, మాగల్లు డంప్ యార్డులలో ఇసుకను వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు అని తెలిపారు.

LEAVE A RESPONSE