– లిక్కర్ స్కాం, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగితే రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు?
– బీజేపీ మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎన్.రామచంద్రరావు
-వ్యక్తులే ముఖ్యమనే వాళ్లకు బీజేపీలో స్థానం ఉండబోదు
-మీడియాకు ఎక్కి అక్కసు వెళ్లగక్కి పార్టీని భ్రష్టు పట్టిస్తే సహించే ప్రసక్తే లేదు
-బీజేపీలో పాత, కొత్త అనే తేడా ఉండదు
-హద్దు మీరితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోదు
-కాసం వెంకటేశ్వర్లు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో అనేక అభివ్రుద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు.అందులో భాగంగా ఈనెల 8న వరంగల్ లో అనేక అభివ్రుద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీజేపీ గ్రాఫ్ ను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నాయి.బీజేపీ ఎదగకుండా కుట్ర చేస్తున్న పీసీసీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ లకు గురువు పొరుగు రాష్ట్రం నాయకుడే. ఇద్దరి డీఎన్ఏ టెస్ట్ చేస్తే అది బయటపడుతుంది.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకుండా చేసే యత్నంలో భాగమే కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయి. తెలంగాణలో 30 వేల పోలింగ్ బూత్ లలో కార్నర్ మీటింగ్ లు పెట్టడంతోపాటు మహా జన్ సంపర్క్ అభియాన్ పేరుతో 70 లక్షల కుటుంబాలను కలిసి మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివ్రుద్ది, సంక్షేమ పథకాలను వివరించాం.
బీజేపీకి ప్రజల్లో ఉన్న ఆదరణను తగ్గించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి కుట్ర చేస్తూ మీడియాలో కథనాలు రాయిస్తున్నాయి. లిక్కర్ స్కాం, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగితే రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు?
ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే.నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు సహా అనేక ప్రజా సమస్యలపై బండి సంజయ్ పోరాడుతున్నారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంటే తట్టుకోలేక దుష్ప్రచారం చేస్తున్నారు.రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే.
కర్నాటక ఎన్నికలతో కాంగ్రెస్ కు ఆక్సిజన్ వచ్చినట్లు భావిస్తున్నారు…. కానీ కర్నాటక ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక, అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. తెలంగాణలో ఎవరెన్ని కుట్రలు చేసినా డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయం. ప్రజలు, కార్యకర్తలెవరూ మీడియాలో వస్తున్న కథనాలు, రెండు పార్టీల దుష్ప్రచారాన్ని పట్టించుకోకుండా తిప్పికొట్టాలని కోరుతున్నా.
కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… విద్యార్ధి దశ నుండి బీజేపీ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తున్న కార్యకర్తగా మాట్లాడుతున్నా. వేలాది మంది కార్యకర్తల త్యాగాల పునాదులపై ఏర్పడ్డ పార్టీ. నమ్మిన సిద్ధాంతం కోసం అమరులయ్యారు. అధికారం కోసమే కాకుండా సిద్ధాంతాలే ప్రాతిపదికగా లక్షలాది మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు.
ఇవాళ చిట్ చాట్ , ఆఫ్ ది రికార్డ్ పేరుతో వస్తున్న వార్తలు బీజేపీ కార్యకర్తలను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి. నిశ్చేస్టులవుతున్నారు.ఏ నాయకుడైనా సరే… క్రమశిక్షణకు లోబడి ఉండాల్సిందే. నాలుగు గోడల మధ్య, పెద్దలతో చర్చించాల్సిన అంశాలపై మీడియాకు ఎక్కడం వెనుక ఆంతర్యమేంది? పదవుల కోసం ఎవరినైనా కలవచ్చు.. కానీ పార్టీని దెబ్బతీసే కుట్ర చేస్తే సహించేది లేదు.
వ్యక్తులే ముఖ్యమనే వాళ్లకు బీజేపీలో స్థానం ఉండబోదు. పార్టీ లైన్ కు భిన్నంగా మాట్లాడిన జశ్వంత్ సింగ్, ఉమాభారతి, కళ్యాణ్ సింగ్ వంటి అగ్ర నేతలను పక్కన పెట్టిన చరిత్ర బీజేపీకి ఉంది. గాంధేయ సోషలిజంపై పార్టీ వేదికల్లో అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా నిర్ణయం తీసుకున్నాక దీనిపై ఎవరూ విబేధించని విషయాన్ని గుర్తుంచుకోవాలి.
దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో రఘునందన్, ఈటల రాజేందర్ అనుచరులను బీఆర్ఎస్ కొనేసిన సమయంలో బీజేపీ కార్యకర్తలు సైనికులుగా పనిచేసి గెలిపించిన విషయాన్న మర్చిపోవద్దు. రాష్ట్ర నాయకత్వంపై ఏమైనా అభ్యంతరాలుంటే… జాతీయ నాయకత్వంతో చర్చించాలే తప్ప మీడియాకు ఎక్కి అక్కసు వెళ్లగక్కి పార్టీని భ్రష్టు పట్టిస్తే సహించే ప్రసక్తే లేదు. ఈ క్లిష్ట సమయంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా సంయమనం పాటించాలి. దయచేసి శల్య సారథ్యం చేయొద్దని కోరుతున్నా.
గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ… బీజేపీలో ఏదో జరుగుతోందని మీడియాలో పతాక శీర్షికలతో వార్తలను ప్రచురించడం బాధాకరం. తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. అధికారంలోకి రాబోతున్న తరుణంలో బీజేపీని దెబ్బతీసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ అనుకూల శక్తులు కుట్రలకు తెరలేపాయి.ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ చాపకింద నీరులా ప్రజల్లోకి వెళుతూ కార్యక్రమాలు చేపడుతూ వారి హృదయాలను జయిస్తోంది.నాగర్ కర్నూలుసహా ఇటీవల బీజేపీ నిర్వహించిన సభలకు ప్రజల నుండి వస్తున్న ఆదరణే ఇందుకు నిదర్శనం.
కాంగ్రెస్ కు ఓటేస్తే గెలిచిన వాళ్లంతా ఏమైపోయారు? బీఆర్ఎస్ లోకి వెళ్లడం లేదా? రెండు ఫ్యామిలీ పార్టీలే. మీరు సహజ మిత్రులు. కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే. కమ్యూనిస్టులు మీకు మిత్రులే. వీళ్లందరూ కలిసి బీజేపీని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారు.
ఎవరెన్ని చేసినా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నారు.తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందని అడుగుతున్న వాళ్ల గొంతులో పచ్చి వెలక్కాయ పడుతుంటే… ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు బీజేపీలో ఏదో జరుగుతోందంటూ దుష్ప్రచారం చేస్తూ కుట్ర చేస్తున్నారు.
వరంగల్ లో పీవోహెచ్ కోచ్ ఫ్యాక్టరీసహా అనేక అభివ్రుద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు ఎందుకు వణుకుపుడుతోంది? కోచ్ ఫ్యాక్టరీ కోసం స్థలం కేటాయించాలని ఏళ్ల తరబడి కేంద్రం, బీజేపీ లేఖలు రాసినా ఎందుకు సహకరించడం లేదు? కోచ్ ఫ్యాక్టరీకి 2 వేల ఎకరాలు అడిగితే ఇవ్వబోమని ప్రభుత్వం చెప్పిన మాట వాస్తవం కాదా?
గూడ్స్ ట్రాన్స్ పోర్టేషన్ వల్ల ఎంతో ఉపయోగం ఉంది. దీనిని అభివ్రుద్ధి చేసేందుకు లేటెస్ట్ టెక్నాలజీతో వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ఎంతోమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.
గిరిజన యూనివర్శిటీకి స్థలం ఇవ్వాలని పదేపదే మొత్తుకున్న, బడ్జెట్ లో నిధులు కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సానుకూలంగా స్పందించడం లేదు? ఇవన్నీ చెబితే బీఆర్ఎస్, కాంగ్రెస్ లను ప్రజలు అసహ్యించుకుంటారని తెలిసి ఆ రెండు పార్టీలు బీజేపీని దెబ్బతీసేందుకు మైండ్ గేమ్ ఆడుతున్నాయి.
కాంగ్రెస్ యాడ గెలిచింది? డిపాజిట్లే గల్లంతైనైన పార్టీ. అయినా కాంగ్రెస్ ఇమేజ్ పెరిగిందని విష ప్రచారం చేస్తూ బీజేపీని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారు.బీజేపీ క్రమశిక్షణకు నిదర్శనం పార్టీలో అంతర్గత అంశాలను మీడియాతో మాట్లాడే సంస్క్రుతి లేదు. ఎవరైనా కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తే పార్టీ నాయకత్వం తగిన విధంగా స్పందిస్తుంది.
తెలంగాణకు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో కార్యవర్గం ఉంది. వారి నాయకత్వంలోనే పనిచేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. అధ్యక్ష మార్పుపై జాతీయ అధ్యక్షుడి నిర్ణయమే శిరోధార్యం.
గతంలో కాంగ్రెస్ పార్టీ హన్మకొండలో ఎక్కడ సభ పెట్టిందో.. అంతకంటే ఎక్కువ జనాన్ని సమీకరించి అక్కడే సభ నిర్వహించి బీజేపీ సత్తాను చాటబోతున్నాం. యావత్ ప్రజలంతా మోదీ రాక కోసం ఎదురు చూస్తుంటే ప్రజల ద్రుష్టి మళ్లించేందుకు కుట్ర చేస్తున్నారు.
బీజేపీలో పాత, కొత్త అనే తేడా ఉండదు. హద్దు మీరితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోదు. పార్టీ సిద్ధాంతాలను తప్పు పడుతూ లైన్ దాటితే అగ్ర నేతలపైనా చర్యలు తీసుకున్న చరిత్ర బీజేపీకి ఉంది.దీనిని దృష్టిలో ఉంచుకుని బీజేపీ నేతలు పార్టీ అంతర్గత విషయాలపై మీడియాకెక్కితే సహించే ప్రసక్తే లేదు.