Suryaa.co.in

Telangana

తార్నాకలో కోలాహలంగా బీ ఆర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనం

– సుపరిపాలన ప్రభుత్వ ధ్యేయం : డిప్యూటీ స్పీకర్ పద్మ రావు గౌడ్
– భాజపా కుట్రలను ప్రజల్లో తెలియజెప్పాలి : ఇంచార్జ్ దాసోజు శ్రవణ్

సికింద్రాబాద్ : బీ ఆర్ ఎస్ ప్రభుత్వం మాత్రమే సుపరిపాలన అందిస్తోందని, ముఖ్యమంత్రి కెసిఆర్ విధానాల పట్ల అందరిలో అభిమానం ఉందని డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. తార్నాక డివిజన్ బీ ఆర్ ఎస్ పార్టీ ప్రతినిధుల విస్తృత స్థాయి ఆత్మీయ సమ్మేళనం సోమవారం లాలాపేట లోని నఫీస్ గార్డెన్ లో కోలాహలంగా జరిగింది.

ఈ సమ్మేళనానికి ముఖ్య అతిధిగా హాజరైన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా నిరంతరం కృషి సాగుతోందని తెలిపారు. కార్యకర్తల కృషి కారణంగా నే తాము పదవుల్లో ఉన్నామనే సత్యాన్ని నిత్యం గుర్తుంచుకున టామని పద్మారావు గౌడ్ వివరించారు. ప్రజా సంక్షేమానికి కృషి చేస్తామని, కార్యక్రర్తల బాగోగులకు ప్రాముఖ్యత నిస్తామని అయన తెలిపారు.

తెలంగాణా రాష్ట్రం ఏర్పాటును అవహేళన చేసిన వారికీ సైతం విస్మయం కలిగేలా సంక్షేమ కార్యక్రమాలు అమలులో ఉన్నాయని డిప్యూటీ స్పీకర్ అన్నారు. అన్ని వర్గాల స్వలంభానకు గౌరవజరుపుతోందని తెలిపారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ, 50 సంవత్సరాల్లో చేపట్టని పనులను చేపదుతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సందేశాన్ని అయన చదివి వినిపించారు.

భాజాపా కుట్ర రాజకీయాలు: దాసోజు శ్రవణ్
కార్యక్రమానికి విశిష్ట అతిధిగా హాజరైన బీ ఆర్ ఎస్ హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ డాక్టర్ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ భాజపా నాయకత్వం ప్రజలను విభజించి తమ పబ్బాన్ని గడుపుకోనేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణా అభివృద్దిని అడ్డుకునేందుకు భాజాపా ప్రయత్నిస్తోందని , ఆ పార్టీ నేతలు కుట్రలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు పేపర్ల లీకేజీ లకు సైతం పాల్పడుతున్నారని అయన ఆరోపించారు. కెసిఆర్ వెన్నంటే నిలిచిన సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ పద్మారావు గౌడ్ ను గెలిపించుకోవడంతో పాటు మూడోసారి బీ ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలి ఆయన పేర్కొన్నారు.
పార్లమెంట్ ఇంచార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్ మాట్లాడుతూ బీ ఆర్ ఎస్ శ్రేణులు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని, సామాజిక్ మాధ్యమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ నిరంతరం అందుబాటులో నిలుస్తున్నారని అన్నారు.

బీ ఆర్ ఎస్ కార్మిక విభాగం అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణా ఉద్యమం నుంచి కెసిఆర్ వెన్నంటే నిలిచామని అన్నారు. మున్ముందు రోజుల్లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ నాయకత్వంలో సికింద్రాబాద్ లో అయన విజయానికి పాటుపడతామని అన్నారు. బీ ఆర్ ఎస్ యువ నేత రామేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు తెలియచేప్పేలా కార్యకర్తలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

కార్పొరేటర్లు సామల హేమ, రాసురి సునిత, కంది శైలజ, బీ ఆర్ ఎస్ నేతలు లింగాని శ్రీనివాస్, కంది నారాయణ, సమన్వయకర్తలు జలంధర్ రెడ్డి, రాజ సుందర్ తదితరులు పాల్గొన్నారు. తార్నాక డివిజన్ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా వివిధ అంశాల పై ప్రసంగించారు. ఈ సందర్భంగా కళాకారుల బృందాలు బృందం తమ ఆట పాటలతో సభికులను ఆకట్టుకున్నాయి.

LEAVE A RESPONSE