హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పదవి విరమణ సందర్భంగా ఆయనకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం తెలంగాణ భవన్ లో ఘనంగా జరిగింది .శ్రీనివాస్ రెడ్డి జలదృశ్యం నుంచి బంజారాహిల్స్ తెలంగాణ భవన్ దాకా దాదాపు 24 యేండ్లు బీ ఆర్ ఎస్ పార్టీకి చేసిన సేవలను వక్తలందరూ కొనియాడారు.
.ఆయన సేవలను పార్టీ ఎల్లపుడూ గుర్తుంచుకుంటుందన్నారు. తనకు తగిన గుర్తింపు నిచ్చిన కేసీఆర్ కు బీ ఆర్ ఎస్ పార్టీ కి రుణపడి ఉంటానని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు .శ్రీనివాస్ రెడ్డి తన ఇన్నేళ్ల అనుభవాలను పుస్తక రూపం లో వ్యక్తీకరించాలని మాజీ మంత్రి ,ఎమ్మెల్యే టి .హరీష్ రావు కోరారు .కేసీఆర్ కు అత్యంత ఇష్టమైన వ్యక్తుల్లో శ్రీనివాస్ రెడ్డి ఒకరని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూధనా చారి అన్నారు. శ్రీనివాస్ రెడ్డి అమెరికా వెళ్లినా ఎపుడు ఏ అవసరమున్నా తమని సంప్రదించాలని ,తాము కూడా యూ ఎస్ అపుడపుడు వచ్చి యోగ క్షేమాలు కనుకుంటామని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే టి .పద్మారావు ,మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి ,జగదీశ్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమం లో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ,మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ,ఎర్ర బెల్లి దయాకర్ రావు ,గొంగిడి సునీత ,దేవీ ప్రసాద్ ,దా సోజు శ్రవణ్ ,ఎర్రోళ్ల శ్రీనివాస్ ,చిరుమళ్ల రాకేష్ కుమార్ తదితరులు కూడా మాట్లాడారు .పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ,వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చిన పార్టీ నేతలు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.శ్రీనివాస్ రెడ్డి కుటుంబసభ్యులను బీ ఆర్ ఎస్ పార్టీ పక్షాన ఘనంగా సన్మానించారు. మాజీ మంత్రి ,ఎమ్మెల్యే టి .హరీష్ రావు శ్రీనివాస్ రెడ్డి కుటుంబసభ్యులను వారి వాహనం లో కూర్చోబెట్టి తెలంగాణ భవన్ నుంచి సాదరంగా వీడ్కోలు పలికారు .