Suryaa.co.in

Telangana

దళిత బంధును ఆపిన దద్దమ్మ రేవంత్ రెడ్డి

– కాంగ్రెస్ నేతలు హుజురాబాద్ లో ఎలా తిరుగుతారో చూస్తాం
– హుజురాబాద్ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రం లో కేసీఆర్ దళిత బంధు పథకం తెచ్చారు. హుజురాబాద్ నియోజక వర్గం లో పైలట్ పద్దతిన ఈ ప్రాజెక్టు ప్రారంభించారు. కేసీఆర్ హాయం లో మొత్తం 18 500 మంది దళితులకు పది లక్షల రూపాయల చొప్పున వారి అకౌంట్లలో వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది దళితులు దళితబంధు కింద ఎంపికయ్యారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దళిత బంధు అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. నేను అసెంబ్లీ లో ఈ అంశాన్ని గతం లోనే లేవనెత్తాను. ఏడాది పాలన పూర్తవుతున్నా దళిత బంధు లబ్దిదారులకు డబ్బు చేరలేదు. దళిత బంధు గొప్ప పథకం. దళిత బంధు పథకం తో వర్కర్లు గా పని చేసిన వారు యాజమానులు అయ్యారు.

నేనే దళిత బంధు ను ఆపానని కొందరు నాపై దుష్రచారం చేస్తున్నారు. దళిత బంధు ను ఆపిన దద్దమ్మ రేవంత్ రెడ్డి. ఇందుకు ఎస్సీ కార్పొరేషన్ విడుదల చేసిన జీవో నే సాక్ష్యం. రేవంత్ దళిత ద్రోహి గా మిగిలి పోతున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో లో దళిత బంధు సాయాన్ని పన్నెండు లక్షలకు పెంచుతామన్నారు. పన్నెండు లక్షలు ఇవ్వకపోగా పది లక్షలనే ఆపుతున్నారు.

దళిత బంధు డబ్బులు విడుదల చేయాలని లబ్ది దారులు ఇప్పటికే ఎనిమిది సార్లు జిల్లా కలెక్టర్ కు మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చారు. వినతి పత్రాల పై వాళ్ళు స్పందించక పోగా కొందరిని నా ఇంటి దగ్గర ధర్నాకు ఉసి కోల్పుతున్నారు. నవంబర్ 8 న దళిత బంధు లబ్ది దారుల పక్షాన నేను ధర్నా చేస్తే కేసులు బుక్ చేస్తున్నారు. ఒకటే ధర్నా మీద రెండు ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేసి కేసులు పెడుతున్నారు.

పేద మహిళలపై అక్రమ కేసులు పెడుతున్నారు. దళిత బంధు ఇవ్వమని దళిత మహిళలు అడగడమే తప్పా? హుజురాబాద్ ఏసీపీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మహిళలని చూడకుండా వారిని బూటు కాళ్లతో తన్నారు. కాంగ్రెస్ అధికారం శాశ్వతం కాదని ఏసీపీ గ్రహించాలి. ఏసీపీ చిట్టా అంతా త్వరలోనే బయట పెడతా.

కాంగ్రెస్ నాయకులను అడ్డుకుంటామని పిలుపునిస్తే రాకేష్ అనే యువకుడ్ని ఇష్టమొచ్చినట్టు కొట్టి అక్రమ కేసు బనాయించారు. ఇన్ని రోజులు ఓపిక పట్టా ..ఇకపై సహించను. పోలీసు అధికారుల్లారా కాంగ్రెస్ పార్టీ మీకు జీతం ఇవ్వడం లేదు.జాగ్రత్తగా మెదలాలి. దళితుల ను పోలీస్ స్టేషన్ కు అనవసరంగా పిలిపిస్తే ఊరుకునేది లేదు. పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తాం.

దళిత సోదరి ,సోదరులను వేధించడం న్యాయమా రేవంత్ రెడ్డి? దళిత బంధు పై దళిత సంఘాలు స్పందించాలి. దళిత బంధు అకౌంట్ల ను ఫ్రీజ్ చేయడం పై దళిత మేధావులు స్పందించాలి. కాంగ్రెస్ నేతలు హుజురాబాద్ లో ఎలా తిరుగుతారో చూస్తాం. దళితులకు బీ ఆర్ ఎస్ అండగా ఉంటుంది.

నా ప్రాణం పోయినా సరే ..దళిత బంధు వచ్చేదాకా పోరాడతా.ఎవ్వరికీ భయపడేది లేదు. పోలీసుల లాఠీలకు బుల్లెట్ల కు భయపడేది లేదు. దళితులపై కేసులను బీ ఆర్ ఎస్ పార్టీ లీగల్ సెల్ న్యాయపరంగా ఎదుర్కుంటుంది.

LEAVE A RESPONSE