– రావుల భవన్ కి దొరకడం అదృష్టంగా భావిస్తున్నాం
– తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డికి చేసిన ఆత్మీయ సన్మానంలో మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్: తెలంగాణ అంటే అందరికీ గుర్తుకు వచ్చే పేరు కేసీఆర్. బి ఆర్ ఎస్ అంటే అందరికీ గుర్తుకొచ్చే పేరు కేసీఆర్.తెలంగాణ భవన్ అంటే అందరికీ గుర్తుకొచ్చే పేరు శ్రీనివాస్ రెడ్డి.జలదృశ్యం టు తెలంగాణ భవన్.
కేసీఆర్ పార్టీ పెట్టిన మూడవ రోజు శ్రీనివాస్ రెడ్డి, అయిన సోదరుడు రాంమోహన్ రెడ్డి వచ్చారు.పార్టీ పెట్టిన మూడవ రోజు నుంచి ఇప్పటి వరకు ఆయన ఎంతో సేవ చేశారు.25 ఏండ్ల నుంచి చూస్తున్నాను అయనలో ఎప్పుడు కోపం చూడలేదు.
1969 లో వెటర్నరీ కాలేజీ అధ్యక్షుడు గా పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని బలంగా ఆయనలో ఉంది కాబట్టి బి ఆర్ ఎస్ లో పని చేశారు. కేసీఆర్ చెప్పింది తు. చ తప్పక అమలు పర్చారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం కేసీఆర్ ఎంతో కష్టపడ్డారు, ఆ కష్టాన్ని కల్లారా శ్రీనివాస్ రెడ్డి చూశారు. కేసీఆర్ పోరాటాన్ని, త్యాగాన్ని, విజయాలను, కామన్ మినిమం ప్రోగ్రాము లో పెట్టడం, ఇలా ఎన్నో విషయాలను ఆయన చూశారు.
2001 పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అనుభవాలతో ఒక పుస్తకం కోరుకుంటున్నాం. పుస్తకాన్ని ఇక్కడ ఆవిష్కరిద్దామా, ఆమెరికాలో ఆవిష్కరిద్దామా అనేది నిర్ణయించుకుందాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు శ్రీనివాస్ రెడ్డి తయారు చేసిన బి ఫామ్ ల మీద కెసిఆర్ సంతకం పెట్టె వారు.
శ్రీనివాస్ రెడ్డి వెళ్లిపోతుంటే కేసీఆర్ చాలా బాధపడ్డారు. కేసీఆర్ సన్మానం చేయమని చెప్పారు. ఇది శ్రీనివాస్ రెడ్డికి సన్మానం కాదు పార్టీ కార్యకర్తలు అందరికి సన్మానం. శ్రీనివాస్ రెడ్డి ఖచ్చితంగా పుస్తకం రాయాలి. రావుల చంద్రశేఖర్ రెడ్డి భవన్ కి దొరకడం అదృష్టంగా భావిస్తున్నాం. కరోనా టైం లో కూడా ప్రతి రోజు తెలంగాణ భవన్ కి వచ్చారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జనరల్ సెక్రటరీ గా ఉన్నారు.