– 28 నెలల కాంగ్రెస్ పాలనలో 28 శాఖల్లో అవినీతి
– అద్దంకి దయాకర్ కాదు.. ఆయన అడ్డంకి దయాకర్
– అదానీ, అంబానీ దగ్గర రాహుల్ గాంధీ ముడుపులు తీసుకున్నట్లు అనుకోవాలా?
– ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టరు ఎర్రోళ్ల శ్రీనివాస్
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో విడతల బ్యాచ్ తయారైంది, వారి పై అవినీతి ఆరోపణలు రాగానే విడతల వారీగా ఒక్కొకరు బయటకు వచ్చి ఏది పడితే అది మాట్లాడుతున్నారు.. ముఖ్యమంత్రి నుంచి మొదలు క్రింది స్థాయి నేతల వరకు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యారు..
హ్యమ్ మోడల్ రోడ్లలో 25 శాతం ఎక్సెస్ టెండర్ లు వేశారని మా నాయకుడు హరీష్ రావు ఆధారాలతో సహ మీడియాకు వివరించారు. మా నాయకుడు హరీష్ రావు పై అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అద్దంకి దయాకర్ కాదు, ఆయన అడ్డంకి దయాకర్, అన్నిటికీ అడ్డంపడడమే ఆయన నైజం, నిన్న మొన్న ఎమ్మెల్సీ కాగానే కొంతమంది ఆగడంలేదు.
కాంగ్రెస్ పాలన అంటేనే కరప్షన్ పాలన, కరప్షన్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే కరప్షన్. హ్యమ్ మోడల్ రోడ్లలో బిడ్ ఓపెన్ అయిందా లేదా దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మా నాయకుడు హరీష్ రావుకు సమాధానం చెప్పాలి.
కొత్వాల్ గూడలో రాఘవ కన్స్ట్రక్షన్ పేరు మీద అక్రమంగా ఇల్లీగల్ పనులు జరుగుతున్నాయి అని ఆధారాలతో సహ మా నాయకుడు హరీష్ రావు బయటపెడితే దాని పై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడలేదు? 14 యేండ్ల ఉద్యమ ప్రస్థానం, 10 యేండ్లు అధికార ప్రస్థానంలో ప్రజలకు బిఆర్ఎస్
ఏం చేసిందో అందరికీ తెలుసు.
పచ్చకామెర్ల వాడికి లోకమంత పచ్చగా కనపడినట్లు , కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం అవినీతిలోనే కూరుకుపోయారు.. ముఖ్యమంత్రి నుంచి మొదలు క్రింది స్థాయి వరకు బూతులు మాట్లాడడమే సరిపోతుంది. మోడీ ప్రభుత్వం అవినీతిలో కూరుకొని పోయిందని ప్రతిరోజు రాహుల్ గాంధీ మాట్లాడుతాడు, అలా అని అదానీ, అంబానీ దగ్గర రాహుల్ గాంధీ ముడుపులు తీసుకున్నట్లు అనుకోవాలా?
అక్రమంగా ప్రజల సంపద కొల్లగొడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు?. తెలంగాణలో భట్టి ట్యాక్స్-, పొన్నం ట్యాక్స్,- పొంగులేటి ట్యాక్స్,- ఉత్తమ్ ట్యాక్స్ నడుస్తుంది.
బిఆర్ఎస్ హయంలో మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని రద్దు చేస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని అమల్లోకి తెచ్చి ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నారు. 28 నెలల కాంగ్రెస్ పాలనలో 28 శాఖల్లో అవినీతి జరిగింది. అద్దంకి దయాకర్ బల్మూరి వెంకట్ కు దమ్ముంటే వీటి పై సమాధానం చెప్పాలి. నోటికి వచ్చినట్లు ఏది పడితే అది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడితే ఖబడ్దార్.
మీడియా సమావేశంలో పాల్గొన్న గోసుల శ్రీనివాస్ యాదవ్, అభిలాష్ రంగినేని , రాఘవేంద్ర యాదవ్ ,కె .కిషోర్ గౌడ్, తుంగ బాలు ,ఏ .హరిబాబు పాల్గొన్నారు.