– హరీశ్ రావు పై మాట్లాడే నైతికత నీకు లేదు
– బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు గోసుల శ్రీనివాస్ ధ్వజం
హైదరాబాద్ : అవినీతి లోతుల్లో మునిగిపోయిన బీర్ల ఐలయ్య, ఫ్రస్టేషన్లో పిచ్చి పిచ్చిగా అర్ధంలేని మాటలు మాట్లాడుతున్నాడు. ఉద్యమ నాయకులు హరీశ్ రావు పై నోరు పారేసుకోవడం అంటే సూర్యుడి మీద ఉమ్మేయడమే. నిరంతరం ప్రజల్లో ఉంటూ, అనునిత్యం కష్టపడే హరీశ్ రావు పై విమర్శలు చేయడం అంటే కొండపై రాళ్ళు వేయడమే..
హరీష్ రావు రైతుల కన్నీళ్ల గురించి మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు రోడ్లపైకి రావడం నిజం కాదా? కొనుగోళ్లు లేక అప్పుల బారిన పడి రైతులు ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితి వాస్తవం కాదా?రైతు బంధు ఇవ్వక ఇబ్బందులకు గురి చేస్తున్నది నిజం కాదా?
ధాన్యం కొనుగోలలో మీ ప్రభుత్వం అట్టర్ ప్లాప్ అయ్యింది నిజం కాదా?
కొనుగోళ్లు సక్రమంగా ఉంటే పత్రికల్లో, టీవీల్లో వార్తలు ఎందుకు వస్తున్నాయి.
ఎందుకు రైతులు సీఎం ను అడ్డగోలుగా తిడుతున్నారు. హరీష్ రావు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, తిక్కపట్టినట్టుగా అడ్డదిడ్డంగా మాట్లాడటం నీ అసమర్థతకి నిదర్శనం.
హరీశ్ రావు రైతుల బాధలు ప్రస్తావిస్తే, నిజాలు వినలేక కడుపుమంటతో ఊగిపోతున్నావు. నీకు సీఎం మీద భక్తి ఉంటే వెళ్లి భజన చేసుకో.. కానీ ప్రజల ముందుకు వచ్చి అబద్ధాలు చెప్పకు. రైతుల కడుపు మంటను అవమానించకు. సిగ్గు, శరం, పరువు అనే మాటలు నీకు మిగిలి ఉంటే… అక్రమ మైనింగ్‌తో సంపాదించిన దోపిడీ డబ్బు అంతా బయట పెట్టు. ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పు.
బి ఆర్ ఎస్ నాయకులపై నోరు పారేసుకున్నంత మాత్రాన నీ అవినీతి మచ్చ తుడిచిపెట్టుకుపోదు. నీ అవినీతి, ఆవేశాలే నిన్ను మట్టి బెడతాయి. వచ్చే ఎనికల్లో ఓడగొడుతాయి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో.. మెదడు అరికాళ్ళలో ఉన్నవాడిలా ప్రవర్తించి పరువు తీసుకోకు..