Suryaa.co.in

Telangana

బీఆర్ఎస్ బీజేపీ కి “బి” టీం అని మరోసారి నిరూపితమైంది

– విద్యుత్ సంస్థలను 60 వేల కోట్ల అప్పుల్లో ముంచి తన అవినీతికి బలిపెట్టిన ఘనుడు కేసీఆర్
– “సత్యాగ్రహ దీక్ష” పిలుపుని నీరుగార్చాలని, ఉచితవిద్యుత్ పైకి దృష్టి మరల్చాలని ప్రయత్నమే
– టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ బీజేపీ కి “బి” టీం అని మరోసారి నిరూపితమైంది.రేపు రాహుల్ గాంధీ పై అనర్హత వేటుకు నిరసనగా “సత్యాగ్రహ దీక్ష” పిలుపుని నీరుగార్చాలని, ఉచితవిద్యుత్ పైకి దృష్టి మరల్చాలని ప్రయత్నిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తుంది. 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదన్న విషయం ఏ సబ్ స్టేషన్ కు వెళ్లినా తెలుస్తుంది. తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను 60 వేల కోట్ల అప్పుల్లో ముంచి తన అవినీతికి బలిపెట్టిన ఘనుడు కేసీఆర్. ఈ మోసాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలకేంద్రాలలో సబ్ స్టేషన్ల ముందు కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేయాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిస్తున్నాం.

LEAVE A RESPONSE