Suryaa.co.in

Andhra Pradesh

జగన్మోహన్ రెడ్డి పరిపాలన రైతుల పాలిట శాపం

– రైతు ఆత్మహత్యల్లో ఏపీ 3 వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2 స్థానం
– అప్పుల్లో దేశంలోనే మొదటిస్థానం
– నారా లోకేష్‌ను కలిసిన రాజువారిచింతలపాలెం ప్రజలు

కావలి అసెంబ్లీ నియోజకవర్గం రాజువారిచింతలపాలెం ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామానికి గతంలో మద్దూరుపాడు సబ్‌ స్టేషన్ నుండి విద్యుత్ సరఫరా అయ్యేది.
• విద్యుత్ సక్రమంగా సరఫరా కాకపోవడంతో బోర్ల ద్వారా పంటలు పండించలేని పరిస్థితి నెలకొంది.
• ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా చోడవరం సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ ఇస్తున్నారు.
• అయినప్పటికీ పంటలు పండించడానికి సరిపడా విద్యుత్ అందడంలేదు.
• మిర్చి, అరటి, మునగ, వేరుశెనగ, పంటలకు సకాలంలో నీరు అందక నష్టపోతున్నాం.
• మీరు అధికారంలోకి వచ్చాక మాగ్రామానికి అందుబాటులో సబ్ స్టేషన్ నిర్మించి మమ్మల్ని ఆదుకోవాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన రైతుల పాలిట శాపంగా మారింది.
• గత నాలుగేళ్లుగా రైతులు నష్టాలపాలై అప్పుల్లో దేశంలోనే మొదటిస్థానంలో నిలిపాడు.
• రైతు ఆత్మహత్యల్లో ఏపీ 3 వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2 స్థానంలో నిలిచింది.
• అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్ విఎస్ పాలంలో సబ్ స్టేషన్ నిర్మించి, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చేస్తాం.
• సాగునీరు అందేలా చేసి పంటలను కాపాడతాం.

LEAVE A RESPONSE