– నోముల ప్రకాష్ సేవలను ఉపయోగించుకుని వారికి సముచిత స్థానం కల్పిస్తాం
– టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన సికింద్రాబాద్ బీఆరెస్ సీనియర్ నాయకులు నోముల ప్రకాష్ గౌడ్
గ్రేటర్ లో సెల్ఫీలు దిగే వారు, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకునేవారు ఎక్కువయ్యారు.కేటీఆర్, దానం నాగేందర్ ను సూటిగా ప్రశ్నిస్తున్నా. గ్రేటర్ లో మెట్రో నిర్మించింది కాంగ్రెస్ కాదా? సవాల్ విసురుతున్నాం. నగరంలో మత సామరస్యం తీసుకొచ్చింది కాంగ్రెస్అంతర్జాతీయ పెట్టుబడులు తెచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది కాంగ్రెస్.
పదేళ్లలో బీఆరెస్ నేతలు చేసిందేం లేదు. మూసిని కూడా కబ్జాలు చేసిన ఘనత బీఆరెస్ ది.కాలువలో పడి పిల్లలు చనిపోతే పట్టించుకునే దిక్కు లేదు.నగరం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలు భావిస్తున్నారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. కార్యకర్తలు బస్తీ బాట పట్టి ప్రజలకు చేరువ కావాలి.
నోముల ప్రకాష్ గౌడ్ ను కాంగ్రెస్ లోకి సాదర స్వాగతం ప్రకాష్ గౌడ్ సేవలను ఉపయోగించుకుని వారికి సముచిత స్థానం కల్పిస్తాం.కాంగ్రెస్ ను గెలిపించి పార్టీకి పూర్వ వైభవం తీసుకొద్దాం. జంట నగరాల నుంచి అత్యధిక ఎమ్మెల్యేలను గెలిపించి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలి.