Suryaa.co.in

Telangana

ఎంపీ వద్దిరాజు తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ కు ఘన నివాళులు

రాజ్యసభలో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడు,సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ కి ఘన నివాళులర్పించారు. ఢిల్లీలో మంగళవారం ఎంపీ రవిచంద్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు,మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్, గుంటకండ్ల జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్ రావు,మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, శాసనసభ్యులు కే.పీ.వివేకానంద, కొత్త ప్రభాకర్ రెడ్డి,బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ దాసోజు శ్రావణ్ తదితరులతో కలిసి జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలు జల్లి ఘనంగా నివాళులర్పించారు.

LEAVE A RESPONSE