– కేసీఆర్ సీఎం కావడం చారిత్రక అవసరం
– తెలంగాణ ప్రజలు సుఖంగా ఉండాలంటే బీఆర్‌ఎస్‌ను గెలిపించండి
– సనత్‌నగర్‌లో మంత్రి తలసాని పాదయాత్రలు
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే బీఆర్‌ఎస్ పార్టీతోనే సాధ్యమైతుందని సనత్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తెలిపారు. శుక్రవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని అమీర్ పేట లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం నుండి ప్రచారం ప్రారంభించి సుప్రభాత్ నగర్, రేణుక నగర్, BJR-1 శ్రీరాం నగర్ లలో పాదయాత్ర నిర్వహించి విస్తృత ప్రచారం జరిపారు. అభ్యర్ధి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి అడుగడుగునా డప్పు చప్పుళ్ళు, పూలవర్షంతో సాదరస్వాగతం పలికారు.
గడప గడప లో ఆయనకు మహిళలు మంగళ హారతులు పట్టి, నుదుటన కుంకుమ తిలకం దిద్ది శాలువాలు, పూలమాలలతో ఘనస్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రేణుక నగర్, BJR నగర్ తదితర ప్రాంతాలలో దేవీ నవరాత్రుల సందర్బంగా ప్రతిష్టించిన దుర్గామాత అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. నిర్వహకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాని మా సమస్యలు పరిష్కరించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కారు గుర్తుకే తమ ఓటేస్తామని తమ సంపూర్ణ మద్దతును తెలిపారు.
మా నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మీరే మళ్ళీ గెలుస్తారంటూ పలువురు ధీమా వ్యక్తం చేశారు. మా సమస్యలు చెప్పిన వెంటనే స్పందించి పరిష్కరించే గొప్ప నాయకుడు తమకు ఉండటం మా అదృష్టమని, మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని శ్రీరాం నగర్ కాలనీలో ప్రచారం సందర్బంగా కాలనీ వాసులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కి హామీ ఇచ్చారు.రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించే మొదటి 5 గురిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఒకరు గా ఉండాలని స్థానిక ప్రజలు ఆకాంక్షించారు.
ఈ సందర్బంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో 50 సంవత్సరాలలో జరగని, ఎవరు ఊహించని స్థాయిలో గడిచిన 10 సంవత్సరాల కాలంలో జరిగాయని వివరించారు. 2014 కు ముందు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేవని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే రోడ్లు, డ్రైనేజీ వ్యవస్తను ఎంతో అభివృద్ధి చేసినట్లు వివరించారు. త్రాగునీటి సమస్యను కూడా పరిష్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రముఖ బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని కూడా గొప్ప ఆద్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. నిరంతరం ప్రజల మద్యనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తూ వచ్చానని తెలిపారు. జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళ ఎదుటనే ఉన్నాయని, మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగేందుకు మీ బిడ్డగా ఆశీర్వదించాలని కోరారు. ప్రచారంలో ప్రజలు తన పట్ల చూపుతున్న ఆదరాభిమానాలు, ప్రేమను ఎన్నటికి మరువలేనని అన్నారు.
మంత్రి వెంట ప్రచారంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, డివిజన్ బీఆర్‌ఎస్ అద్యక్షులు హన్మంతరావు, జనరల్ సెక్రెటరీ సంతోష్, నాయకులు అశోక్ యాదవ్, కర్ణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, కూతురు నర్సింహ, ఉత్తమ్ కుమార్ రాజ్ పురోహిత్, టిల్లు, లాహోర్ సింగ్, జోగిందర్ సింగ్, నందీశ్, మల్లయ్య గౌడ్, వనం శ్రీనివాస్, హరిసింగ్, రమేష్ మోత్కుపల్లి, కట్టా బలరాం, శ్రీనివాస్, సీనియర్ సిటిజన్ లు పార్ధసారధి, సహదేవ్ గౌడ్, RC కుమార్, లక్ష్మి, రాణి కౌర్, నాగలక్ష్మి, లలిత, లలితా చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.