-కార్యకర్తలే పార్టీ కి పునాది
-ప్రతీ కార్యకర్త ఇంటికి పెద్ద దిక్కు కేసీఆర్
-ప్రమాదవశాత్తు మరణించిన బిఆర్ఎస్ కార్యకర్త ల కుటుంభ సభ్యులకు బీమా చెక్కు లను అందజేసిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
-వేల్పూర్ క్యాంపు కార్యాలయం లో నలుగురు బిఆర్ఎస్ కార్యకర్తల నామినీ లకు 2 లక్షల చొప్పున 8 లక్షల చెక్ లను అందజేసిన మంత్రి
కార్యకర్తలకు అన్నివిధాల బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బాల్కొండ శాసన సభ్యులు, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల అన్నారు.బాల్కొండ నియోజకవర్గం లో పార్టీ లో కార్యకర్త గా ఉంటూ ప్రమాదవశాత్తు మృత్యువాత పడిన నాలుగు కుటుంభాలకు మంత్రి రెండు లక్షల చొప్పున 08 లక్షల చెక్ లను అందజేశారు . ప్రతి ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త ఇంటికి కేసీఆర్ పెద్ద దిక్కులా ఉంటారని మంత్రి స్పష్టం చేశారు.
పార్టీ కి కార్యకర్తలే పునాది అన్న మంత్రి కార్యకర్తల కొసం బిఆర్ఎస్ పార్టీ కోట్ల రూపాయలను ఇన్సూరెన్స్ గా చెల్లిస్తుందన్నారు. కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించడం ద్వారా వాళ్ళ ఇంటికి పెద్ద దిక్కులా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలుస్తుండన్నారు. చెక్ లను అందుకున్న వారిలో నామినీలు బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం కు చెందిన కీ.శే చిన్న మల్లయ్య సతీమణి పడిగే సవితకు , ఏర్గట్ల మండలం నాగేంద్ర నగర్ కు చెందిన కీ.శే శంకర్ భార్య గంగామణి కు,ముప్కాల్ మండలం నల్లూర్ గ్రామానికి చెందిన కీ.శే ప్రశాంత్ భార్య దివ్య కు మరియు కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన కీ.శే అక్బర్ తండ్రి సయ్యద్ మహమ్మద్ లకు మంత్రి చెక్ లను అందజేశారు… కార్యక్రమం లో ఆయా ప్రాంతాలకు చెందిన కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు.