– సమస్యలు లేకుంటే ముక్కు నేలకు రాసి ఇంటికి పోతా
– మీవి కొనే మొహాలు అయితే వర్షాలు పడక ముందు ఎందుకు కొనలేదు?
– కేసీఆర్ కి మళ్ళీ ఓట్లేస్తే తెలంగాణ ను అమ్మేసినట్లే
– సత్తుపల్లి ఎమ్మెల్యే కి రాజకీయ వ్యభిచారం అనిపించుకోదా?
– వైఎస్సార్ తెలంగాణ పార్టీ వైఎస్ షర్మిల
రైతులు,నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే… ఇప్పుడు దొర దేశాలు యేలబోతాడు అంట. ఈ దరిద్రం ఇక్కడి తో సరిపోదా?టీఆరెఎస్ పార్టీ బీఆర్ఎస్పార్టీ అయుందట. భారతీయ రాష్ట్ర సమితి అయ్యిందని గొప్పగా చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ సమితి అని నవ్వుకుంటున్నారు.
కేసీఆర్ కి కెటిఆర్ కి ఒక సవాల్ . సమస్యలు లేవని చెబుతున్నారు…నాతో పాదయాత్ర కి రావాలని సవాల్. సమస్యలు లేకుంటే ముక్కు నేలకు రాసి ఇంటికి పోతా. సమస్యలు ఉంటే రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రి నీ చేయాలి. కేసీఆర్ కి మళ్ళీ ఓట్లేస్తే తెలంగాణను అమ్మేసినట్లే.
నా మీద మీరు చూపించే ప్రేమ వైఎస్సార్ బిడ్డ ఎప్పటికీ మరిచిపోదు. మీ చిరునవ్వులు నన్ను నడిపించాయి. మీ అభిమానం నన్ను నడిపించింది. మేము దాటి వచ్చిన ప్రతి నియోజక వర్గ ప్రజలకు చేతులు జోడించి శిరస్సు వంచి మనసు పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్న. వైఎస్సార్ కేవలం 5 ఏళ్లు మాత్రమే అధికారంలో ఉన్నారు. ఆ పరిపాలన ఎలా ఉందో ఇక్కడ ప్రజలందరికీ తెలుసు.
8 ఏళ్లుగా అధికారం లో ఉన్నాడు ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్. నక్కలు ఎరగని బొక్కలు లేవు…పాములు ఎరగని పుట్టలు లేవు. కేసీఆర్ మోసం చేయని వర్గమే లేదు. ప్రతి వర్గాన్ని కేసీఆర్ మోసం చేశారు. రుణమాఫీ అని రైతులను మోసం చేశారు. ఇంటికో ఉద్యోగం అని నిరుద్యోగులను మోసం చేశారు.
సత్తుపల్లి నియోజక వర్గం ఒక దళిత నియోజక వర్గం.ఇక్కడ ఉన్నాడు ఒక ఎమ్మెల్యే..పచ్చ పార్టీ లో గెలిచి కేసీఆర్ కు అమ్ముడు పోయాడు.సంతలో పశువుల్లా అమ్ముడు పోయారు. ఇది ఆ ఎమ్మెల్యే కి రాజకీయ వ్యభిచారం అనిపించుకోదా? ఈయన దళితుడు అయ్యి…దళిత ద్రోహి గా మారాడు. దళిత ముఖ్యమంత్రి అని మోసం చేసిన కేసీఆర్ తో కలిశాడు. దళిత బందు అని మోసం చేసిన కేసీఆర్ తోనే ఉన్నాడు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం కడతానని మోసం చేసిన కేసీఆర్ తోనే మీ ఎమ్మెల్యే ఉన్నాడు. రాజ్యాంగం మార్చాలని చెప్పి అంబేడ్కర్ ను అవమానించిన ముఖ్యమంత్రి తోనే ఉన్నాడు ఈ ఎమ్మెల్యే. ఇవన్నీ సరిపోలేదనీ… ప్లీనరీ లో ఈ ఎమ్మెల్యే దళిత బందు దేశం మొత్తం అమలు చేయాలని చెప్పాడు. సత్తుపల్లి నియోజక వర్గం లో అత్యధికంగా దళితులు ఉన్నారు. ఇక్కడ ఎంత మంది దళితులకు దళిత బందు ఇచ్చారు? స్థానిక ఎమ్మెల్యే కి సిగ్గు లేకుండా కేసీఆర్ పక్కన..ఆయన్ను పొగుడుతూ అక్కడే బ్రతుకుతున్నారు. ఇంకోసారి జన్మలో రాజకీయంగా నిలబడకుండా సత్తుపల్లి ప్రజలు ఆ ఎమ్మెల్యే కి బుద్ది చెప్పాలి.
ఏం బాగుపడింది సత్తుపల్లి? సింగరేణి నీ అప్పుల పాలు చేశారు.ఆర్టీసీ నీ ప్రైవేట్ పరం చేయాలని అనుకుంటున్నారు. ఆర్టీసీ స్థలాలను అమ్ముకోవాలని చూస్తున్నారు. కేసీఆర్ చేసిన తప్పుడు సంతకం వల్ల యాసంగి లో రైతులు తీవ్రంగా నష్టపోయారు.ఒక్క జనగాం జిల్లాలో 5లక్షల టన్నుల ధాన్యం తడిచిపోయింది.తడిచిన ధాన్యం కొంటమని ఇప్పుడు చెప్తున్నారు.
మీవి కొనే మొహాలు అయితే వర్షాలు పడక ముందు ఎందుకు కొనలేదు? 65 లక్షల టన్నులు ధాన్యం పండితే కేవలం నాలుగు లక్షల టన్నులు మాత్రమే కొన్నారు. మద్దతు ధర ఉన్న పంటకు కూడా ఇంత దారుణమా? 17 లక్షల మంది రైతులు పొలాలను వేయకుండా బీడు భూములుగా పెట్టుకున్నారు.
రైతులు కార్లలో తిరిగితే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి 25 లక్షలు ఇవ్వాలి. ఉద్యోగాలు లేక చనిపోయిన నిరుద్యోగుల కుటుంబాలను ఏనాడైనా పరామర్శించారా? దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు… మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. బంగారు తునక అని చెప్పి బీడీ బిచ్చం కళ్ళు ఉద్ధేర నాలుగు లక్షల కోట్లు తెచ్చి కనీసం ఒక కుటుంభానికి నాలుగు లక్షలు కూడా ఇవ్వలేదు.
వాళ్ళ స్వార్థ ప్రయోజనం కోసం రాజకీయాలు చేస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. బంగారు తెలంగాణ చేశాడు అని బంగారు భారత్ చేస్తాడట. బంగారు తెలంగాణ అని చెప్పి బ్రతుకే లేని తెలంగాణ గా మార్చారు. అప్పుల తెలంగాణ..ఆత్మహత్యల తెలంగాణ గా మార్చారు. గుడులు బడులకన్నా మద్యం షాపులే ఎక్కువ.
కేసీఆర్ అక్రమంగా లక్షల కోట్లు సంపాదించారని బీజేపీ చెప్తోంది. అక్రమాల పై ఆధారాలు ఉంటే ఎందుకు బయట పెట్టడం లేదు? ప్రజల కోసం పని చేసే వారికి ఓట్లేస్తే రాష్ట్రం బాగుపడుతుంది. వైఎస్సార్ ఒక మంచి మనిషి కాబట్టే..ఆయనను ఇంకా కోట్ల మంది ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. నేను ఆయన బిడ్డను… వైఎస్సార్ పాలనను తిరిగి తీసుకు రావడం కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ.
మీ ఆశీర్వాదం చేత..వ్యవసాయం పండుగ. మొట్టమొదటి సంతకం ఉద్యోగాల కల్పన, పక్కా ఇళ్లు మహిళ పేరు మీద ఉండేలా చేస్తా. ఫీజు రీయింబర్స్ మెంట్,ఆరోగ్య శ్రీ అమలు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది వృద్దులకు పెన్షన్. కేసీఆర్ నియంత పాలన పోవాలి… అక్రమ పాలన పోవాలి. వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలి. వైఎస్సార్ సుపరిపాలన అందిస్తా అని వైఎస్సార్ బిడ్డగా మాట ఇచ్చి చెప్తున్నా.