జగన్ రెడ్డి పాలనలో ప్రతి రోజు మానభంగాలు, మర్డర్లే

218

– సత్యసాయి జిల్లాలో తేజస్వినిని అత్యాచారం చేసి హత్య చేసిన నింధుల్ని శిక్షించాలి
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేతకాని పాలనలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా‎ మహిళలపై ప్రతిరోజు మానభంగాలు, మర్డర్లు జరుగుతున్నాయి. ఈ 3 ఏళ్ల పాలనలో మహిళలపై అఘాయిత్యాలు జరగని రోజు లేదు, వారి ఆర్తనాధాలు వినిపించని చోటు లేదు. సత్యసాయి జిల్లాలో మరో ఉన్మాది బీఫార్మసీ విద్యార్ధిని తేజస్వీనిని అత్యంత కిరాతంగా అత్యాచారం చేసి హత్య చేశాడు.

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై జగన్ రెడ్డి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవటం వల్లే రాష్ట్రంలో ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రజల నుంచి ఇబ్బందులు ఎదురవకుండా తన వెళ్లే దారిలో రోడ్డుకు ఇరువైపులా పరదాలు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేయించుకుని తన భద్రత తాను జాగ్రత్తగానే చూసుకుంటున్నారు. జగన్ రెడ్డి తన భద్రతపై పెట్టిన శ్రద్దలో కనీసం 1 శాతం మహిళల భద్రతపై దృష్టి సారించినా మహిళలపై ఇన్ని అఘాయిత్యాలు జరిగేవి కావు.

రాష్ట్రంలో విచ్చలవిడిగా జే బ్రాండ్ మద్యం అమ్మకాలు, గంజాయి, నాటు సారా వల్లే మహిళలపై అత్యాచారాలు,హత్యలు, దాడులు పెరిగిపోతున్నాయి. వైసీపీ 3 ఏళ్ల పాలనలో మహిళలు, బాలికలపై 850 కిపైగా అత్యాచారాలు, వేధింపులు, దాడులు జరిగాయి. వీటిలో అధిక శాతం దుండగులు మద్యం, గంజాయి మత్తులోనే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డట్టు పోలీసులు చెబుతున్నారు.

జగన్ రెడ్డి ఇకనైనా రాష్ట్రంలో జే బ్రాండ్లు, గంజాయి మాఫియాను అరికట్టాలి, మహిళల భద్రతకు తగిన చర్యలు చేపట్టాలి. తేజస్వినిని హత్య చేసిన వారిపై వెంటనే శిక్షించాలి. రాష్ట్రంలో మరో మహిళ ఉన్మాదుల చేతిలో బలవ్వకుండా చర్యలు చేపట్టాలి.