Suryaa.co.in

Andhra Pradesh

ఆగిన బుడమేరు లీకేజీలు!

– కట్టనూ బలోపేతం చేసిన ఇంజినీరింగ్‌ నిపుణులు
– స్పందిస్తున్న దాతలు
– మంత్రి లోకేష్‌కు చెక్కుల అందజేత

విజయవాడ: బుడమేరు గండ్లను ఇంజినీరింగ్‌ నిపుణులు, అధికారులు, సిబ్బంది సమర్థంగా పూడ్చడంతో లీకేజీలు కూడా నిలిచిపోయాయి. అదే విధంగా కట్టను బలోపేతం చేశారు. దీంతో సీపేజ్ లీకేజీలకూ పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడింది. ఈ పనులను ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి మంత్రి నారా లోకేష్ పర్యవేక్షించారు. ఇదిలావుండగా, విజయవాడ ముంపు ప్రాంతాల్లో వరద పూర్తిగా తగ్గుముఖం పట్టింది. దీంతో సహాయక చర్యలు అధికారులు ముమ్మరం చేశారు. పేరుకుపోయిన బురదను తొలగిస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య శాఖ తగిన చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. అవసరమైన నిత్యావసర కిట్లు సిబ్బంది పంపిణీ చేస్తున్నారు. కాగా, మంగళవారం వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. మంత్రి నారా లోకేష్ ను కలిసి చెక్కులు పలువురు ప్రముఖులు అందజేశారు.

విరాళాల వివరాలు..

– పుంగనూరు నియోజకవర్గానికి చెందిన విజయవాణి ప్రింటర్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ యజమాని ఎన్.చంద్రకళ రూ.25 లక్షలు
– విజయవాడకు చెందిన సీవెల్ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఎమ్.వీరసత్య రూ.10 లక్షలు
– కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, ఇతర టీడీపీ నేతలు కలిసి రూ.లు 4,59,867
– విజయవాడకు చెందిన వీరమాచినేని పవన్ రూ.లు 3,66,666
– విజయవాడకు చెందిన వికాస్ విద్యావనమ్ యజమాని ఎస్ఆర్ పరిమి రూ.లు 2,50,000
– ఏపీఎస్ఏసీఎస్ ల్యాబ్ టెక్నీషియన్స్ అండ్ ఎయిడ్స్ కంట్రోల్ ఎంప్లాయిస్ యూనియన్(హెచ్-124) ప్రతినిధులు రూ.లక్ష
– రాయచోటి నియోజకవర్గానికి చెందిన శ్రీనాథ్ ఫంక్షన్ హాల్ యజమాని జి.శ్రీనాథ్ రూ.లక్ష
– కడపకు చెందిన ఎస్.ఏ ప్రతాప్ రూ.55 వేలు
– కడపకు చెందిన ఎన్.సాయి వర్ష రూ.50 వేలు
– సత్తెనపల్లికి చెందిన చౌటా వాసవి రూ.25 వేలు
వరద బాధితులను ఆదుకునేందుకు విరాళాలు అందజేసిన దాతలకు మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A RESPONSE