– ఎమ్మెల్యే సోమిరెడ్డి
విజయవాడ: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద వల్ల సంభవించిన నష్టం మాటల్లో చెప్పలేం.. ఇది వర్ణనాతీతమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్ లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే…
* ప్రతిరోజు 40-45 సెం.మీ వర్షపాతం నమోదైన పరిస్థితి.
* చరిత్రలో మునుపెప్పుడూ ఇంతటి విపత్తు సంక్షోభాన్ని చూడలేదు.
* ఈ నేపథ్యంలో మనసున్న వారందరూ సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.. వారికి తోచిన విధంగా విరాళాలు అందిస్తున్నారు.
* సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన ఆయిల్ కంపెనీల తరఫున మంగళవారం రూ.2.97 కోట్లు విరాళాల చెక్కులను సీఎం చంద్రబాబుకు అందజేశాం.
* ఇదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్న దాతలు వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలి.