Buddha Statue and sunset background
బుద్ధుడు బోధి (enlightenment)ని పొంది లేచిన తరువాత పలికిన తొలి మాటలు:
(ఈ మాటలు దమ్మపదంలో 153, 154 శ్లోకాలు లేదా పద్యాలు గా చోటు చేసుకున్నాయి)
అనేక జాతి సమ్సారమ్
సన్దావిస్సమ్ అనిబ్బిసమ్
గహకారకమ్ గవేసన్తొ,
దుక్ఖా జాతి పునప్పునమ్
గహకారక! దిట్ఠో సి,
పునగేహం న కాహసి,
సబ్బా తే ఫాసుక భగ్గా,
గహకూటమ్ విసణ్ఖితమ్,
విసఙ్ఖరాగతమ్ చిత్తమ్
తణ్హానమ్ ఖయమ్ అజ్ఝగా.
అనేక జన్మల సంసారంలో
తిరిగాను, గృహ నిర్మాతను
చూడాలనుకుని చూడలేక
మళ్లీ మళ్లీ పుడుతూ దుఃఖించాను.
గృహ నిర్మాతా! (గృహ కారకుడా!)నువ్వు కనిపించావు;
నువ్వు మరోసారి గృహాన్ని నిర్మించే అవకాశం లేదు;
నీ ఇంటి వాసాలు విరిగిపోయాయి,
ఇంటి పైకప్పు ధ్వంసం అయింది;
వైరాగ్యాన్ని పొందింది చిత్తం;
తృష్ణ (తన్హా) క్షయమైపోయింది (నశించిపోయింది).
ఇక్కడ “గృహ నిర్మాతా” లేదా “గృహ కారకుడా” అనడం పరమాత్మకు ప్రతీకగా ఉంది. ‘గృహం’ అంటే శరీరం అనీ, ‘ఇంటి వాసాలు’ అంటే మనో వికారాలు అనీ, ‘పైకప్పు’ అంటే అజ్ఞానం అనీ ప్రముఖ (శ్రీలంక) బౌద్ధ సన్యాసి, బౌద్ధ పండితుడు Ven. Narada Maha Thera తెలియజెప్పాడు.
వేదాంత ప్రతిపాదిత సిద్ధి(Summum bonum)ని పొందాక తాను పొందిన అనుభవాన్ని, తానున్న స్థితిని సరిగ్గా పలవరించాడు బుద్ధుడు. ఈ మాటలు బుద్ధుడు సనాతనుడు లేదా వైదికుడు అన్న సత్యాన్ని తేట తెల్లం చేస్తున్నాయి… “గృహ నిర్మాతా” అని అనడం పరమాత్మ లేదా బ్రహ్మన్ లేదా విశ్వకర్తను సంబోధించడమే అని స్పష్టంగా అవగతమౌతోంది.
బుద్ధుడు తపస్సు ద్వారా పరమాత్మను చూసి, దుఃఖాన్ని, తృష్ణను జయించిన స్థితి సనాతనత్వమే! దాన్ని అనుభవించి ఇలా చెప్పిన బుద్ధుడు సనాతనుడే!!

9444012279