“భారత భూభాగంలో బుద్ధుడు అభివృద్ధికీ, ఐశ్వర్యానికీ, భద్రతకూ, వికాసానికి, సమైఖ్యతకు, ప్రశాంతతకూ ప్రతీక చిహ్నం కాలేదు. ప్రపంచంలో ఏ బౌద్ధ దేశమూ అభివృద్ధికరంగానూ, గొప్పగానూ లేదు” ఇదీ రోచిష్మాన్ అభిప్రాయం.
మహానాడు లో ఏపియల్ 4 న, ఇతని వ్యాసంలో బుద్ధుణ్ణి, అశోకుణ్ణి. అంబేద్కర్‌ని కించపరచారు. అది ఒక వ్యాసం అని.. దాన్లో విశేషం ఉందని ఎవ్వరూ అంగీకరించరు. ఆంధ్ర రాష్ట్రానికే ‘అమరావతి’ రాజధానిగా అంగీకరించటంలో తన అక్కసు వెళ్ళబుచ్చారు. రోచిష్మాన్ గారి అజ్ఞానం ఎంత గొప్పదో, వారి ఉటంకించిన సంఘటనే తెలియజేస్తాయి! అజ్ఞానం అజ్ఞానంగా ఉండేవారే చరిత్ర మీద ఏ కొంతైనా ఆలోచిస్తారు! ఇంత దిగజారుడు ఆలోచనలు అదరూ అసహించు కొంటారు. ఎద్దేవా చేస్తారు.
రోచిష్మాన్ గారి విషయంలో –
ఒకటి: బుద్ధుడు మంచోడు కాదు.
రెండు: అశోకుడు మంచోడు కాదు.
ఇదే విషయాన్ని ప్రతి పేరాలో అదేపనిగా చెప్పారు. ఎవరన్నా వినకపోతే ‘నేను చెప్తున్నాను వినండి… వినండి” అంటూ శొద పెట్టారు. వారి వ్యాసంలోని విషయాల్ని పరిశీలిద్దాం:
కనిష్కుని కాలం
ముందుగా కనిష్కుని (క్రీ.శ.78 – క్రీ.శ.101) తర్వాత భారత దేశం ముక్కలైపోయింది అన్నారు. అది వారికే తెలియాలి. కనిష్కుడు కూడా బౌద్ధుదే. ఇతను విదేశీయుడైనా మన ఆచారాల్ని పాటించాడు. ఇతనికి చంద్రగుప్తుని పరాక్రమం, అశోకుని మతాభిమానం రెండూ కలిసే ఉన్నాయి. ఇతను నూతన శకాన్ని ప్రారంభించాడు. కల్హనుడి రాజతరంగిని ఇతని కాలంలోదే.
బౌద్ధ పండితుడు అశ్వఘోషుడు తన ‘బుద్ధచరితం’, ‘సౌందర్యానందం’, వసుమిత్రుడు ‘మహావిభాషా’ శాస్త్రాన్ని, చెరకుడు ‘చరక సంహితను’ రాశారు. కనిష్కుడి కాలంలోనే 4వ బౌద్ధ సంగీతి జరిగింది. గాంధార శిల్పకళ భారతీయ, గ్రీకు శిల్పకళలు ఇతని కాలంలోనే ప్రసిద్ధి చెందాయి, బుద్ధుడు శిల్పకళ ఇతని కాలంలోనే…..!
భారత దేశంపై బౌద్ధులు రాజుగా ఉన్నప్పుడు, పరాయదేశం వారు ఎప్పుడూ యుద్ధాలు చేయలేదు. అలాంటి చరిత్ర బౌద్ధులకు లేదు. అశోకుని కాలంలోగానీ, కనిష్కుని కాలంలోగానీ, హర్హుడు కాలంలోగానీ ఇలాంటి చరిత్ర .
రాజపుత్రులు
బాబర్‌ను భారత దేశానికి వచ్చి, ఆక్రమింపచేసిందీ రాజపుత్రులే, ఇబ్రహీంలోడికి అతని దాయాదితో విభేధాలు వచ్చాయి. అతన్ని, రాజపుత్ర రాజు రాణా సంఘ్ ఆశ్రయమిచ్చాడు. వీరిద్దరూ కలసి బాబర్ దగ్గరకు వెళ్ళారు. పాటిపట్టు దగ్గర యుద్ధం జరిగి ఇబ్రహీంలోడి ఓడిపోయాడు. బాబరు ఢిల్లీకి రాజయ్యాడు. 1517లో రాణాసంఘ్ బాబరు పై యుద్ధానికి మళ్ళీ వచ్చి తాను ఓడిపోయాడు. రాజపుత్ర రాజ్యం బాబరు వశమైంది. అలా బాబర్‌ను రప్పించింది రాజపుత్ర రాజులే!
ఇంకా మరో సంఘటన:
పృథ్వీరాజ్ చౌహాన్ (1168-1192) జయచంద్రుని కూతురైన సంయుక్తను పెళ్ళి చేసుకోవడం. అందులో సంయుక్త వరమాల ధరించి ఉండగా, పృద్వీరాజ్ ఏకమవుతారు. అతణ్ణి ఓడించడానికి జయచంద్రుడు ఘోరీ దగ్గరకు వెళ్తాడు. పృద్వీరాజ్ ను ఒడించిన తరువాత ఘోరీ తన బానిసకు (కుతుబుద్దీన్ ఐబక్ న్ను) ఢిల్లీ సింహాసనం అప్పచెప్పి వెళ్ళాడు. అతని కుమార్తె రజియా సుల్తానా.
ఇక్కడ కూడా ఘోరీని పిలిచింది మన భారతీయులే!
ఇంకో సంఘటన: అయోధ్యలో రామాలయం ఉంది. దాని ప్రక్కనే హనుమాన్ గుడి ఉంది. దాని మహంతులు ఇద్దరు. వారిద్దరూ అన్నతమ్ములు. ఆ అన్నదమ్ముల్లో పెద్దవాడే హనుమాన్ గుడి ఆదాయాన్ని అనుభవిస్తున్నాడు. ఇద్దరికీ తగాదాలు జరిగాయి. ఫైజాబాద్ జిల్లాలో ఉంది. చివరిక్ తమ్ముడు హిందూ మతం మాని, ముస్లిం మతాన్ని తీసుకుని అన్నపైర్ యుద్ధానికి వెళ్ళాడు. ఇదీ ఇద్దరు అన్నదమ్ముల యుద్ధమే!
ఇలాంటి ‘చౌకబారు’ యుద్ధాలు బౌద్ధులు ఎప్పుడూ చేయలేదు.
అంబేద్కర్ విషయం
ఇక అంబేడ్కర్ విషయం చూద్దాం: రోచిష్మాన్ ప్రకారం ” అంబేడ్కర్ బౌద్ధాన్ని తీసుకున్న కొన్ని నెలల్లోనే మరణించాడు. ఆయన బౌద్ధాన్ని తీసుకొకుండా ఉంటే ఇంకొన్నాళ్ళు బతికేవారేమో?” అన్నారు. వీరు అన్నమాట చాలా విలువైనది. అంబేడ్కర్ తొలి రోజుల్లోనే ఆరు లక్షల మందికీ, ఆ తర్వాత రెండు లక్షల మందికీ దీక్ష ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన ఇంకా బాగుంటే ఎందరో బౌద్ధులు తయారయ్యేవారు. కుల భారతాన్ని కుళ్ళబొడిచేవారు.
కానీ, అంబేడ్కర్ చివరి రోజులు ఆయనకు తెలుసు. అందుకే బౌద్ధ దీక్ష తీసుకున్నాడు. రెండు రోజుల్లోనే బౌద్ధాన్ని బ్రతికించాడు. హిందూ మతాన్ని వదిలిన తాను జైనం, సిక్కు, ముస్లిం, క్రైస్తవం … ఇలా ఎన్నో మతాలు చూశాడు. కానీ, వాటిలో కుల భారతాన్ని సంస్కరించేది బౌద్ధంలోనే ఉంది అనుకున్నాడు.
అందుకే ఆయన బౌద్ధుడు అయ్యాడు. ‘బోధిసత్త్వునిగా’ కీర్తి గాంచారు.
అశోకుడు చరిత్ర చూద్దాం..
రోచిష్మాన్ “భారత దేశంలో తొలి ‘మత నరమేథం’ అశోకుడు చేశాడు” అని మాట్లాడి అశోకుని పూర్వ చరిత్రను తీసుకువచ్చారు. అశోకుడు బౌద్ధుడు కాకముందు ఒక చరిత్ర, అశోకుడు బౌద్ధుడు అయ్యాక ఒక చరిత్ర, ఈ రెండింటి నడుమ ఒక గీత ఉంది. దీన్ని సరిగా అర్ధంచేసుకోవాలి. ఈ రచయిత అశోకుడు బౌద్ధుడు అవ్వకముందు చరిత్ర చూపుతున్నాడు.
అశోక అవధానం, దీప వంశ, మహావంశం, దివ్యావదానాలు చూపిస్తున్నారు. ఇవ్వన్నీ అశోకుని పూర్వ జీవితాలకు సంబంధించిందే!
అశోకుడు చరిత్ర చూద్దాం..
అశోకుడు మౌర్య చంద్రగుప్తుని (310-296) మనువడు. చంద్రగుప్తుడు జైనులు. ఇతని తండ్రి జైనులు. తల్లి మాత్రం అజీవక మతం. చంద్రగుప్తుడు చివరిక్ శ్రావణ బెగోళలోని ‘భద్రబాహుని’ వద్ద సల్లేఖనం వ్రతంపూని మరణించాడు. ఆ తర్వాత బిందుసారుడు (296-268) రాజయ్యాడు. అతని పెద్ద కొడుకు ‘సుమనుడు యువరాజయ్యాడు.
అశోకుడు ఉజ్జయినీ పాలకుడయ్యాడు. నిజానికి పింగళివత్సజీవుడు అనే ఆజీవక సన్యాసి అశోకుడు. సమనుల్లో ఎవరు యువరాజు కావాలి? అనే నిర్ణమాన్ని తీసుకున్నాడు. అతను అశోకుడే అనుకున్నాడు. కానీ, అతను సుమణున్ని యువరాజుని చేశాడు. అప్పుడు అశోకుడు ఉజ్జయినికి రాజ ప్రతినిధి అయ్యాడు. అప్పుడు తక్షశిలలో రాజ్యంపై తిరుగుబాటు జరిగింది. అశోకుడు వెళ్ళి దానిని అణచివేశాడు. దానితో ఖాసా ప్రాంతాన్ని తన రాజ్యంలో కలిపాడు.
అశోకుడు తిరిగి వచ్చాడు. వస్తూనే సుమణున్ని వ్యతిరేకించాడు. ఇద్దరికీ యుద్ధం జరిగింది. సుమణుడు ఓడాడు. భార్య, తనచంటి బిడ్డను తీసుకుని బౌద్ధ ఆరామానికి వెళ్ళింది. ఆ బిద్దే…ఆ తర్వాత 4 సంవత్సరాలకు అశోకుడు రాజయ్యాడు.
కళింగ యుద్ధం
ఆ తర్వాత కళింగ యుద్ధానికి దిగాడు. యుద్ధానికి దిగడంలో ప్రధాన పాత్ర ‘ఎవరైతే సుమణున్ని రాజుగా అంగీకరించారో’ వారంతా కళింగ చేరుకున్నారు. అదే మొట్ట మొదటి కారణం. కళింగ యుద్ధం (క్రీ.శ. 256) నెల రోజులు జరిగింది. పది ప్రాంతాల్లో తొమ్మిది అశోకుని వశమయ్యాయి. కళింగ రాజు బళ (క్రీ.పూ.225) నాయకత్వం వీరోచితంగా పోరాదుడు. ఓడాడు. ఈ యుద్ధంలో చనిపోయిన వారు ఒక లక్ష మంది. క్షతగాత్రులు ఒక లక్ష మంది. పట్టుబడిన వారు లక్ష ఏభై వేల మంది.
ఇది అంతా జరగటానికి అశోకుడు పాలనాకాలం ఎనిమిది సంవత్సరాలు గడచాయి. అశోకుడు మొదట శివభక్తుడు విదిష బౌద్ధ దేవాలయంలో శివుని గుడివుంది. శివుని గుడి భారత దేశంలో ఇదే తొలింటారు. ఆ తర్వాతే బౌద్దుదయ్యాడు.
అశోకుని కుటుంబం
ఇది అశోకుని రెండవ పార్శం
అశోకుడు చేసిన కొన్ని మంచి పనులు చూద్దాం..
అశోకుని సామ్రాజ్యాన్ని కీర్తించిన వాళ్ళే వీళ్ళు. అర్నేల్డ్ టాయినీ, స్ట్రాటో, డియోకోరస్, అరియన్, పేల్లీ, జేమ్స్ ప్రిన్సెస్, అలెగ్జాండర్ కన్నింగ్ హాం, కీల్మల్, ప్లేటో, బాయిలర్, జార్జి టన్నర్ లాంటి ఎందరో! ఎందరో!
1836లో శ్రీలంకలో జార్జి టన్నర్ ‘మహా వంశాన్ని’ పాళీలోకి అనువదించాడు అప్పుడే ‘దేవనాంప్రియుడు అశోకుడే అని తేలింది. 1837లో అశోకుని శాసనం దొరికింది. జేమ్స్ ప్రిన్సెస్ కూడా అది అశోక శాసనం అని గుర్తించాడు. ఆ తర్వాత గుజ్జర్, మాస్‌కి, నిటారు, ఊరుగోళం శాసనాలు దొరికాయి. వాటిల్లో “అశోకుడు” అని ఉంది. అవీ ఇవీ కలపగా, “అశోకుడు. దేవనాం ప్రియుడు, ప్రియదర్శి’ ఒక్కడే అని తేలింది. అశోకుని కాలంలో 3వ బౌద్ధ సంగీతి జరిగింది.
అశోకుని జీవిత చరిత్రలో కుటుంబ కొట్లాటలు కొన్ని ఉన్నాయి. అశోకుడికి 4 గురు భార్యలు. వీరిలో అసంధిమిత్ర ఒకరు. ఈమె పట్టపురాణి. ఈమె కుమార్తె జలౌక, అసంధిమిత్ర మరణంతో తిష్య రక్షిత పట్టపురాణి అయ్యింది. ఈమె అశోకుని ముద్రల్ని ప్రోగుజేసి పద్మావతి కుమారుడైన కుళాలుణ్ణి కళ్ళు పీకేస్తుంది. బుద్ద గయలోని బోధి చెట్టుని నరికిస్తుంది. బౌద్ధాన్ని నాశనం చేస్తుంది. చివరికి జ్ఞానోదయం కలిగి చెట్టుకు నీరు పెట్టి బ్రతికిస్తుంది.
అశోకుని తర్వాత కుణాళుడే రాజయ్యాడు.
ఇంకో భార్య విదిషాదేవి. ఈమె బిడ్డలే సంఘమిత్ర, మహీంద్రుడు. వీరిద్దరి వల్లే శ్రీలంకకు బౌద్ధం వెళ్ళింది.
ఇక, కారువాకి. ఈమె కళింగ స్త్రీ. అశోకుని తన సామ్రాజ్యాన్ని నాలుగు భాగాలు జేశారు. తక్షశిల, ఉజ్జయినీ, సువర్ణగిరి, తోసలి. వీటిలో తోసలి కళింగ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని కారువాకి కొడుకైన తిరువణ్ణి నాయకుణ్ణి చేశాడు.
అశోకుని శాసనాలు
అశోకుణ్ణి అతని శాసనాల ద్వారానే చూద్దాం.
అశోకుని రాజ్యంలో జైనులు, అజీవకులు, అచలక, జఠిల, లోకాయత, బ్రాహ్మణ, బౌద్ధుల ఉన్నారు. వీరందరికీ అశోకుని శాసనాలు ఉన్నాయి. జైనలు రావడంతో బ్రాహ్మణ మతం కొంత మంటగలిసింది. జైనం వచ్చాకే క్షత్రియులు శ్రమణులయ్యారు. మరి బౌద్ధం వచ్చాక…. దిగువ కులాల వాళ్ళు శ్రమణులయ్యారు. అశోకుని శాసనాలు అనేకం ఉ న్నాయి. వీటిలో ‘కులం’ ‘వర్ణా’ల తేడా లేదు.
అశోకుని చెప్పిన శాసనాలు ఇవి:
కళింగ యుద్ధం అశోకునిలో కలిగించిన పరివర్తన ఎమంటే “యుద్ధం విజయాలకన్నా …. ధర్మం విజయమే గొప్పదని చాటుతుంది” (శిలా శాసనం 13) తనుగాని, తన కుమారులుగానీ, మనుమలుగానీ, ముది మనుమలుగానీ… ఆ తర్వాత వచ్చేవారందరూ ధర్మ విజయాన్నే గొప్పదని భావించాలి (స్తంభ శాసనం-7), ఇలా చూసుకుంటూ పోతే తల్లిదండ్రుల్ని గౌరవించటం, అన్యమత సహనం కలిగి ఉందటం, జీవ జంతువుల పట్ల కరుణ, స్వయం శిక్షణ ఉండటం, దుర్లక్షణాలకు దూరంగా ఉండడం, పరిమితమైన కొన్ని ఉత్సవాల పట్ల మాత్రమే ఆసక్తిని కలిగి ఉండడం, నిర్భీతిగా జీవించటం, అహింసను జీవన విధంగా ఎంచుకోవడం ఇలాంటి ఎన్నో శాసనాలు జీవన మార్గాన్ని జ్ఞప్తి జేస్తాయి.
అలాగే….. “ప్రజలందరూ నా బిడ్డలే! వాళ్ళు రాజ భయం లేకుండా నివసించాలి” అన్నాడు.
“నేను భోజనం చేస్తున్నా, స్త్రీ సమక్షంలో ఉన్నా, శయ్యా మందిరంలో ఉన్నా, ఉద్యాన వనంలో ఉన్నా. అన్ని వేళల ప్రజలు నన్ను దర్శించవచ్చు. నా ప్రజల సుఖం కోసం, సంక్షేమం కోసం నేను అహర్నిశలు, అవిశ్రాంతంగా పనిజేస్తాను” అన్నాడు అశోకుడు.
అలాగే … 60 వేల మందికి శ్రమణులకూ, బ్రాహ్మణులకూ ప్రతి రోజూ భోజనం పెట్టాడు. వైదిక, జైన ఆదరం చూపాదు. భూరి విరాళాలు ఇచ్చాడు. ఆజీవరులకు గుహలను కల్పించాడు.
చెట్టు నాటడం, వనాలు పెంచడం, మనుషులకు, జంతువులకూ, పక్షులకూ వైద్యశాలలు నిర్మించాడు.
అలాగే… ఉరిశిక్షను రద్దు చేశాడు. కళింగలో అపజయం పొందిన వారినందర్నీ రక్షించి, ఒక్కొక్కరికి 5 ఎకరాల భూమి ఇచ్చాడు. కళింగ దేశంలో ఎవ్వరైనాగాని (కళింగ పౌరులు తప్ప) స్థలాలు, పొలాలు కొన్నా అవి చట్టం పరిధిలోకి రావు అని తీర్మానించాడు.
అలాగే … గోడ పత్రికలనూ, వార్తా పత్రికలను ప్రోత్సహించాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే అశోకుడు చేసిన మంచి పనులను ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదు. చేయలేరు.
అందుకే హెచ్.జి. వెల్స్ ఇలా “ప్రపంచంలో మనకు తెలిసిన రాజులందరూ నక్షత్రాల్లాంటివాళ్ళు. అశోకుడు ఒక్కడే పున్నమి చంద్రుడు” అంటాడు.
“When ever I consider the physical land scape of humanity, the image Ashoka the great, India’s outstanding ancient sovereign comes inevitable to my mind” – అంటాడు జపాన్ బౌద్ధ తాత్త్వికుడు డైకె ఐకెతా.
ధర్మచక్రం
హింసించడం, చంపడం వంటివి అది మానవ చర్యలు. రక్షించడం ఒక్కటే మానవ చర్య. ఇలాంటి మానవవాది అశోకుడు. మన దేశం స్వాతంత్ర్యం పొందాక అశోకుని గట్టిగా గుర్తించుకొంది.
అశోకుని పేర అనేక బిరుదులు ఉన్నాయి.
ఒక ముస్లిం ఐ.సి.ఎస్. అధికారి, ప్రతిపాదించగా…. ‘జాతీయ ముద్రను అంగీకరించారు. అది నాలుగు మధ్యలో అశోకుని ధర్మచక్రం. మన జాతీయ సింహాలు, ఒక గుర్రం, ఒక ఎద్దు, ఒక ఒక జెండాలో మధ్యలో ఉన్నది ఆ అశోకుని ధర్మచక్రమే!
అంతే కాదు
జాతీయ పక్షి – నెమలి (మౌర్య వంశ సింహాసనం)
జాతీయ పుష్పం – పద్మం (బోధిసత్త్వుని పద్మం)
అత్యున్నత సైనిక బిరుదు – అశోకచక్ర భారత రత్న- జోధిపత్రం
ఇవ్వన్నీ అశోకుని గుర్తులే బౌద్ధ విహ్నాలే!
అశోకుడు వేసిన మేళ్ళన్నీ బుద్ధుడు చెప్పిందే!
ఆదిశంకరాచార్య
ఇంకా ఆదిశంకరాచార్య విషయం (క్రీ.శ.788-820) ఇతను తత్వవేత్త అనన్య సామాన్య ప్రవీణుడు, కేరళవాసి, కవులవాది, ఇతని సిద్ధాంతం జైనం. బౌద్ధ మీదే కాదు, వైష్ణవం మీద కూడా దాడి చేశాడు. ముఖ్యంగా క్రీ.శ 300 నుండి క్రీ.శ. 800 వరుకు ఈ దాడి జరిగింది. శంకరుడు బుద్ధుడు పుట్టిన 1400 సంవత్సరాలకి, నాగార్జునుడి 600 సంవత్సరాలకి, ధర్మకీర్తి 200 సంవత్సరాకీ పుట్టాడు.
బౌద్ధంలో ఆఖరివాడు ధర్మకీర్చే ధర్మకీర్తి శిష్యుల్లో వివరివాడు శంకరానంద. శంకరాచార్య కూడా శంకరానంద సమకాలినుడి! అంటీ … బౌద్ధం అంతరిస్తున్న కాలంలో శంకరాచార్య పుట్టాడు. శంకరాచార్య గురువు గోవిందుడు. అతని గురువు గౌడపాదుడు. తన మాండూక్యకారిక కొద్దిగా అటో ఇటో బౌద్ధం పైనే వంగింది. అందుకే అద్వైతుల అద్వైతం, బౌద్ధుల కార్యాకారణ వాదం రెండూ వేరు వేరు కాదు.
అలాగే… 11వ శతాబ్దంలో వచ్చిన రామానుజుడు విశిష్ట అద్వైతి. రామానుజుడి మీద 3. హత్యా ప్రయత్నాలు జరిగాయి. వీరంతా బ్రాహ్మలే “నారాయణ మంత్రాన్ని” కుల సంస్కరణగా చేశాడు. వారిలో మాలవారు, మాదిగవారు కూడా ఉన్నారు.
బుద్ధుడు కుల నిర్మూనిర్మూలన వాది. రామానుజు కుల సంస్కరణ వాది
రామానుజుని మీద బౌద్ధ సర్వాస్తివాద ప్రభావం ఉంది. శంకరుని మీద నాగార్జునుడి ప్రభావం ఉంది:
శంకరుణ్ణి ప్రచ్ఛన్న బౌద్ధుడు అంటారు రామానుజుడు.
‘బౌద్ధం, విశిష్ట అద్వైతం రెండు తోడు దొంగటే అంటాడు శంకరుడు,
రామానుజుణ్ణి ‘జగత్ గురువు అన్నారు రామానుజ భక్తులు, “పీరెవరు న శంఠరుటీ జగత్ గురువు” అన్నారు శంకర భక్తులు. రెండూ తన్నుకు చచ్చేవరకూ వెళ్ళాయి!
“ఆత్య ఉంది” అంటారు శంకరుడు. “కాత్మ లేదు” అంటుంది బౌద్ధం..
ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, సౌందర్యలహరి, ఇవ్వన్నీ శంకరాచార్య కృతులు, ఇతక్షి కృతికర్తగానే గుర్తింపు, శంకరాచార్యకు బుద్దుడికీ, అశోకుడికి ఉన్నంత కీర్తి, గుర్తింపు ఉన్నదా?:
మూడు రకాలుగా బ్రాహ్మణుల్ని బుద్ధుడు చెప్పాడు. ఒకడు: యజ్ఞ యాగాల్ని నిర్వహించేవారు. వీటిని పూర్తిగా వ్యతిరేకించాడు. ఇంకొకరు – వ్యవసాయం చేసేవారు. వీరితో పక్రమంజనే సాగారు. వీరిని బౌద్ధంలోకి ఆహ్వానించారు. మూడు జ్ఞాన మార్గంలో సాగేవారు. వీరినీ ఆహ్వానించారు.
బుద్ధుని చూడగానే…… గోచీగొంగడీ ఊడి పోయి, చేతికి ఏదినస్తే అది రాయకూడదు. మీరు చెప్పిన దేశాలన్నీ శ్రీలంక, కంబోడియా, యమన్నార్, థాయ్‌లాండ్ లా హెూర్, వియత్నాం, మంగోలియా, ఓబెట్, తైవాన్, చైనా, జపాన్, భూటాన్- ఇవ్వన్నీ బౌద్ధ దేశాలే. కానీ.. అవి పూర్తిగా బౌద్ధ దేశాలు కావు. మీరు వెప్పిన వాటిలో భూటాన్ ఒక్కటే బౌద్ధ దేశం. అప్పుడు ప్రపంచంలో 200 దేశాల్లో బౌద్ధం ఉంది.
నిజానికి గాంధీ, సాహ్రూలు బౌద్ధ అనుయాయులే. వారందరికీ మించి నేటి మన ప్రధాని నరేంద్రమోదీ కూడా ఒప్పు బొద్దుడే ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతూ – మాది యుద్ధాన్ని కన్న దేశం కాదు. బుద్ధుణ్ణి కన్న దేశం” అన్నారు..
– బొర్రా గోవర్ధన్
9390600157