– మాజీ శాసనమండలి సభ్యులు బుద్దా వెంకన్న
గజ దొంగల పార్టీలో 420 గాళ్లకు కొదవే లేదు. అసలు గజ దొంగ మీ జగన్ రెడ్డే అన్న విషయాన్ని కారుకూతల కారుమూరి మర్చిపోయారా? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు, తన అధికారాన్ని అడ్డం పెట్టొకొని రూ.2 లక్షల కోట్లు దోచిన ప్రపంచపు అతి పెద్ద ఆర్ధిక ఉగ్రవాది జగన్ రెడ్డి. 38 కేసుల్లో ఏ1 ముద్దాయి, 16 నెలల పాటు జైళ్లో చిప్పకూడు తిన్న జగన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగిన కారుమూరి నోటి నుండి శ్రీరంగ నీతులు వస్తాయా? చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత కారుమూరికి నాగేశ్వరరావుకు లేదు.
సొంత బాబాయ్ ని హత్య చేయించిన నీచుడి పంచ చేరి నోటికి హద్దు లేకుండా మాట్లాడుతున్నావు. తల్లికి, చెల్లిళ్లనే తరిమేసినోడికి ప్రజలో లెక్కా? తండ్రిని హత్య చేయించారని ఆరోపించిన వాళ్లకే రాజ్యసభ పదవులు కట్టబెట్టిన దుర్మార్గపు పుత్రుడు జగన్ రెడ్డి కాదా? వివేకానందరెడ్డి హత్య కేసు, కోడికత్తి కేసులు తీర్పులు దగ్గర పడే కొద్ది జగన్ రెడ్డికి ముచ్చెమటలు పడుతున్నాయి. జగన్ రెడ్డి చేసిన పాపాలు ఊరికే పోవు. కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది కాని పాపపుప్రక్షాళన మాత్రం తప్పదు. చేసిన కర్మ అనుభవించాలి.
తెలుగుదేశం ప్రభుత్వం అందించిన పథకాలకు పేర్లు మార్చి, గత భవనాలకు రంగులు మార్చి గోరంత సంక్షేమానికి కొండంత ప్రచారం చేసుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను నయవంచనకు గురి చేస్తున్నారు. 4 ఏళ్ల పాలనలో చేసింది ఏమీ లేక స్టిక్కర్లు అంటించుకోవడం సిగ్గుగా లేదా? ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీ నాయకుడిని విమర్శించడం వైసీపీ నాయకులకు పరిపాటిగా మారింది.