Suryaa.co.in

Andhra Pradesh

రోజా.. ముందుగా తనను తాను అద్దంలో చూసుకోవాలి

– విజయసాయిరెడ్డి సీఎం జగన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు
– టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న
– మహిళలపై జరుగుతోన్న దాడులకు నిరసనగా బుద్దా వెంకన్న నేతృత్వంలో ఆందోళన.
– వాసిరెడ్డి పద్మకు వ్యతిరేకంగా నినాదాలు

అధికారం పోతుందని సీఎం జగన్ భయపడుతున్నారు. విజయసాయిరెడ్డి సీఎం జగన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వకుంటే అప్రూవరుగా మారతానని విజయసాయి రెడ్డి జగనుకు స్పష్టం చేశారు. జగన్ను బ్లాక్ మెయిల్ చేయడం వల్లే.. పక్కన పెట్టిన విజయసాయి రెడ్డికి అందరికంటే పెద్ద పదవి ఇచ్చారు.

విజయసాయి రెడ్డిని జగన్ పక్కన పెట్టేశారని మేం అనడం లేదు.. వైసీపీ నేతలే అంటున్నారు. విజయసాయిరెడ్డికి ఉన్నట్టుండి కీలక బాధ్యతలు అప్పజెప్పారంటే బ్లాక్ మెయిలే కారణ మంత్రివర్గం కూర్పులోనూ జగన్ భయపడ్డారు.తాను తొలగించాలనుకున్న వారికీ జగన్ మంత్రి పదవులిచ్చారు.. పదవులివ్వలేని వాళ్లను బుజ్జగించారు.

జగనుకు భయం లేదని కొడాలి నాని మాటలు అవాస్తవమని తేలిపోయింది. ఎనుగు వెళ్తోంటే కుక్కలు మొరుగుతాయన్నట్టు.. చంద్రబాబుకు వాసిరెడ్డి నోటీసులిచ్చారు. నోటీసులిస్తే జగన్ వద్ద మార్కులు పడతాయని వాసిరెడ్డి పద్మ భావిస్తున్నారు. వాసిరెడ్డి పద్మ స్థాయేంటీ..? చంద్రబాబుకు ఇచ్చిన నోటీసు చెత్త కాగితంతో సమానం.

మహిళా కమిషన్ ఛైర్ పర్సనుగా వాసిరెడ్డి పద్మను తప్పించాలి.అధికారులు, పోలీసులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.గౌతమ్ సవాంగ్ ఏమయ్యారో చూశారా..? గౌతమ్ సవాంగ్ తరహాలో అధికారులు బలి పశువులవుతారు.

నాగుల్ మీరా, టీడీపీ సీనియర్ నేత:
అచ్చెన్నాయుడుని ఆంబోతన్న రోజా.. ముందుగా తనను తాను అద్దంలో చూసుకోవాలి. రోజా ఇష్టం వచ్చినట్టు మాట్లాడ్డం సరికాదు. మంత్రిగా ఉన్న రోజా హుందాగా వ్యవహరించాలి.

LEAVE A RESPONSE